మేకల కావ్య
మేకల కావ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2020 జనవరి 28 నుండి 2024 ఫిబ్రవరి 19 వరకు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా పని చేసింది.[1]
మేకల కావ్య | |||
పదవీ కాలం 2020 జనవరి 28 – 2024 ఫిబ్రవరి 19 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1994 నవంబర్ 13 జవహర్‌నగర్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బీఆర్ఎస్ | ||
తల్లిదండ్రులు | మేకల అయ్యప్ప, లక్ష్మి | ||
జీవిత భాగస్వామి | ప్రవీణ్ | ||
బంధువులు | మేకల భార్గవరాం (సోదరుడు) | ||
సంతానం | ధాన్వి | ||
నివాసం | 6-72/55, బృందావన్ కాలనీ, బాలాజీ నగర్, షామీర్‌పేట్, జవహర్‌నగర్ - 500087 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుమేకల కావ్య 1994 నవంబర్ 13న మేకల అయ్యప్ప, లక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె మారేడ్‌పల్లి నారాయణ పాఠశాలలో 10వ తరగతి, ఈసీఐఎల్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఘట్‌కేసర్ మండలం యమ్నాంపేట్ గ్రామంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో 2016లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కోర్సు పూర్తి చేసింది.
వివాహం
మార్చుకావ్య వివాహం 2017 మార్చి 16న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రవీణ్‌తో జరిగింది. వారికీ ఒక కుమార్తె ధాన్వి ఉంది.
రాజకీయ జీవితం
మార్చుమేకల కావ్య 2020లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జవహర్‌నగర్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 15వ డివిజన్ నుంచి పోటీ చేసి మేకల 900 పైచిలుకు ఓట్ల మెజార్టీ గెలిచి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికై ఈ ఎన్నికలో అధికార టిఆర్ఎస్ పార్టీ 28 డివిజన్లకు 20 డివిజన్లు గెలవడంతో ఆమెను మేయర్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో ఆమె 2020 జనవరి 28న జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా భాద్యతలు చేపట్టింది.[2][3] కావ్య మేయర్‌గా ఎన్నికైన నాటికీ ఆమె 26 వయస్సు సంవత్సరాలు. ఆమె భారతదేశంలోనే అతిపిన్న వయసులో మేయర్‌గా ఎన్నికైన వారి జాబితాలో చేరింది.[4]
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మేకల కావ్యపై, బీఆర్ఎస్ అసంతృప్త కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మేడ్చల్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశానికి సంబంధించి 2024 ఫిబ్రవరి 19న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి (డి.ఆర్.వో) అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించగా 28 మంది కార్పొరేటర్లకుగాను ఈ సమావేశానికి 20 మంది అసమ్మతి కార్పొరేటర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు తెలపడంతో కావ్య మేయర్ పదవిని కోల్పోయింది.[5][6]
మూలాలు
మార్చు- ↑ ETV Bharat News (22 February 2023). "With Shelly Oberoi, list of youngest mayors in India has more women than men" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-12-05. Retrieved 2024-02-20.
- ↑ Namasthe Telangana (3 February 2023). "జవహర్‌నగర్‌ను మోడల్ సిటీగా మారుస్తా". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ The Hans India (28 January 2020). "26-year-old woman becomes youngest mayor in Hyderabad" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ Andhrajyothy (20 February 2024). "జవహర్ నగర్‌లో బీఆర్‌ఎస్ మేయర్ ఔట్". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ Disha (19 February 2024). "మేకల కావ్యపై నెగ్గిన అవిశ్వాసం". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.