జిల్లేడు
జిల్లేడు లేదా అర్క (లాటిన్ Calotropis) ఒక పాలుగల చిన్న మందు మొక్క. జిల్లేడులో మూడు జాతులు గలవు. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజుజిల్లేడు. అర్క పత్రి వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఇరవయ్యవది.
జిల్లేడు | |
---|---|
![]() | |
Calotropis gigantea | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | కాలోట్రోపిస్
|
జాతులు | |
Calotropis gigantea - ఎర్ర జిల్లేడు |
శాస్త్రీయ నామంసవరించు
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Calotropis Procera.
ఔషధ గుణాలుసవరించు
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
- చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
- శరీర సమస్యలకు ఉపయోగపదుతుంది.
- కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది.
లక్షణాలుసవరించు
- ఈ ఆకు ఎరుపు, తెలుపు, రాజ అను మూడు రంగుల్లో లభిస్తుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
- చెట్టంతా కొంచెము మదపు వాసన కలిగియుండును.
- వేరు పొడవుగా నుండును. వేరు పైన గల చర్మము కూడా తెల్లని పాలు కలిగియుండును.
- దూది వంటి నూగుతో కప్పబడిన శాఖలతో పెరిగే చిన్నపొద. 2-3 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.
- అండాకారం నుండి హృదయాకారంలో ఉన్న దళసరిగా పాలు కలిగిన సరళ పత్రాలు. క్రిందిభాగమున ఈనెలుకలిగి, తెల్లని నూగుకలిగి ఉంటాయి.
- పార్శ్వ్ అగ్రస్థ నిశ్చిత సమశిఖి విన్యాసంలో అమరి ఉన్న తెలుపు లేడా గులాబీ రంగుతో కూడిన కెంపు రంగు పుష్పాలు. ఇవి గుత్తులు గుత్తులుగా పూయును.
- కొడవలి ఆకారంలో ఉన్న జంట ఏకవిదారక ఫలాలు. పండి పగిలిన అందులో తెల్లని మృదువైన దూది యుండును.
- జిల్లేడులో రెండు రకాలు గలవు. ఒకటి ఎర్ర జిల్లేడు, 2. తెల్ల జిల్లేడు.
సువాసన గుణంసవరించు
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
ఇతర ఉపయోగాలుసవరించు
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
- పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.
- లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.
Veeti AAkulu kAanthini vedini paravArthanAM CHENDISTai
ఆయుర్వేదంలోసవరించు
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
జాతులుసవరించు
- ఎర్ర జిల్లేడు (Calotropis gigantea)
- తెల్ల జిల్లేడు (Calotropis procera)
- రాజు జిల్లేడు
హిందువులుసవరించు
- రథసప్తమి రోజు జిల్లేడు పత్రాలు ధరించి నదీస్నానము చేస్తే చాలా పుణ్యమని హిందువుల నమ్మకం.
- వినాయక చవితి రోజు జిల్లేడు ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.
గ్యాలరీసవరించు
Flowers in Hyderabad, India.
Leaves & flowers in Hyderabad, India.
Flowers in Hyderabad, India.
Flowers & fruits in Hyderabad, India.
Flowers and leaves in Kannur భారత దేశము.
మూలాలుసవరించు
వెలుపలి లింకులుసవరించు
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో జిల్లేడుచూడండి. |