జామా మసీదు, సాహెబ్‌నగర్, హైదరాబాదు

జామా మసీదు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న అతి పురాతన మసీదుల్లో ఒకటి. హయత్ నగర్ మండలం సాహెబ్‌నగర్‌ లో ఉన్న ఈ ప్రార్థనామందిరం, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో అప్పటి ప్రధానమంత్రి మూడో సాలార్జంగ్ (యూసుఫ్ అలీఖాన్) చొరవతో నిర్మించబడింది.[1]


చరిత్ర

మార్చు

హయత్ నగర్ మండలం సాహెబ్‌నగర్‌లో ఉన్న ఈ మసీదు వందేళ్ల క్రితం నిర్మించబడింది.[2] జుమా నమాజ్ (శుక్రవారం ప్రార్థన) తో ప్రారంభం అయినట్లు మసీదులో ఉన్న శిలాఫలకంలో పేర్కొన్నారు. నిజాం కాలంలో ఈ ప్రాంతంలో భగ్గీఖానా (గుర్రాల శాల) ఉండేది. అప్పటి నిజాం సర్కార్‌ లో ప్రధానమంత్రి అయిన మూడో సాలార్జంగ్‌ ఈ ప్రాంతానికి వస్తుండడమేకాకుండా, భగ్గీఖానా సమీపంలో ఉన్న పెద్దబావి నుంచి ఆయనకు ప్రతిరోజూ గుర్రపు బండిపై తాగునీళ్లు తీసుకువెళ్లేవారు. అందువల్ల ఇక్కడ ఒక మసీదు ఉండాలన్న ఉద్దేశ్యంతో జామా మసీదు నిర్మాణం చేపట్టారని చరిత్రకారుల అభిప్రాయం. సాయెబులు అధికంగా నివాసముండడం కారణంగా గ్రామానికి సాహెబ్‌నగర్ అనే పేరు వచ్చిందని చరిత్ర తెలుపుతోంది.

నిర్మాణం

మార్చు

మసీదు నిర్మాణం పూర్తిగా మట్టితోనే జరిగింది. వనస్థలిపురం ప్రాంతంలో పురాతనమైన మసీదు ఇదేనని, వందేళ్లు పూర్తయినా ఇప్పటికీ చెక్కుచెదరలేని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 2012లో మసీదు పక్కన పునర్నిర్మాణం చేసి 200 మంది నమాజ్ చేసుకునేలా రూపుదిద్దబడింది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ (16 June 2016). "వందేళ్ల జామా మసీద్". Retrieved 3 February 2018.[permanent dead link]
  2. vidteq, Hyderabad. "Jama Masjid". www.vidteq.com. Retrieved 1 March 2019.[permanent dead link]