జగదల్‌పూర్

(జగదల్‌పుర్ నుండి దారిమార్పు చెందింది)
  ?జగదల్‌పుర్
ఛత్తీస్‌గఢ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°04′N 82°02′E / 19.07°N 82.03°E / 19.07; 82.03
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 552 మీ (1,811 అడుగులు)
జిల్లా (లు) బస్తర్ జిల్లా జిల్లా
జనాభా 1,03,687 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 494001
• +07782
• I
• CG-17

జగదల్‌పుర్ దక్షిణ చతీస్‌గడ్‌లోని ఒక పట్టణం, చారిత్రక బస్తర్ జిల్లా యొక్క కేంద్రం. ఈ పట్టణం బ్రిటిష్ పాలనలోని బస్తర్ సంస్థానం యొక్క రాజధాని.

పర్యాటన

మార్చు

ఈ పట్టణానికి ఉత్తరాన 30 కిలో మీటర్ల దూరాన చిత్రకూట ‍జలపాతములు ఉన్నాయి. దక్షిణాన 35 కిలో మీటర్ల దూరాన కాంగేర్ లోయ జాతీయ అరణ్యం ఉంది. కాంగేర్ లోయ జాతీయ అరణ్యంలో తీరత్‌గఢ్ జలపాతములు, కుటుంసర్ గుహలు, కైలాస గుహలు ఉన్నాయి.

రవాణా

మార్చు

జగదల్‌పుర్ నుంచి రాయగడ, విజయనగరంల మీదుగా భుబనేశ్వర్ వెళ్ళే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్, అరకు లోయ మీదుగా వెళ్ళే కిరండూల్-విశాఖపట్నం పాసింజర్ బండ్లు ఉన్నాయి.

చరిత్ర

మార్చు

బస్తర్ రాజవంశానికి పృథ్విరాజ్ చౌహాన్ వంశ మూలాలతో పాటు నల, చాళుక్య &‍‍ కాకతీయ వంశాల మూలాలు ఉన్నాయి. కాకతి ప్రతాప రుద్రుడు ముహమ్మదీయుల చేతిలో ఓడిపోయిన తరువాత అతని సోదరుడు అన్నమదేవుడు ఇంద్రావతి నదీ తీరానికి పారిపోయి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆ రాజ్యమే బస్తర్ ప్రాంతం. అతని వంశస్తులే బ్రిటిష్ ప్రభుత్వం కింద బస్తర్ సంస్థానాధీశులుగా పనిచేశారు. బస్తర్ రాజ వంశస్తులలో ఒకరైన ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన పోరాడి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు.