జమ్‌షెడ్జీ టాటా

భారతదేశ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ స్థాపకుడు
(జమ్సేట్జి టాటా నుండి దారిమార్పు చెందింది)

జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా (1839 మార్చి 3 - 1904 మే 19) ఒక భారతీయ మార్గదర్శక పారిశ్రామికవేత్త. అతను భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ను స్థాపించాడు.[1]

జమ్‌షెడ్జీ టాటా
జననం(1839-03-03)1839 మార్చి 3
నవరి, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం గుజరాత్, భారతదేశం)
మరణం1904 మే 19(1904-05-19) (వయసు 65)
బాద్ నాహేం, గ్రాండ్ డచీ ఆఫ్ హెస్సె, జర్మనీ రాజ్యం
విద్యాసంస్థఎల్‌ఫిన్‌స్టోన్ కళాశాల
వృత్తిటాటా గ్రూపు వ్యవస్థాపకుడు
టాటా స్టీల్ వ్యవస్థాపకుడు
నికర విలువ£4 మిలియన్ (1900)
జీవిత భాగస్వామిహీరాబాయి దాబూ
పిల్లలు4 (దొరాబ్జీ టాటా, రతన్‌జీ టాటా, ఇద్దరు కుమార్తెలు

అతను తరువాత టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించాడు. టాటాను "భారతీయ పరిశ్రమ పితామహుడు"గా భావిస్తారు.[2] అతను పారిశ్రామిక ప్రపంచంలో ఎంత ప్రభావం చూపించాడంటే, భారత దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ టాటాను వన్ మ్యాన్ ప్లానింగ్ కమిషన్ ‌గా అభివర్ణించాడు.[3]

తన ప్రారంభ జీవితంలో వ్యాపారి అయిన టాటా, పత్తి, దుక్క ఇనుము పరిశ్రమలలో అనేక వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చాడు. అతను ఆధునిక భారతీయ ఆర్థిక వ్యవస్థకు అతి ముఖ్యమైన నిర్మాతలలో ఒకనిగా గుర్తింపు పొందాడు. టాటా సాధించిన అనేక విజయాలలో జంషెడ్‌పూర్‌లోని టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ సంస్థ ప్రసిద్ధి చెందింది.[4] టాటా ఐరన్, స్టీల్ వర్క్స్ తో పాటు, ఆధునిక భారతీయ వ్యాపారానికి పునాదిగా నిలిచిన అనేక ఇతర రంగాలలో వ్యాపారాలను స్థాపించారు.

ప్రారంభ జీవితం

మార్చు

జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3 న దక్షిణ గుజరాత్ లోని నవసరి అనే నగరంలో నుస్సెర్వాన్‌జీ, జీవన్బాయి టాటా దంపతులకు జన్మించాడు. జమ్సెడ్జీ టాటా, అతని కుటుంబం ఇరాన్‌లోని జొరాస్ట్రియన్ల మత ద్వేషం కారణంగా భారతదేశానికి వలస వచ్చిన జొరాస్ట్రియన్లు లేదా పార్సీల మైనారిటీ సమూహంలో ఒక భాగం[5]. అతను గౌరవప్రదమైన పేద పూజారుల కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి, నుస్సెర్వాన్‌జీ, పార్సీ జొరాస్ట్రియన్ పూజారుల కుటుంబంలో మొదటి వ్యాపారవేత్త. అతను ఆ కుటుంబంలో వ్యాపారాన్ని ప్రారంభించిన తొలి వ్యక్తిగా అవతరించాడు. ముంబైలో ఎగుమతి వాణిజ్య సంస్థను ప్రారంభించాడు.

అతని తల్లిదండ్రులు అతనికి చిన్న వయస్సు నుండే ప్రత్యేక మానసిక అంకగణితం అభ్యసనం చేయించినందున, ఇతర జొరాస్ట్రియన్ల మాదిరిగా కాకుండా జమ్సెట్జీ టాటాకు అధికారిక పాశ్చాత్య విద్య అబ్బింది. అయినప్పటికీ మరింత ఆధునిక విద్యను పొందడానికి తరువాత అతన్ని బొంబాయి పంపించారు.[5]

జమ్సెడ్జీ టాటా 14 సంవత్సరాల వయసులో ముంబైలో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్ళాడు. అక్కడ ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో చేరి గ్రీన్ స్కాలర్ (గ్రాడ్యుయేట్‌కు సమానం) విద్యను పూర్తి చేశాడు. అతను విద్యార్థిగా ఉన్నప్పుడు[6] హిరాబాయి డాబూను వివాహం చేసుకున్నాడు.[7] అతను 1858 లో కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత అతను తన తండ్రి వాణిజ్య సంస్థలో చేరాడు. 1857 నాటి భారత తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అణచివేసినందున వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అల్లకల్లోలంగా ఉంది.

1858 లో బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి పట్టా పొందిన తరువాత, అతను తన తండ్రి ఎగుమతి-వాణిజ్య సంస్థలో చేరాడు. ప్రధానంగా జపాన్, చైనా, ఐరోపా, యునైటెడ్ స్టేట్స్‌లో దాని బలమైన శాఖలను స్థాపించడానికి దోహదపడ్డాడు.[8] నల్లమందులో వాణిజ్య వ్యాపారంతో నైపుణ్యం పొందడానికి టాటా క్రమం తప్పకుండా చైనాకు వెళ్ళేవాడు. ఆ సమయంలో ఈ వ్యాపారం పార్సీలు నివసించే చిన్న కాలనీలో సందడిగా ఉండేది. కానీ బయటివారికి అందులో ప్రవేశం లేదు. జమ్షెట్జీ టాటా తండ్రి ఈ వ్యాపారంలో భాగం కావాలని కోరుకున్నాడు. అందువల్ల అక్కడి వ్యాపారం గురించి తెలుసుకోవడానికి, నల్లమందు వ్యాపారం గురించి వివరాలను సేకరించడానికి అతను జమ్సెట్జీ టాటాను చైనాకు పంపాడు. ఏదేమైనా, టాటా చైనా చుట్టూ పర్యటించినప్పుడు, పత్తి పరిశ్రమలో వాణిజ్యం వృద్ధి చెందుతోందని, గొప్ప లాభం పొందే అవకాశం ఉందని గ్రహించాడు.[5] ఇది అతని వ్యాపార వృత్తిని ప్రభావితం చేసింది. అక్కడ అతను తన జీవితకాలమంతా కాటన్ మిల్లులలో ఎక్కువ పెట్టుబడి పెట్టాడు.

నల్లమందు వ్యాపారం తన తండ్రి వ్యాపారం కోసం నిర్బంధం చేయబడినందున టాటా అనేక శాఖలను స్థాపించడానికి విదేశాలలో, ప్రధానంగా ఇంగ్లాండ్, అమెరికా, ఐరోపా, చైనా, జపాన్ దేశాలకు అనేక పర్యటనలు చేశాడు.

వ్యాపారం

మార్చు

టాటా తన 29 సంవత్సరాల వయస్సు వరకు తన తండ్రి కంపెనీలో పనిచేశాడు. అతను 1868 లో, 21,000 మూలధనంతో (2015 ధరలలో US $ 52 మిలియన్ల విలువ) ఒక వాణిజ్య సంస్థను స్థాపించాడు. అతను 1869 లో చించ్‌పోక్లీ వద్ద దివాలా తీసిన నూనె మిల్లును కొనుగోలు చేసి దానిని కాటన్ మిల్లుగా మార్చాడు, దీనికి అలెగ్జాండ్రా మిల్ అని పేరు పెట్టాడు. అతను మిల్లును 2 సంవత్సరాల తరువాత లాభం కోసం విక్రయించాడు. తరువాత, 1874 లో, జమ్‌సెట్జీ టాటా నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని స్థాపించాడు. అతనికి నాగపూర్ వ్యాపార సంస్థను స్థాపించడానికి అతనికి అనువైన ప్రదేశంగా అనిపించింది. ఈ అనువైన ప్రదేశం కాని కారణంగా, భారతదేశంలోని “కాటనోపోలిస్”గా పిలువబడే బొంబాయిలో పత్తి వ్యాపారాన్ని చేపట్టడనందుకు బొంబాయి ప్రజలు టాటాను నిందించారు. అతను కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అభివృద్ధి చెందని నాగ్‌పూర్ నగరానికి ఎందుకు వెళ్ళాడో వారికి అర్థం కాలేదు. అయితే, నాగ్‌పూర్‌ను ఎన్నుకోవాలనే టాటా నిర్ణయం అతని విజయానికి దారితీసింది. బొంబాయి మాదిరిగా కాకుండా, నాగ్‌పూర్‌లోని భూమి చౌకగా ఉండి, వనరులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. సమృద్ధిగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. పంపిణీ సులభం. ఈ చౌకైన భూమి తరువాత నాగ్‌పూర్‌లో రైల్వేలను మార్చడానికి దారితీసింది. ఇది నగరాన్ని మరింత అభివృద్ధి చేసింది. కొంతకాలం తర్వాత, 1877 లో, విక్టోరియా రాణి 1877 జనవరి 1 న భారతదేశాన్ని సామ్రాజ్యంగా ప్రకటించిన సమయంలో టాటా కొత్త కాటన్ మిల్లు "ఎంప్రెస్ మిల్"ను స్థాపించాడు.

అతను తన జీవితంలో నాలుగు లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. అవి: ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ప్రపంచ స్థాయి అభ్యాస సంస్థ, ఒక ప్రత్యేకమైన హోటల్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ల ఏర్పాటు. 1903 డిసెంబరు 3 న ముంబైలోని కొలాబా వాటర్ ఫ్రంట్ వద్ద తాజ్ మహల్ హోటల్ ను11 మిలియన్ డాలర్లు (2015 ధరలలో 11 బిలియన్ డాలర్లు) వ్యయంతో ప్రారంభించాడు. ఆ కాలంలో భారతదేశంలో విద్యుత్ ఉన్న ఏకైక హోటల్ ఇది.[ఆధారం చూపాలి]

1885 లో టాటా పాండిచ్ఛేరి లోని మరొక సంస్థను స్థాపించాడు. ఇది సమీప ఫ్రెంచ్ కాలనీలకు భారతీయ వస్త్రాలను పంపిణీ చేయటం కోసం ఏర్పాటు చేయబడింది. దీనికి పన్ను చెల్లించనవసరం లేదు. ఏదేమైనా, బట్టలకు తగినంత డిమాండ్ ఉన్న కారణంగా ఈ ప్రయత్నం విఫలమైంది. దీంతో అతడు బొంబాయిలోని కుర్లా వద్ద ధర్మసీ మిల్స్ కొనుగోలు చేసాడు. తరువాత అహ్మదాబాద్‌లోని అడ్వాన్స్ మిల్స్‌ను కొనుగోలు చేయడం కోసం ధర్మసీ మిల్స్ ను తిరిగి విక్రయించాడు. టాటా దీనికి అడ్వాన్స్ మిల్స్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఇది ఆ సమయంలో అత్యంత హైటెక్ మిల్లులలో ఒకటి.[3] దాని సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కంపెనీ అహ్మదాబాద్ నగరంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే జమ్సెట్జీ టాటా తన సమాజానికి ఆర్థిక వృద్ధిని అందించడానికి నగరంలోని మిల్లును అనుసంధానించడానికి ప్రయత్నం చేసాడు. ఈ సేవల ద్వారా జమ్సెట్జీ టాటా భారతదేశంలో వస్త్ర, పత్తి పరిశ్రమను అభివృద్ధికి దోహదపడ్డాడు.
జంషెడ్జీ టాటా తన జీవితంలోని తరువాతి దశలలో కూడా పారిశ్రామిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగాడు. తరువాత టాటా స్వదేశీవాదానికి బలమైన మద్దతుదారుడు అయ్యాడు. 1905 వరకు స్వదేశీ ఉద్యమం ప్రారంభం కాలేదు; ఏదేమైనా, జమ్సెట్జీ టాటా అతను జీవించి ఉన్న కాలమంతా ఇదే సూత్రాలను సూచించాడు. "స్వదేశీ ఉద్యమం" బ్రిటిష్ ఇండియాలో రాజకీయ ఉద్యమం[3]. ఇది దేశీయ వస్తువుల ఉత్పత్తిని, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను బహిష్కరించడాన్ని ప్రోత్సహించింది. దాని సూత్రాలతో పూర్తిగా ఆకట్టుకున్న టాటా, బొంబాయిలో నిర్మించిన తన కొత్త కాటన్ మిల్లుకు “స్వదేశీ మిల్” అని పేరు పెట్టాడు[5]. ఈ కొత్త మిల్లు అసలు ఆలోచన మాంచెస్టర్ నుండి వచ్చే వస్త్ర రకం వలె చక్కని వస్త్రాన్ని ఉత్పత్తి చేయడమే. మాంచెస్టర్ మృదువైన వస్త్రాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ముతక వస్త్రాలకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వలేదు[5]. విదేశాల నుండి వచ్చే దిగుమతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో మాంచెస్టర్ వస్త్రంతో పోల్చదగిన నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలని టాటా కోరుకున్నాడు. అదనంగా, టాటా భారతదేశంలోని అన్ని రకాల వస్త్రాల ప్రాథమిక తయారీదారుగా అవతరించడపై, చివరికి పెద్ద ఎగుమతిదారుగా మారడంపై దృష్టి పెట్టాడు[5]. భారతదేశంలోని పురాతన చేనేత కార్మికులు తయారుచేసే ఇటువంటి ప్రసిద్ధి చెందిన చక్కటి వస్త్రాల తయారీదారుగా భారతదేశం ఉండాలని అతను కోరుకున్నాడు. టాటా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పండించే పత్తి సాగును మెరుగుపరచడానికి వివిధ మార్గాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. మృదువైన పత్తికి ప్రసిద్ధి చెందిన ఈజిప్టు రియోట్ ఉపయోగించే సాగు పద్ధతిని అవలంబించడం వల్ల భారతదేశంలోని పత్తి పరిశ్రమ ఈ లక్ష్యాలను చేరుకోగలదని అతను అభిప్రాయపడ్డాడు. టాటాఅ తన మిల్లుల్లో వలయాకార నూలు వడికే కదురును ప్రవేశపెట్టిన మొట్టమొదటివాడు. ఇది త్వరలో ఒకప్పుడు తయారీదారులు ఉపయోగించిన థొరెస్టల్‌ను భర్తీ చేసింది.[5]

అతని వారసులు అతను మిగిల్చిన మూడు ఆలోచనలను సాధించడానికి కృషిచేసారు:

  • టాటా స్టీల్ (గతంలో టిస్కో - టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్) ఆసియాలో మొదటి, భారతదేశపు అతిపెద్ద స్టీల్ కంపెనీ. కోరస్ గ్రూప్ సంవత్సరానికి 28 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్న తరువాత ఇది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టీల్ కంపెనీగా అవతరించింది.
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో పరిశోధన, విద్య కోసం ప్రముఖ భారతీయ సంస్థ.
  • టాటా హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ సరఫరా సంస్థ, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ గా పేరు మార్చబడింది, ప్రస్తుతం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ 8000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

వ్యక్తిగత జీవితం

మార్చు

టాటా హిరాబాయి డాబూను వివాహం చేసుకున్నాడు. వారి కుమారులు డోరాబ్జీ టాటా, రతన్జీ టాటా (టాటా తరువాత టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు).

టాటా మొదటి బంధువు రతన్జీ దాదాభాయ్ టాటా, టాటా గ్రూప్ స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతని సోదరి జెర్బాయి, ముంబై వ్యాపారిని వివాహం చేసుకోవడం ద్వారా, షాపుర్జీ సక్లత్వాలాకు తల్లి అయింది. ఒడిశా, బీహార్లలో బొగ్గు, ఇనుము ధాతువును విజయవంతంగా అంచనా వేయడానికి ఆమె ఉద్యోగం చేసింది. సక్లత్వాలా తరువాత ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డాడు. మొదట్లో టాటా మాంచెస్టర్ కార్యాలయాన్ని నిర్వహించడానికి తోడ్పడ్డాడు. తరువాత బ్రిటిష్ పార్లమెంటులో కమ్యూనిస్ట్ సభ్యుడయ్యాడు[9]. తన బంధువు రతన్జీ దాదాభాయ్ జె. ఆర్. డి. టాటా, సిల్లా టాటాకు మామయ్య.

స్వాతంత్ర్య సాధనలో

మార్చు

ఒకపక్క ప్రపంచమంతా పారిశ్రామికీకరణతో దూసుకుపోతుంటే భారత్‌ మాత్రం బ్రిటన్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, అభివృద్ధిలో నానాటికీ వెనక్కి వెళుతున్న సమయంలో జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా వస్త్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అతను బ్రిటిష్‌ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూనే భారత జాతీయోద్యమానికి ఆర్థిక వనరుగా నిలిచారు. అతను సాయంలేని కాంగ్రెస్‌ కార్యక్రమం లేదు.

స్వాతంత్ర్య ఆకాంక్ష నెరవేరాలంటే స్వదేశానికి అవసరమైన పారిశ్రామిక, ఆర్థిక, ఆధునిక విద్య, సాంకేతిక బలం.. ఇలా అన్నీ రంగాలు బలపరచుకోవాలని.. వస్త్రపరిశ్రమలో విజయానంతంరం స్టీల్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు, ప్రపంచ స్థాయి సైన్స్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని తపించారు. అతను వారసులు ఆ కలల్ని నిజం చేశారు. అలా మేడిన్‌ ఇండియా బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది, స్వదేశీపై మనలో మమకారం పెంచింది వారె.

1900 లో జర్మనీకి వ్యాపార పర్యటనలో ఉన్నప్పుడు, టాటా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతను 1904 మే 19 న బాడ్ నౌహైమ్‌లో మరణించాడు[10]. ఇంగ్లాండ్‌లోని వోకింగ్‌లోని బ్రూక్‌వుడ్ శ్మశానవాటికలో పార్సీ శ్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-21. Retrieved 2020-05-19.
  2. "webindia123-Indian personalities-Industrialists-Jamshedji Tata". webindia123.com.
  3. 3.0 3.1 3.2 N, Benjamin (2004). "Jamsetji Nusserwanji Tata: A Centenary Tribune". Economic and Political Weekly. 39 (35): 3873–3875. JSTOR 4415463.
  4. Benjamin, N. (2004). "Jamsetji Nusserwanji Tata: A Centenary Tribute". Economic and Political Weekly. 39 (35): 3873–3875. ISSN 0012-9976. JSTOR 4415463.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 Wacha, Dinsha Edulji (c. 1915). The Life and Life Work of J.N. Tata. [publisher not identified]. OCLC 1000351065.
  6. "Biography on TIFR website". Retrieved 9 September 2006.[dead link]
  7. "Family Tree of the Tatas". Retrieved 28 October 2016.
  8. Gras, N. S. B. (1949). "A Great Indian Industrialist: Jamsetji Nusserwanji Tata, 1839-1904". Bulletin of the Business Historical Society. 23 (3): 149–151. doi:10.2307/3111182. ISSN 1065-9048. JSTOR 3111182.
  9. Oxford Dictionary of National Biography, Volume 48. Oxford University Press. 2004. pp. 675–676.Article on Saklatvala by Mike Squires. In the article, he is simply called J.N. Tata.
  10. Jamsedji Tata’s guiding spirit- growth of Indian Steel industry by Tata legacy. Tatasteel100.com. Retrieved on 28 July 2013.

ఇతర పఠనాలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు