జిల్లా (2015 సినిమా)

జిల్లా 2015లో తెలుగులో విడుదలైన సినిమా. సూపర్ గుడ్ ఫిలింస్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ల పై తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి నిర్మించిన ఈ సినిమాకు ఆర్.టి.నేసన్ దర్శకత్వం వహించాడు.[1] విజయ్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జులై 2015న విడుదలైంది.[2]

జిల్లా
దర్శకత్వంఆర్.టి.నేసన్
నిర్మాతతమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి
తారాగణం
ఛాయాగ్రహణంగణేష్ రాజవేలు
కూర్పుడాన్ మ్యాక్స్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థలు
సూపర్ గుడ్ ఫిలింస్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2015 జూలై 24 (2015-07-24)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

శివుడు (మోహన్ లాల్) కుటుంబాన్న రక్షించే సమయంలో పోలీస్ ఆఫీసర్ చేతిలో శక్తి (విజయ్) తండ్రి చనిపోతాడు. ఆనాధల వున్న శక్తిని శివుడే తన సొంత కొడుకులా పెంచి పెద్ద చేస్తాడు. శివుడు శాంతి (కాజల్ అగర్వాల్)ను చూసిప్రేమలో పడతాడు. ఒకరోజు శివుడిని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు కానీ క్షణాల్లోనే శక్తి మళ్లీ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఎవరో బయటివాడు పోలీస్ అవడం వల్ల తమను అరెస్టు చేసే అవకాశం వుందని, అందుకే తమలోనే ఎవరో ఒకరు పోలీస్ అయితే ఎలాంటి సమస్య వుండదని శక్తిని పోలీస్ ఆఫీసర్ ను చేయాలని శివుడు నిర్ణయించుకుంటాడు. చివరకు శక్తి పోలీస్ ఆఫీసర్ అయ్యాడా?? శక్తిలో వచ్చిన మార్పు వల్ల ఏం జరిగింది ? ఆ సంఘటనకు కారణమైన వారిని శక్తి ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సూపర్ గుడ్ ఫిలింస్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్
  • నిర్మాత: తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.టి.నేసన్
  • సంగీతం: డి. ఇమ్మాన్
  • సినిమాటోగ్రఫీ: గణేష్ రాజవేలు
  • ఎడిటర్: డాన్ మ్యాక్స్
  • సహనిర్మాత: నామన శంకర్‌రావు
  • సమర్పణ: ఆర్.బి.చౌదరి.

మూలాలు మార్చు

  1. Sakshi (28 April 2015). "రౌడీ... పోలీస్ అయితే!". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. The Times of India (2015). "Jilla remake in Telugu" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. The Hans India (24 July 2015). "Vijay's Jilla Telugu movie review, rating" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.