ఇరుగుడు

(జిట్టేగి నుండి దారిమార్పు చెందింది)

ఇరుగుడు లేదా జిట్టేగి (లాటిన్ Dalbergia latifolia; synonym Amerimnon latifolium) ఒక కలప చెట్టు. ఇవి తూర్పు, దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల రైన్ ఫారెస్ట్ లలో పెరుగుతుంది.[1][2] దీనికున్న కొన్ని ఇంగ్లీషు పేర్లు : blackwood, Bombay blackwood, rosewood, Roseta rosewood, East Indian rosewood, black rosewood, Indian palisandre, and Java palisandre.[1][2] వీటి వాడుక పెరులు ఇండియాలో ఏమిటి అంటే బీటి, సిట్సాల్.[1]వృక్షాలు సతతహరితంగఅ సుమారు 40 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.[1][2]

ఇరుగుడు / జిట్టేగి
జావా దీవుల వీధిలో పెరిగుతున్న Dalbergia latifolia.
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Species:
D. latifolia
Binomial name
Dalbergia latifolia

లక్షణాలు

మార్చు
 
Pinnately compound leaves of Dalbergia latifolia growing in Java.
  • ఎత్తుగా పెరిగే వృక్షాలు.
  • ఉపాంతరహిత అండాకార పత్రకాలు గల సంయుక్త పత్రాలు.
  • బలహీనమైన శాఖలు గల అనిశ్చత విన్యాసంలో అమరిన తెలుపు రంగు పుష్పాలు.
  • ఏక విత్తనం గల దీర్ఘవృత్తాకార రెక్కగల ఫలం.

ఉపయోగాలు

మార్చు
 
Dalbergia latifolia రోజ్ వుడ్ తో తయారుచేసిన చదరంగం పావులు
  • దీని బెరడును గాయం చేయగా స్రవించు ఎర్రటి ద్రవమును గాయములను మాన్పుటకు వాడెదరు.[3]
  • దీని కలప నల్లగా అందముగా ఉండి కుర్చీలు, బల్లలు మొదలైనవి తయారుచేయుటకు వాడెదరు.

భారతీయ సంస్కృతి

మార్చు
  • బేతాళ కథలులో విక్రమార్కుడు ఈ శింశుపా వృక్షం ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు. ఒక క్లిష్టమైన సమస్యను పూరించమని అడుగుతాడు. పరిష్కారం చెప్పగానే శవం మల్లీ వృక్షం పైకి పోతుంది.అంతే కాకుండా రామాయణంలో సీతాదేవిని రావణుడు అపహరించి లంకలో అశోకవనంలో ఉంచుతాడు.అయితే అశోకవనంలో సీత ఈ శింశుపావృక్షము క్రిందనే ఉన్నది.

ఉపయోగాలు

మార్చు

ఈ చెట్టు చాలా వాటికి ఉపయోగ పడుతుంది ఈ విధమైన చెట్లు అడవులు తిరిగి పెంచడానికి ఉపయోగ పడతాయి, చాలా రకమైన వస్తువులు చెయడానికి ఉపయోగపడతాయి గిటార్ తయారు చేయడంలో, కాబినెట్ బెంచిలు తయారు చేయడములోనూ ఇంకా మంచి సామానులు చేయడానికి వీటి కలప పనికివస్తుంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 World Agroforestry Centre, Agroforestry Tree Database, archived from the original on 2012-03-09, retrieved 2011-03-21
  2. 2.0 2.1 2.2 IUCN Redlist Dalbergia latifolia, archived from the original on 2010-11-14
  3. శింశుపా - జిట్టేగి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి, 1992, పేజీ: 145.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇరుగుడు&oldid=3788742" నుండి వెలికితీశారు