జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019

భారత పార్లమెంటు చట్టం

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 అన్నది భారత పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టం. 2019 అక్టోబర్ 31 నాటికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి జమ్మూ కాశ్మీర్, లడఖ్ అన్న రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేయాలన్న నిబంధనలు దీనిలో ఉన్నాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు. ఈ బిల్లు 2019 ఆగస్టు 5న రాజ్యసభలో, ఆగస్టు 6న లోక్‌సభలో ఆమోదం పొందింది.[2][3] ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు 370 అధికరణం కింద భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించేలా ఇంటర్ ఆలియాను వర్తింపజేశారు. భారత పార్లమెంటు రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ చట్టాన్ని తీసుకువచ్చేలా ఈ ఘటన అవకాశమిచ్చింది.

జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019
భారత పార్లమెంటు
2019 జూలై వరకు ఉన్న జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడానికి, దానికి సంబంధించిన అంశాలతో వ్యవహరించడానికి వీలునిచ్చే చట్టం
Citation2019లో 34వ నెంబరు చట్టం
Enacted byరాజ్యసభ
Date enacted2019 ఆగస్టు 5
Enacted byలోక్‌సభ
Date enacted2019 ఆగస్టు 6
సంతకం చేసిన తేదీ2019 ఆగస్టు 9
సంతకం చేసినవారుభారత రాష్ట్రపతి
Date effective2019 అక్టోబర్ 31[1]
Legislative history
Bill published on2019 ఆగస్టు
Introduced byఅమిత్ షా
కేంద్ర హోంమంత్రి
స్థితి: అమలైంది

నేపథ్యం

మార్చు

భారత రాజ్యాంగంలోని 370 అధికరణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది. దీని వల్ల భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా జమ్మూ కాశ్మీరులో తనకంటూ ప్రత్యేకమైన రాజ్యాంగం, ఈ ప్రాంతంలో పరిపాలనలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది.[4] ప్రత్యేకించి, ఇతర రాష్ట్రాలకు చెందిన భారత పౌరులు జమ్మూ కాశ్మీరులో భూములు, స్థిరాస్తులు కొనడానికి అవకాశం లేదు.[5]

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో మూడు భిన్నమైన ప్రాంతాలు ఉన్నాయి. అవి హిందువుల సంఖ్యాధిక్యత కలిగిన జమ్మూ, ముస్లింల సంఖ్యాధిక్యత కల కాశ్మీరు, బౌద్ధుల సంఖ్యాధిక్యత కలిగిన లడాఖ్.[6] ముస్లిం సంఖ్యాధిక్యత కలిగిన కాశ్మీర్ ప్రాంతంలో హింస, అస్థిరత కొనసాగుతూ వచ్చింది. 1987లో తీవ్రమైన రిగ్గింగ్ జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత స్వయంపాలన, హక్కుల కోసం హింసాత్మకమైన తిరుగుబాటు ఏళ్ళ తరబడి కొనసాగింది.[7][8] భారతీయ జనతా పార్టీ 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఐదు సంవత్సరాల తర్వాత భాజపా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తోసిపుచ్చి, జమ్మూ కాశ్మీరును ఇతర రాష్ట్రాలతో సమాన ప్రతిపత్తికి తీసుకువస్తామన్న అంశాన్ని చేర్చారు.[9]

చట్టం వివరాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original on 2019-08-09. Retrieved 2019-08-11.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Indian Express అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. K. Venkataramanan (5 August 2019), "How the status of Jammu and Kashmir is being changed", The Hindu
  5. "Article 370 and 35(A) revoked: How it would change the face of Kashmir". The Economic Times. 5 August 2019.
  6. Article 370: What happened with Kashmir and why it matters. BBC (2019-08-06). Retrieved 2019-08-07.
  7. "Kashmir insurgency". BBC News. Archived from the original on 22 ఫిబ్రవరి 2017. Retrieved 21 ఫిబ్రవరి 2017.
  8. Jeelani, Mushtaq A. (25 జూన్ 2001). "Kashmir: A History Littered With Rigged Elections". Media Monitors Network. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 11 ఆగస్టు 2019.
  9. Article 370: What happened with Kashmir and why it matters. BBC (2019-08-06). Retrieved 2019-08-07.