జాన్ ఫుల్టన్ రీడ్
జాన్ ఫుల్టన్ రీడ్ (1956, మార్చి 3 - 2020, డిసెంబరు 28) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1956 మార్చి 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2020 డిసెంబరు 28 క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | (వయసు 64)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | బ్రూస్ రీడ్ (బంధువు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 144) | 1979 ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1986 మార్చి 13 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 36) | 1980 ఫిబ్రవరి 6 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1986 ఫిబ్రవరి 2 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1975–1988 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 4 |
జననం
మార్చుజాన్ ఫుల్టన్ రీడ్ 1956, మార్చి 3న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్‌లో జన్మించాడు.
క్రికెట్ కెరీర్
మార్చురీడ్ క్రికెట్‌కు ప్రసిద్ధి చెందిన లిన్‌ఫీల్డ్ కళాశాలలో[1] తన విద్యను పూర్తి చేశాడు. లిన్‌ఫీల్డ్ కళాశాలలో రీడ్ హౌస్ అతని పేరు పెట్టబడింది.[2] క్రికెట్ ఆడుతూనే హైస్కూల్ జియోగ్రఫీ టీచర్‌గా పనిచేశాడు.[3]
1979 - 1986 మధ్యకాలంలో 19 టెస్ట్ మ్యాచ్‌లు, 25 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్ట్ సగటు 46.28గా ఉంది,[4][5][6] ఇందులో ఆరు టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. వన్డే సగటు 27.52గా ఉంది.[7]
1984లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ తరఫున రీడ్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని ఇయాన్ స్మిత్ చెప్పాడు. రీడ్ 445 బంతుల్లో 180 పరుగుల కోసం 11 గంటలపాటు బ్యాటింగ్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ విజయం సాధించింది.[8][9][10]
1985లో ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ తొలి టెస్టు విజయంలో జాన్ రీడ్ కీలక పాత్ర పోషించాడు. 108 పరుగులు చేశాడు. మార్టిన్ క్రోతో కలిసి మూడో వికెట్‌కు 284 పరుగులు చేశాడు.[11]
జాన్ రీడ్ బంధువు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రూస్ రీడ్.[7]
క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కెరీర్
మార్చుజాన్ రీడ్ ఆక్లాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. 1994-95 శతాబ్ది సీజన్‌కు న్యూజీలాండ్ కేర్‌టేకర్ కోచ్‌గా నియమితుడయ్యాడు.[3] దక్షిణాన కాంటర్‌బరీకి వెళ్ళి, 1996లో న్యూజీలాండ్ క్రికెట్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా, హై-పెర్ఫార్మెన్స్ మేనేజర్‌గా నియమితుడయ్యాడు. లింకన్‌లో న్యూజీలాండ్ క్రికెట్ నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను స్థాపించడానికి నాయకత్వం వహించాడు.[12]
జాన్ రీడ్ 2005లో స్పోర్ట్ న్యూజీలాండ్ తో కొత్త స్థానాన్ని పొందాడు. సెల్విన్ స్పోర్ట్స్ ట్రస్ట్ యొక్క ట్రస్టీగా ఉన్నాడు. 2015లో జాన్ రీడ్ సెల్విన్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ప్రధాన ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ మేనేజర్‌గా చేరాడు.[13] రోల్‌స్టన్‌లోని సెల్విన్ స్పోర్ట్స్ సెంటర్‌లోని చెక్క ఫ్లోర్ స్పోర్ట్స్ హాల్‌కు సెల్విన్‌లోని కోర్టులు, కమ్యూనిటీ స్పోర్ట్‌లలో ఛాంపియన్‌గా జాన్ రీడ్ చేసిన కృషికి మెచ్చి జాన్ రీడ్ పేరు పెట్టారు.
రికార్డులు
మార్చు- న్యూజీలాండ్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 1,000 టెస్టు పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.[14]
మరణం
మార్చుజాన్ ఫుల్టన్ రీడ్ 2020, డిసెంబరు 28న క్రైస్ట్‌చర్చ్‌లో క్యాన్సర్‌తో మరణించాడు.[15][16]
మూలాలు
మార్చు- ↑ "Boys cricket team to visit Australia". Press. Vol. CXII, no. 33019. 12 September 1972. p. 28. Retrieved 21 February 2023 – via Papers Past.
- ↑ "History". Lynfield College. Retrieved 2020-10-15.
- ↑ 3.0 3.1 Cricket, New Zealand. "John F Reid dies at 64". www.nzc.nz. Retrieved 2021-04-09.
- ↑ Basevi, Travis (7 August 2007). "Differences in averages between first and second innings" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2020-10-15.
- ↑ "Statsguru - JF Reid - Test Batting - Innings by innings list - Filter: in the 1st team innings". ESPNcricinfo. Retrieved 2020-10-15.
- ↑ "Statsguru - JF Reid - Test Batting - Innings by innings list - Filter: in the 2nd team innings". ESPNcricinfo. Retrieved 2020-10-15.
- ↑ 7.0 7.1 "John Reid". ESPNcricinfo. Retrieved 2020-10-15.
- ↑ Smith, Ian (1991). Smithy. Just a drummer in the band. New Zealand: Moa Beckett. p. 225. ISBN 1-86947-085-0.
- ↑ "Matches". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-16.
- ↑ "Full Scorecard of Sri Lanka vs New Zealand 3rd Test 1983/84 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2023-02-16.
- ↑ "Tributes flow for 'visionary' cricketer and administrator John F Reid". Stuff (in ఇంగ్లీష్). 2020-12-30. Retrieved 2021-04-09.
- ↑ "Part of new Canterbury sports centre named after NZ cricket great". Otago Daily Times Online News (in ఇంగ్లీష్). 2020-11-23. Retrieved 2021-04-09.
- ↑ "Former New Zealand cricketer John F Reid dies, aged 64". Stuff (in ఇంగ్లీష్). 2020-12-29. Retrieved 2021-04-09.
- ↑ "Records - Test matches - Batting records - Fastest to 1000 runs". ESPNcricinfo. Retrieved 2020-10-15.
- ↑ "Cricket: Black Caps batsman John F Reid dies, aged 64". New Zealand Herald. 29 December 2020. Retrieved 31 December 2020.
- ↑ "John Reid death notice". New Zealand Herald. 30 December 2020. Retrieved 31 December 2020.