జవహర్‌నగర్

తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం లోని పట్టణం

జవహర్‌నగర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కాప్రా మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జవహర్‌నగర్ నగరపాలక సంస్థకు ముఖ్య పట్టణం. దీని పరిపాలనా నిర్వహణ జవహర్‌నగర్ నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది.

జవహర్‌నగర్
—  రెవిన్యూ గ్రామం  —
జవహర్‌నగర్ is located in తెలంగాణ
జవహర్‌నగర్
జవహర్‌నగర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°30′37″N 78°33′36″E / 17.510261°N 78.559985°E / 17.510261; 78.559985
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్
మండలం కాప్రా
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 44,562
 - పురుషుల సంఖ్య 22,728
 - స్త్రీల సంఖ్య 21,834
 - గృహాల సంఖ్య 4,811
పిన్ కోడ్ 500087
ఎస్.టి.డి కోడ్ 08418

విద్యా సౌకర్యాలు మార్చు

ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్,బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హైదరాబాద్ క్యాంపస్),జవహర్ నగర్ పినియన్ హై స్కూల్, విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజి, సి.ఆర్.పి ఎఫ్. పబ్లిక్ స్కూల్, లిటిల్ రోజ్ గ్రామర్ స్కూల్,సెంట్ జోసెఫ్ మిస్సన్ స్కూల్, కె.జి.ఆర్. స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్

రవాణా సౌకర్యాలు మార్చు

ఆల్వాల్ నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; సికింద్రాబాదు 17 కి.మీ

గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా -మొత్తం 44562; అందులో పురుషులు 22728 మంది ఉండగా, స్త్రీలు 21834 మంది ఉన్నారు.నగర పరిధిలో మొత్తం 4811 గృహాలు ఉన్నాయి. ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయస్సు గల పిల్లలు 5978 మంది ఉన్నారు. అక్షరాస్యత గల వారి సంఖ్య 28906.

కర్మాగారాలు మార్చు

జవహర్‌నగర్‌ డంప్‌యార్డులో కాలుష్య కారక వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్‌ కోసం 250 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన జవహర్‌నగర్ వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని 2023 ఏప్రిల్ 15న రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్య‌క్ర‌మంలో కార్మిక శాఖామంత్రి సిహెచ్ మల్లారెడ్డి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, కార్పోరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.[2][3]

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Jawahar Nagar woes will end in 1 year: KT Rama Rao on new leachate plant in Hyderabad". The Times of India. 2023-04-16. ISSN 0971-8257. Archived from the original on 2023-04-16. Retrieved 2023-04-18.
  3. telugu, NT News (2023-04-15). "Minister KTR | జవహర్‌నగర్‌ దుర్గంధానికి చెక్‌.. డంపింగ్‌ యార్డ్‌లో లిక్విడ్‌ వేస్ట్‌ శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-18.

వెలుపలి లింకులు మార్చు