జిలానీ బానో

భారతీయ ఉర్దూ భాష రచయిత్రి

జిలానీ బాను ప్రముఖ ఉర్దూ రచయిత్రి.[1][2][3][4] ఆమె 2001 లో భారతదేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని అందుకున్నారు.[5] ఆమె 2016 ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు.[6]

జిలానీ బానో
జననంజిలానీ బానో
(1936-07-14) 1936 జూలై 14 (వయసు 87)
India బదయూన్ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం
వృత్తిరచయిత్రి
ప్రసిద్ధిజిలానీ బానో
పదవి పేరుప్రముఖ ఉర్దూ కవయిత్రి
మతంఇస్లాం
తండ్రిహైరత్ బదయూని

జీవిత విశేషాలు

మార్చు
 
పద్మశ్రీపురస్కారం

ఆమె జూలై 14 1936లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బదాయున్[4]లో ప్రముఖ ఉర్దూ రచయిత[2] అయిన హైరాత్ బదాయుని [7]కి జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చెసిన తరువాత ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ స్టడీస్ లో విభాగాధిపతి, ప్రఖ్యాత కవి అయిన అన్వర్ మొయజ్జంను వివాహమాడి, హైదరాబాదుకు వచ్చారు. అచట ఇంటర్మీడియట్ విద్యనభ్యసించారు.[8] ఆమె తన విద్యను కొనసాగించి ఎం.ఎ. (ఉర్దూ) పూర్తిచేసారు.[3][4] తన ఎనిమిదేళ్ళ ప్రాయం నుండి రచనలు ప్రారంభించారు.[8] తన మొదటికథ "ఏక్ నజర్ ఇధర్ భీ" 1952లో ప్రచురితమైనది.[2] ఆమె రాసిన 22 పుస్తకాలు ప్రాముఖ్యం పొందాయి. వాటిలో "రోషిణి కే మీనార్", "ఐవాన్-ఎ-గజల్" కూడా ఉన్నాయి. ఆమె రాసిన పుస్తకాలలో ఆమె స్వీయ చరిత్ర "అఫ్జానా" కూడా ఉంది.[9] ఇతర రచయితలతో చేసిన చేసిన ఉత్తర ప్రత్యుత్తరాల సేకరణతో కూడిన నవల "దూర్ కీ ఆవాజే" అనే పుస్తకం కూడా వ్రాసింది.[2][8][10] హైదరాబాద్ పరిసరాలు, పరిస్థితుల నేపథ్యంతో ‘నర్సయ్యకీ బౌడీ’ అనే టెలీప్లే రాశారు. దాన్నే శ్యాం బెనెగళ్ ‘వెల్‌డన్ అబ్బా’ పేరుతో సినిమా తీశాడు.[8][11] ఆమె రాసిన అనేక పుస్తకాలు అనేక ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి.[3][8][12][13]

ఆమెకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 1960 లోనూ, 1985 లో సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు లభించాయి.[2][3] ఆమెకు ఖౌమీ హాలి అవార్డు 1989 లో హర్యానా ఉర్దూ అకాడమీ నుండి లభించింది.[2][3] భారత ప్రభుత్వం ఆమెకు 2001లో పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది. 2014 సంవత్సరానికి త్రిపురనేని గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని జిలానీబానోకు ప్రకటించారు.

ఆమె మహిళా హక్కులకోసం పాటుపడుతున్న ప్రభుత్వేతర సంస్థ "ఆస్మిత"కు చైర్ పర్సన్ గా పనిచేసారు.[8] ఆమె హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసముంటున్నారు.[2][4]

రచనలు

మార్చు

మూలాలు

మార్చు
 1. "Profile on IMDB". IMDB. 2014. Retrieved January 12, 2015.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "Yalaburi". Yalaburi. 2014. Archived from the original on 2016-03-04. Retrieved January 12, 2015.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 "Muse India". Muse India. 2014. Archived from the original on 2016-03-04. Retrieved January 12, 2015.
 4. 4.0 4.1 4.2 4.3 "Urdu Youth Forum". Urdu Youth Forum. 2014. Archived from the original on 2016-05-15. Retrieved January 12, 2015.
 5. "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved November 11, 2014.
 6. ఉర్దూ రచయిత్రి జిలానీ బానుకు ఎన్టీఆర్ పురస్కారం, namasthetelangaana, MON,MAY 16, 2016[permanent dead link]
 7. Rashīduddīn (1979). Allamah Hairat Badayuni : hayat aur adabi khidmat. Adabi Markaz. p. 125.
 8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 "The Hindu". The Hindu. 19 January 2012. Retrieved January 12, 2015.
 9. "Autobiography". Urdu Youth Forum. 2014. Archived from the original on 2016-03-18. Retrieved January 12, 2015.
 10. "Listing on Amazon". Amazon. 2014. Retrieved January 12, 2015.
 11. "Well Done Abba". IMDB. 2014. Retrieved January 12, 2015.
 12. Jeelani Bano (1988). A Hail of Stones. Sterling Publishers. ISBN 978-8120718371.

ఇతర లింకులు

మార్చు