ఝాన్సీ జిల్లా

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలలో ఝాన్సీ జిల్లా ఒకటి. ఝాన్సీ పట్టణం ఈ జిల్లా కేంద్రం. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,746,715.1891లో ఝాన్సీ జిల్లాతో లలిత్‌పూర్ ప్రాంతం ఝాన్సీ జిల్లాతో చేర్చబడింది. 1974లో లలిత్‌పూర్ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.

ఝాన్సీ జిల్లా
झांसी जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో ఝాన్సీ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఝాన్సీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఝాన్సీ
ముఖ్య పట్టణంఝాన్సీ
Government
 • లోకసభ నియోజకవర్గాలుఝాన్సీ
విస్తీర్ణం
 • మొత్తం5,024 కి.మీ2 (1,940 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం19,98,603
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
 • Urban
5,49,391
జనాభా వివరాలు
 • లింగ నిష్పత్తి866
Websiteఅధికారిక జాలస్థలి
ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను

జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు (నేషనల్ హైవే డెవెలెప్మెంట్ ప్రాజెక్ట్) మూలంగా ఝాన్సీ త్వరగా అభివృద్ధి చెందుతున్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారిని కలిపే ఉత్తర-దక్షిణ కారిడార్, తూర్పు-పడమర కారిడార్ లు రెండూ ఝాన్సీ మీదుగా ప్రయాణిస్తాయి.

సరిహద్దులు

మార్చు

జిల్లా ఉత్తర సరిహద్దులో జులాన్ జిల్లా, తూర్పు సరిహద్దులో [[హమీర్‌పూర్ జిల్లా], మహోబా జిల్లా, దక్షిణ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమార్గ్ జిల్లా, వాయవ్య సరిహద్దులో లలిత్‌పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియ జిల్లా, భింద్ జిల్లా ఉన్నాయి.

చరిత్ర

మార్చు

1861లో ఝాన్సీ నగరప్రాంతం గ్వాలియర్ రాజాస్థానానికి ఇవ్వబడింది. ఝాన్సీ రాజధాని ఝాన్సీ నయోబద్‌కు తరలించబడింది. ఝాన్సీ సైన్యరహిత గ్రామం. ఝాన్సీ నగరం గ్వాలియర్ సుభాహ్‌ రాజధానిగా మారింది. 1886 నాటికి ఈ నగరం బ్రిటిష్ పాలకులు గ్వాలియర్ కోట, సమీపంలోని మోరర్ కంటోన్మెంటుకు ఇచ్చి ఝాన్సీ పట్టణాన్ని తీసుకుంది. తరువాత ఇది ఆగ్రా - ఔధ్ ప్రావిన్స్‌లో జిల్లాగా చేయబడింది.[1] ఇది గ్వాలియర్ మహారాజుకు ఇవ్వబడిన తరువాత భూభాగ పరస్పర మార్పిడిలో భాగంగా 1886లో తిరిగి బ్రిటిష్ ప్రభుత్వ వశం అయింది. 1891లో 4,07,000 మంది ప్రజలు నివసించిన ఉన్న ఝాన్సీ జిల్లా జనసంఖ్య 1991లో జిల్లా జనసంఖ్య 55,000 అయింది. [1]

విభాగాలు

మార్చు
  • ఝాన్సీ.
  • లలిత్‌పూర్
  • జలన్ (ఒరై)
  • బరుయా సాగర్ (ఝాన్సీ)
  • బత్గ్యుయాన్ ఝాన్సీ.

భౌగోళికం

మార్చు

జిల్లాలో పలు రైలుమార్గాలు ఉన్నాయి. జిల్లా దక్షిణ భూభాగం కొండలమయంగా ఉంటుంది. ఇది విద్యా పర్వత శ్రేణిలో ఉంది. జిల్లాలోని భుండేల్‌ఖండు వద్ద లెవల్ మైదానం ఉంది. ఇక్కడ సారవంతమైన నల్లరేగడి మట్టి ఉంది. ఇక్కడ పత్తిపంట పండుతుంది. జిల్లా పహుజ్, బెత్వా, ధాసన్ నదుల మద్య ఉంది.

ప్రధాన పట్టణాలు

మార్చు

జిల్లా కేంద్రం ఝాన్సీ నగరం కాక జిల్లాలో మౌరనిపుర్, గరౌథ, మాత్, బబిన, చిర గాన్, సంథర్, గుర్సరై, ఎరిచ్ ( ఉత్తర ప్రదేశ్) వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,998,603,[2]
ఇది దాదాపు. స్లొవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 231వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 398 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.54%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 890:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 75.05%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Dschansi". Meyers Grosses Konversations-Lexikon. September 1905. Retrieved 18 November 2012.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Slovenia 2,000,092 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179