వడ్డేశ్వరం

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా, తాడేఫల్లి మండలం లోని జనగణన పట్టణం

వడ్డేశ్వరం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన జనగణన పట్టణం. పిన్ కోడ్ నం. 522 502., ఎస్.టి.డి.కోడ్ = 08645.

వడ్డేశ్వరం
—  రెవిన్యూ గ్రామం  —
వడ్డేశ్వరం is located in Andhra Pradesh
వడ్డేశ్వరం
వడ్డేశ్వరం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°26′40″N 80°36′28″E / 16.444511°N 80.607713°E / 16.444511; 80.607713
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తాడేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కత్తిక మల్లేశ్వరి
జనాభా (2011)
 - మొత్తం 6,275
 - పురుషుల సంఖ్య 3,087
 - స్త్రీల సంఖ్య 3,188
 - గృహాల సంఖ్య 1,534
పిన్ కోడ్ 522502
ఎస్.టి.డి కోడ్ 08645

గ్రామ చరిత్రసవరించు

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలుసవరించు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

కుంచనపల్లి 2 కి.మీ, ఇప్పటం 1 కి.మీ, గుండిమెడ 3 కి.మీ, పెదవడ్లపూడి 4 కి.మీ, చినవడ్లపూడి 4 కి.మీ.

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన తాడేపల్లి మండలం, తూర్పున విజయవాడ మండలం, ఉత్తరాన విజయవాడ రూరల్ మండలం, దక్షణాన దుగ్గిరాల మండలం.

గ్రామములోని విద్యాసౌకర్యాలుసవరించు

కె.ఎల్. విశ్వవిద్యాలయంసవరించు

(K.L. UNIVERSITY).

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

శ్రీ బచ్చు లక్ష్మీనారాయణ అనే దాత 28 సెంట్ల స్థలాన్ని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఆటస్థలానికి 3.3 ఎకరాల స్థలం ఇచ్చారు. శ్రీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించి ఇచ్చారు. ఇంకా కొందరు దాతలు, ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, క్రీడాభివృద్ధికీ విరాళాలు అందజేశారు. [4]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలసవరించు

ఉర్దూ ప్రాథమిక పాఠశాలసవరించు

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

  1. అంగన్ వాడి కేంద్రం.
  2. ఈ గ్రామంలో, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమిలేకపోవడం ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తుంది.
  3. కొందరు దాతల సహకారంతో, గ్రామంలో త్రాగునీరు, విద్యావసతులు బాగుపడినవి. శ్రీ మల్లిఖార్జునరావు అనే దాత, శుధ్దజల కేంద్రాన్నీ, నీటిపథకాలకు అవసరమైన జనరేటర్లనూ ఇచ్చారు.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కత్తిక మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ రుద్రేశ్వరస్వామివారి ఆలయంసవరించు

శ్రీ కత్తిక పూర్ణచంద్రరావు, పార్వతి దంపతులతోపాటు శ్రీ కత్తిక రాఘవరావు, రాజ్యలక్ష్మి దంపతులు, 2017, ఫిబ్రవరి-22న, ఈ ఆలయానికి రథం, రెండు గొడుగులను అందించారు. శ్రీ వడ్లమూడి వెంకయ్య, శివనాగేంద్రమ్మ దంపతులు ఒక ఇత్తడి నందివాహనాన్ని స్వామివారికి సమర్పించారు. [6]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం, 2017, మార్చి-23వతేదీ గురువారంనాడు వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. [7]

ప్రధాన వృత్తులుసవరించు

ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం కూలి పనులు, వ్యవసాయం పనులు. యూనివర్సిటీ విద్యార్థులు ఈ గ్రామంలో అద్దెకి ఉంటారు.

ఇతర విశేషాలుసవరించు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) పథకం క్రింద, వడ్డేశ్వరం గ్రామాన్ని అభివృద్ధి చేయటానికై, ఆ గ్రామాన్ని దత్తత తీసికొనడానికి, ఆ గ్రామ సర్పంచి భర్త శ్రీ కత్తిక మల్లేశ్వరరావు మరియూ కొలనుకొండకు చెందిన శ్రీ గొట్టిపాటి వెంకటేశ్వరరావు, ముందుకు వచ్చారు. [5]

గ్రామజనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామజనాభా 6000 నుండి 7000 వరకు ఉంటుంది. ఈ గ్రామంలో కళాశాల విద్యార్థులతో కలుపుకుని 9000 మంది జనాభా ఉన్నారు.

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,668.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,487, స్త్రీల సంఖ్య 2,181, గ్రామంలో నివాస గృహాలు 1,162 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 6,275 - పురుషుల సంఖ్య 3,087 - స్త్రీల సంఖ్య 3,188 - గృహాల సంఖ్య 1,534

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-08-21.