జాకబ్ మార్టిన్
జాకబ్ జోసెఫ్ మార్టిన్, గుజరాత్కు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. 21వ శతాబ్దం ప్రారంభంలో వన్ డే ఇంటర్నేషనల్ స్థాయిలో భారతదేశం తరపున 10సార్లు ఆడాడు. భారతీయ దేశవాళీ సర్క్యూట్‌లో బరోడా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జాకబ్ జోసెఫ్ మార్టిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వడోదర, గుజరాత్ | 1972 మే 11||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991–2009 | బరోడా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002–2003 | రైల్వేస్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2009 | అస్సాం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2007 ఏప్రిల్ 20 |
జననం
మార్చుజాకబ్ జోసెఫ్ మార్టిన్ 1972, మే 11న గుజరాత్ లోని వడోదరలో జన్మించాడు.
దేశీయ క్రికెట్
మార్చుమార్టిన్ 1991-92 సీజన్‌లో బరోడా తరపున రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌పై ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. 50 పరుగులు చేశాడు. అయినప్పటికీ మార్టిన్ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు పార్ట్-టైమ్ స్పిన్ బౌలర్‌గా రాణించాడు. ఈ రోజు వరకు అరంగేట్రం చేసిన 5 వికెట్లతోసహా మొత్తం 9 ఫస్ట్-క్లాస్ వికెట్లను తీశాడు.
అతను రైల్వేస్ కోసం ఆడిన 2002-03 సీజన్ లో మినహా అతని కెరీర్ మొత్తంలో బరోడా తరపున ఆడాడు. 2000-01 సీజన్ నుండి రెగ్యులర్ ప్రాతిపదికన బరోడాకు నాయకత్వం వహించాడు. 2000-01లో రంజీ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆ తరువాతి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు.[2][3]
1998-99లో మార్టిన్ అత్యంత ఉత్తమమైన సీజన్ లో రంజీ ట్రోఫీలో బరోడా తరపున 5 సెంచరీలతోసహా 103.70 సగటుతో 1037 పరుగులు చేశాడు.[4] ఇది అతన్ని రంజీ ట్రోఫీ సీజన్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆరవ ఆటగాడిగా నిలిపింది,[5] తను భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యేందుకు సహాయపడింది.
అంతర్జాతీయ క్రికెట్
మార్చు1999 సెప్టెంబరులో వెస్టిండీస్ క్రికెట్ జట్టు మ్యచ్ తో తన అంతర్జాతీయ వన్డేలోకి అరంగేట్రం చేసాడు. 2000 జనవరిలో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుతో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు అంతర్జాతీయ వన్డే సిరీస్‌లో కూడా ఆడాడు. అయినప్పటికీ, తన దేశీయ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. 2001 తర్వాత భారతదేశం కోసం మళ్ళీ ఆడలేదు.
తరువాతి జీవితం
మార్చు2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌కు బరోడా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.[6]
2011లో మానవ అక్రమ రవాణా కేసు (2003)లో ఢిల్లీలో అరెస్టయ్యాడు.[7][8][9]
2018 డిసెంబరులో రోడ్డు ప్రమాదం జరిగింది. లైఫ్ సపోర్ట్‌లో బతికాడు.[10]
పదవీ విరమణ పొందిన మార్టిన్ గుజరాత్‌లో లాండ్రీ, డ్రై-క్లీనింగ్ బ్రాండ్ యూక్లీన్ అవుట్‌లెట్‌లను నడుపుతున్నాడు.
మూలాలు
మార్చు- ↑ "Jacob Martin Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
- ↑ "Jacob Martin retires from all forms of cricket". ESPNcricinfo. 21 November 2007. Retrieved 2023-08-03.
- ↑ "Jacob Martin comes out of retirement". ESPNcricinfo. 22 May 2008. Retrieved 2023-08-03.
- ↑ "Batting and Fielding in Ranji Trophy 1998/99 (Ordered by Runs)". CricketArchive. Retrieved 2023-08-03.
- ↑ Mohandas Menon (8 March 1999). "A race between Jacob Martin & Vijay Bhardwaj". ESPNcricinfo. Retrieved 2023-08-03.
- ↑ "Jacob Martin, former India player with criminal record, named Baroda Ranji coach". India Today. 14 September 2016. Retrieved 2023-08-03.
- ↑ "Arrested in 2011, BCCI pays Jacob Martin one-time grant". The Times of India. 16 December 2015. Retrieved 2023-08-03.
- ↑ "Jacob Martin arrested in human-trafficking case". ESPNcricinfo. 27 April 2011. Retrieved 2023-08-03.
- ↑ Kumar, Ashok (27 April 2011). "Evasive Jacob Martin arrested, at last". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-08-03.
- ↑ "Baroda's Ranji winner Jacob Martin on life support". ESPN Cricinfo. Retrieved 2023-08-03.