జి. నిర్మలారెడ్డి
(జి. నిర్మలా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
జి. నిర్మలారెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన పాత్రికేయురాలు, కథా రచయిత్రి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
జి. నిర్మలారెడ్డి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | పాత్రికేయురాలు, కథా రచయిత్రి |
జీవిత విశేషాలు
మార్చుజి. నిర్మలారెడ్డి నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల పల్లి మండలం, చిలకమర్రి గ్రామంలో జన్మించింది.[2]
పాత్రికేయరంగం
మార్చు20 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్న నిర్మలారెడ్డి తొలిసారిగా వార్త దినపత్రికలో చేరింది. ఆ తరువాత ఆంధ్రజ్యోతి, టీవీ9లలో పనిచేసింది. సాక్షి పత్రికలో చేరి ఫ్యామిలీ విభాగంలో ఫీచర్ జర్నలిస్ట్‌గా బెటర్‌హాఫ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, మి అండ్ మై గాడ్ కాలమ్స్‌తో అనేకమంది మహిళల విజయాల గురించి కథనాలు రాసింది. తన కథనాల ద్వారా పేదలకు చేయూత అందేలా చేసిన నిర్మలారెడ్డి కథా రచయిత్రిగా కూడా తనదైన ముద్రవేసుకుంది.[3] ప్రస్తుతం సాక్షి దినపత్రిక చీఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తుంది.
పురస్కారాలు
మార్చు- డిఎన్‌ఎఫ్ ఉత్తమ మహిళా జర్నలిస్టు (2008)
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[4]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 19 March 2020.
- ↑ సాక్షి, తెలంగాణ (10 March 2020). "నిర్మలారెడ్డికి అభినందనలు." Archived from the original on 19 మార్చి 2020. Retrieved 19 March 2020.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 19 March 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్ సేఫ్టీ స్టేట్ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 19 March 2020.