జలౌన్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో జలౌన్ జిల్లా ఒకటి. ఒరాయీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. మునుపటి మరాఠీ రాజప్రతినిధి గౌరవార్ధం జిల్లాకు జలౌన్ అని పేరు పెట్టారు. జిల్లాలో కల్పి, కోంచ్, మధోగఢ్ పట్టణాలు ఉన్నాయి.

జలౌన్ జిల్లా
जालौन जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో జలౌన్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో జలౌన్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఝాన్సీ
ముఖ్య పట్టణంఒరాయీ
Government
 • లోకసభ నియోజకవర్గాలుజలౌన్
విస్తీర్ణం
 • మొత్తం4,565 కి.మీ2 (1,763 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం14,55,859
 • జనసాంద్రత320/కి.మీ2 (830/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి
కల్పిలో లోధి షా బాద్షా సమాధి
జలౌన్ జిల్లా పటం

భౌగోళికం

మార్చు

జలౌన్ జిల్లా ఝాన్సీ డివిజన్‌లో ఉంది. జిల్లా వైశాల్యం 4565 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 16,89,974. జనసంధ్రత చ.కి.మి కి 370. జిల్లా పూర్తిగా బుండేల్ ఖండ్ భూభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో యమునా నది ప్రవహిస్తుంది. దక్షిణ సరిహద్దులో బెత్వానది ప్రవహిస్తుంది. పశ్చిమ సరిహద్దులో పహుజ్ నది ప్రవహిస్తుంది. మద్యభాగం వ్యవసాయానికి అనుకూలమైనది. దట్టమైన చెట్ల మద్య అక్కడక్కడా గ్రామాలు కనిపిస్తుంటాయి. దక్షిణ భూభాగంలో విస్తారంగా వ్యవసాయభూములు ఉన్నాయి. జిల్లా మద్యలో ప్రవహిస్తున్న నాన్ నదిలో పలు చిన్న చిన్న నదులు సంగమిస్తున్నాయి.

సరిహద్దులు

మార్చు

జలౌన్ జిల్లా ఉత్తర సరిహద్దులో ఎటావా జిల్లా, కాన్పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో హిమ్మత్‌పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఝాన్సీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో పహిజ్ నది దాటిన తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లా ఉన్నాయి. జిల్లా 4 సంవత్సరాల కాలం నిరంతర కరువు బాధిత ప్రాంతంగా ఉంది. సరాసరి వర్షపాతం 399 మి.మీ. (మునుపటి సరాసరి వర్షపాతం 800 మి.మీ)

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జలౌన్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,670,718,[2]
ఇది దాదాపు. గునియా - బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 296వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 336 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.87%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 885:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 75.16%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం


బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582