జనార్ధనపురం (గురజాల)
పల్నాడు జిల్లా లొని గురజాల మండలంలో జనార్ధనపురం అనే పల్లెటూరు ఉంది. ఈ పల్లెలో ఎటువంటి భోధన పాఠశాలలు లేవు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న పిల్లలు పక్క ఊరికి వెళ్లి చదువుకుంటున్నారు. అందుకే ఈ ఊరిలో నిరక్షరాస్యత కొంతమేరకు ఉంది. అంతే కాకుండా ఇదొక అందమైన పల్లెటూరు. ఇక్కడ నివాసం ఉన్నవారంత ఒకప్పుడు ప్రక్క ఊరు అయిన మిరియాల గ్రామం నుండి వచ్చి ఇక్కడ స్థిర పడిన వారు. ఈ ఊరికి మొత్తం రెండు ప్రధాన వీధులు ఉంటాయి. ఒకప్పుడు 60 వరకు ఉన్న ఇల్లులు ఇప్పుడు దాదాపు 100 వరకు పెరిగాయి. ఉరికి చుట్టుప్రక్కల పచ్చని పొలాలు, నీటి కాలవలు ఉండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ అందమైన పల్లెవాతావరణం.
జనార్ధనపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°35′36″N 79°37′29″E / 16.593423°N 79.624672°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | గురజాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522415 |
ఎస్.టి.డి కోడ్ |
ఆంధ్రప్రదేశ్ ప్రధాన పండుగులకు ఈ పల్లెలోని సంభరాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ఇదే ఊరిలో ఒకప్పుడు గురవమ్మ వేపచెట్టు క్రింద ఊరి పెద్దలు కూర్చొని ఎంతో హాయిగా, సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇప్పుడయితే రామాలయం వరండాలోను, ప్రక్కన ఉన్న చిన్న షాపు దగ్గర ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సరదాగా ముచ్చటించుకుంటారు. ప్రస్థుతం ఈ సంవత్సరం రామాలయం గుడికి ద్వజస్థంభంను ప్రతిష్టిస్తున్నారు. రామాలయం గుడికి ద్వజస్థంభ ప్రతిస్టించె తేది 2012/03/14, మార్ఛిలో జరుగుతుంది. దాదాపుగా ఈ కార్యక్రమానికి 10 లక్షల వరకు ఖర్ఛుతో ఘనంగా నిర్వహైస్థున్నారు. ఈ పల్లెవారు 2012 నాటికి ఈ పల్లెలో ఉండి 40 సంవత్సరాలు అవుతుంది. అయితే 2012 వ సంవత్సరం సంక్రాంతి వేడుకలు ఈ పల్లెలో విషాదాన్ని మిగిల్చింది. మిలట్రీలో పనిచేస్తున్న ఒక యువకుడు జనవరి 14 న ఢిల్లీలో మరణించాడు. దీనితో ఆ ఊరివారు పండగ సంభరాలను జరుపుకోలేదు. మిలట్రీ వారు అతని భౌతిక కాయాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.తాజాగ ఈ ఊరిలొ సిమెంట్ రోఢ్డును వేసారు.