జీశాట్-10 ఉపగ్రహం
జీశాట్-10 అనునదిభారతదేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తయారు చేసి, ప్రయోగించి నసమాచార సేకరణ, ప్రసరణచెయ్యు ఉపహ్రాగం.దీనినిఫ్రెంచి గయానా లోని రాకెట్‌లాంచ్ కేంద్రం నుండి ఏరియన్ -5ECA అను ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టారు.
మిషన్ రకం | Communication |
---|---|
COSPAR ID | 2012-051B |
SATCAT no. | 38779 |
మిషన్ వ్యవధి | 15 years (Planned) |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-3K |
తయారీదారుడు | ISRO Satellite Centre Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 3,435 కిలోగ్రాములు (7,573 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 29 September 2012 |
రాకెట్ | Ariane 5ECA |
లాంచ్ సైట్ | Guiana Space Centre ELA-3 |
కాంట్రాక్టర్ | Arianespace |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | 12 Ku-band 12 C-band 6 Lower Extended C-band |
బ్యాండ్ వెడల్పు | 36 megahertz |
ఉపగ్రహ సమాచారం
మార్చుజీశాట్–8 ప్రయోగం తరువాత INSAT/GSAT వరుసలో ప్రయోగించిన రెండవ ఉపగ్రహం ఇది. ఇస్రోవారు నిర్మించిన ఉపగ్రహాల్లో ఎక్కువ బరువుఉన్న ఉపగ్రహం జీశాట్-10. ప్రయోగసమయంలో ఉపగ్రహం బరువు 3400 కిలోలు.ఈ ఉపగ్రహంలో మొత్తం 30 ట్రాన్స్ పాండరులు అమర్చారు, KU బాండ్ ట్రాన్స్‌పాండరులు12, Cబాండ్ ట్రాన్స్‌పాండరులు12, లోపవర్ ఎక్స్‌టెండెడ్ C బాండ్ ట్రాన్స్‌పాండరులు 6 అమర్చారు.దీనితో పాటి గతంలో పనిచేయుచున్న GAGAN యొక్క సామర్ధ్యాన్ని బలోపేతం చెయ్యుపేలోడ్‌నుకూడా ఉపగ్రహంలో ఉంచారు.ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములో భూసమస్థితి కక్ష్యలో తూర్పుకు 83.0°కోణంలో భూ ప్రదక్షణ చేసెలా ఉంచారు. ఈ కక్ష్యనుడి ఈ ఉపగ్రహం సమాచారాన్ని భారతదేశానికి చేరవేస్తున్నది. జీశాట్-10 ఉపగ్రహం 15 సంవత్సరాలు తన సేవలను అందిస్తుంది.
జీశాట్-10 పేలోడ్ వివరాలు
మార్చు- అధిక శక్తి వంతమైన,140 W TWTAకలిగిన, KU-బాండ్ ట్రాన్స్‌పాండరులు: 12.
- 32 W TWTA కలిగిన C బాండ్ ట్రాన్స్‌పాండరులు:12,
- 36 బాండ్‌విడ్త్ MHz తో 32 W TWTA కలిగిన లోపవర్ ఎక్స్‌టెండెడ్ C బాండ్ ట్రాన్స్‌పాండరులు: 6
- L1, L2 బాండ్‌లో పనిచేయు GAGAN నావిగేసన్ పేలోడ్.
జీశాట్-10 ఉపగ్రహం ప్రయోగ వివరాలు
మార్చుఈ ఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలోని కౌరౌ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి, ఏరియన్-5ECA అను ఉపగ్రహ వాహకనౌక సహాయంతో 2012 సెప్టెంబరు 29 సంవత్సరము, భారతీయ కాలమాన ప్రకారం ఉదయం 2:48 గంటలకు అంతరిక్షములోకి పంపారు.ఈ ఉపగ్రహ వాహకనౌక ప్రయోగకేంద్రం నుండి బయలుదేరిన 30 నిమిషాల తరువాత జీశాట్-10 ని కక్ష్యలో వదిలినది.ఏరియన్ -5ECA వాహక నౌక జీశాట్ -10 ని కక్ష్యలో ప్రవేశ పెట్టుటకు ముందు మరో యోరోపియన్ ఉపగ్రహం ASTRA 2F ని కూడాకక్ష్యలో వదిలినది.