జవహర్‌నగర్ నగరపాలక సంస్థ

తెలంగాణ నగరపాలక సంస్థ

జవహర్‌నగర్ నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ఉంది.[1] ఇంతకు ముందు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండేది. దీని ముఖ్య పట్టణం జవహర్‌నగర్. ఇది పురపాలక స్థాయి నుండి 2019 ఏప్రియల్ 21 న కార్పొరేషన్ స్థాయికి రూపాంతరం చెందింది.ఇది కాప్రాకు సమీపంలో ఉంది.గతంలో ఇది షామీర్‌పేట మండలంలో ఒక భాగంగా ఉండేది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా జవహర్‌నగర్ నూతనంగా ఏర్పడిన కాప్రా మండలంలో చేరింది.[2] గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కు చెందిన వ్యర్థపదార్థాలు నిల్వ చేసే ప్రదేశం జవహర్‌నగర్ నగరపాలక సంస్థకు చెందిన పరిధిలో 300 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అయ్యే 3500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను రోజూ ఇక్కడ పారవేస్తుంటారు. వ్యర్థాల నుండి వనరులను పునరుద్ధరించడానికి కొత్త సౌకర్యాలు పిపిపి (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) కింద వ్యర్థపదార్థాల నుండి కంపోష్టును, ఉత్పన్న ఇంధనవనరులు (ఆర్.డి.ఎఫ్) సృష్టించబడుతున్నాయి. మునిసిపాలిటీ భౌగోళిక ప్రాంతం 24.18 చ. కి.మీ.ఈ పట్టణం జూబ్లీ బస్ స్టేషన్ నుండి కరీంనగర్ స్టేట్ హైవే రోడ్ వరకు కలిగి ఉంది.మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని 2020 ఎన్నికలకు ఇరవై ఎనిమిది (28) వార్డులుగా విభజించారు.[3]

జవహర్‌నగర్
నగరపాలక సంస్థ
రకం
రకం
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
చరిత్ర
స్థాపితం2019 ఏప్రియల్ 21
నాయకత్వం
మేయర్
మేకల కావ్య
2020 సాధారణ ఎన్నికలు నుండి
డిప్యూటీ మేయరు
రెడ్డిశెట్టి శ్రీనివాస్
నిర్మాణం
రాజకీయ వర్గాలు
టి.ఆర్.యస్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
జవహర్‌నగర్ నగరపాలక సంస్థ కార్యాలయం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

కార్పొరేషన్ స్థితి

మార్చు

ఇంతకుముందు ఒకప్పుడు ఇది గ్రామం. ఆతరువాత జనాభా పెరుగుదల కారణంగా పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేయబడింది.2019 లో ఇది నగరపాలక సంస్థ స్థాయికి ఎదిగింది.

ప్రాంతం

మార్చు

ఇది 15,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.నగర పరిధిలో బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్, బయోటెక్ పార్క్, మెడిటెక్ వ్యాలీ వంటి ప్రధాన విద్యా సంస్థలు ఉన్నాయి. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ క్యాంపస్‌ 75 ఎకరాల స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేసింది.[4]

మేయర్ , డిప్యూటీ మేయర్

మార్చు

2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (బి.సి స్త్రీలకు రిజర్వుడు) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మేకల కావ్య ఎన్నికైంది.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఎన్నికయ్యాడు.[5]

మేయర్లు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Jawaharnagar Municipal Corporation". jawaharnagarmunicipality.telangana.gov.in. Retrieved 2020-02-09.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-04-14.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-01-18. Retrieved 2020-04-14.
  4. https://timesofindia.indiatimes.com/city/hyderabad/Jawaharnagar-to-get-special-focus-for-development/articleshow/6982658.cms
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-12-05. Retrieved 2020-04-14.
  6. Sakshi (19 March 2024). "ఆంధ్రా అమ్మాయి... జవహర్‌నగర్‌ మేయర్‌". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.

వెలుపలి లంకెలు

మార్చు