జి.సి.కొండయ్య (గంగా చిన్నకొండయ్య) నెల్లూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, సాహితీవేత్త. హైదరాబాదు నుండి వెలువడిన ఆంధ్రజనత దినపత్రికకు 1968-1970 ప్రాంతంలో ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించాడు. ఇతడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం నుండి 1955, 1972 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా, 1978 ఎన్నికలలో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేశాడు. 1967 శాసనసభ ఎన్నికలలో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశాడు. 1962లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందాడు[1]. ఇతడు కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ, సోషలిస్టు డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీలలో పనిచేసి ప్రజాసేవ చేశాడు.

గంగా చిన్నకొండయ్య
జి.సి.కొండయ్య
శాసనసభ సభ్యుడు
In office
1952-1955
తరువాత వారుబెజవాడ గోపాలరెడ్డి
నియోజకవర్గంఆత్మకూరు
శాసనసభ సభ్యుడు
In office
1962-1967
నియోజకవర్గంనెల్లూరు
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీకాంగ్రెస్

రచనలు మార్చు

  1. మనభూమి మనఆహారం[2]
  2. పాకిస్తాన్ ఆటంబాంబ్
  3. భారతదేశంలో 1967 ఎన్నికలు, వ్యక్తమవుతున్న రాజకీయ పోకడలు
  4. మలబారు రైతు ఉద్యమ చరిత్ర
  5. అగోచర జీవిత జాడలు

మూలాలు మార్చు