జానంపల్లి కుముదినీ దేవి
రాణీ కుముదినీ దేవి (జనవరి 23, 1911 - 2009) గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక.[1][2]
జానంపల్లి కుముదినీ దేవి | |
---|---|
జననం | జానంపల్లి కుముదినీ దేవి జనవరి 23, 1911 వరంగల్లు జిల్లా, వాడపల్లి |
మరణం | 2009 |
ఇతర పేర్లు | జానంపల్లి కుముదినీ దేవి |
ప్రసిద్ధి | వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, |
మతం | హిందూ మతము |
భార్య / భర్త | రామ దేవ రావు |
తండ్రి | పింగళి వెంకటరమణారెడ్డి |
జననం
మార్చువరంగల్లు జిల్లా, వాడపల్లికి (వడ్డెపల్లి) చెందిన జమీందారీ వంశంలో కుముదినీ దేవి 1911 జనవరి 23న వాడపల్లిలో(వడ్డెపల్లి) జన్మించింది. ఈమె తండ్రి పింగళి వెంకట రామా రెడ్డి హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశాడు[3]. కుముదినీ దేవికి 1928 లో వనపర్తి రాజా రామదేవరావుతో వివాహమైంది.[4]
కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై హైదరాబాదు కూకట్‍పల్లిలో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958 లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “ సేవాసమాజ బాలికా నిలయం ” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.
కుముదినీ దేవి, 1962లో తొలిసారి వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యింది. 1967లో తిరిగి అదే నియోజకవర్గం నుండి ఎన్నికై రెండు పర్యాయాలు శాసనసభా సభ్యురాలిగా సేవలందించింది
మరణం
మార్చుఈమె 2009లో తన 98 వ ఏట మరణించింది.
మూలాలు
మార్చు- ↑ Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Correspondent, Special (2020-11-20). "Feisty and kind: the first woman mayor of Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-04-15.
- ↑ A life less ordinary - The Hindu March 22, 2011