జగ్గడిగుంటపాలెం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
జగ్గడిగుంటపాలెం గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. గ్రామ జనాభా సుమారు 5,055. ఇందులో సుమారు 3,447 మంది ఓటర్లున్నారు. పురుషుల సంఖ్య సంఖ్య 1724. స్త్రీల సంఖ్య 1,723.
జగ్గడిగుంటపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°12′59″N 80°39′22″E / 16.216449°N 80.656113°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తెనాలి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ దాసరి సుధీర్ M.A., LL.B., (Advocate) |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ చరిత్ర
మార్చుఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
మార్చుతాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామం పేరు వెనుక చరిత్ర
మార్చుజగ్గడిగుంటపాలెం అంటే చాలామంది గ్రామస్తుల్లో భిన్నమైన అభిప్రాయాలున్నవి. ఎక్కువమంది చెప్పే సమాచారం మాత్రం, "జగ్గడు" అనే వ్యక్తి గ్రామానికి చేరుకొని నివాసం ఏర్పరచుకోవటం. అతని ఇల్లు చెరువులాంటి గుంటవెంట ఉండటంతో కాలక్రమంలో "జగ్గడిగుంట"గా మారింది. అనంతరకాలంలో, కొందరు వలస కుటుంబాలవారు, గుంట చుట్టూ చేరి నివాసాలు ఏర్పరచుకోవటంతో, పాలెంగా మారి "జగ్గడిగుంటపాలెం"గా మారింది.
గ్రామ పంచాయతీ
మార్చు- 1932లో ఈ గ్రామం, పంచాయతీగా ఏర్పడింది. 1932 నుండి 2006 వరకూ, పురుషులే సర్పంచులు. 2006 లో శ్రీమతి కుర్రా విజయలక్ష్మి తొలి మహిళాసర్పంచిగా ఎన్నికైనారు. మురికికూపంలాగా ఉన్న వూరిని శాసనసభ్యుని సహకారంతో ఈమె అభివృద్ధి చేసింది. శాసనసభ్యుని నిధులూ, ఎం.పి. నిధులూ, మండల అభివృద్ధి నిధులూ రు.83.40 లక్షలతో గ్రామానికి సిమెంటు రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టినారు. కళాణమంటపనిర్మాణానికి 10 లక్షల రూ. వినియోగించారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దాసరి సుధీర్ M.A., LL.B., (Advocate) సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచ్‌గా కాజా బాలాజీ ఎన్నికైనారు.
- ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ కమ్మ రామసుబ్బారావు, అంకితభావంతో విధినిర్వహణ చేసినందులకు, 2016-17 సంవత్సరానికిగాను, రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి పురస్కారానికి ఎంపికనారు. వీరికి ఈ పురస్కారాన్ని 2017, ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, విజయవాడలో నిర్వహించిన వేడుకలలో భాగంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా అందించారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ సీతారామమందిరం
మార్చుఈ గ్రామములోని ప్రగడ కోటయ్యనగర్ లో వెలసిన ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందభంగా, 2015, మార్చి-27వ తేదీ శుక్రవారం నాడు, 108 కలశాల సుగంధద్రవ్యాలతో, శ్రీ సీతారాములకు అభిషేకం, విశేషార్చన నిర్వహించెదరు. [3]
శ్రీరామమందిరం
మార్చుగ్రామములోని ఇందిరా ప్రియదర్శిని గౌడ కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ హనుమత్, లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016, ఫిబ్రవరి-25వ తెదీ గురువారం ఉదయం 7-54 కి నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టు దర్శనానికి అనుమతించారు. 11 గంటలకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, 24వ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. [5]
శ్రీ వీరాంజనేయస్వామి ఆలయo
మార్చుఈ గ్రామములోని ఈ ఆలయ పునర్నిర్మాణం జరుగుచున్నది. 2014, ఫిబ్రవరి-6న, ఉదయం 8-20 కి విగ్రహ ప్రతిష్ఠ జరుగును.[2]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామంలోని ఒక చేనేత కుటుంబానికి చెందిన గోలి శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతుల కుమారుడు లీలాకృష్ణ, ఇటీవల వెలువడిన డైట్ సెట్ పరీక్షా ఫలితాలలో, 100 మార్కులకు 81 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలోనే ప్రథమ ర్యాంక్ పొందినాడు.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి, 11 జులై 2013. 2వ పేజీ.