జీశాట్-15 ఉపగ్రహం
జీశాట్-15 ఉపగ్రహం భారతదేశపు భారతీయ అంతరిక్ష ప్రయోగసంస్థ ఇస్రోరూపకల్పన చేసి తయారు చేసిన ఉపగ్రహం.ఇది ఇస్రో తయారుచేసిన అతి శక్తివంతమైన సమాచార ఉపగ్రహం.జీశాట్-15 ఉపగ్రహం ఇన్శాట్/జీశాట్ శ్రేణికి చెందిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహంమొత్తం బరువు (ప్రయోగ సమయంలో) 3164 కిలోలు.జీశాట్-15 ఉపగ్రహం Kuబ్యాండులో పనిచేయు 24 ట్రాన్స్‌పాండరులను కలిగిఉన్నది.జీశాట్-8, జీశాట్-10 ఉపగ్రహాల తరువాత గగన్ ఉపకరణాలను (GAGAN payload) కలిగిఉన్న మూడవ ఉపగ్రహం.GAGAN అనగా GPS తో పనిచేయు జియో అగుమెంటెడ్ నావిగేసన్ (GEO Augmented Navigation).గగన్ ఉపకరణాలు L1 మరియుL5 బ్యాండులలో పనిచేయును.[2]
మిషన్ రకం | సమాచార ఉపగ్రహం |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 2015-065A |
SATCAT no. | 41028 |
మిషన్ వ్యవధి | 12 సంవత్సరాలు |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-3K |
తయారీదారుడు | ISRO Satellite Centre Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 3,100 కిలోగ్రాములు (6,800 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 10 November 2015 (planned)[1] |
రాకెట్ | ఆరియన్ 5/ఆరియన్5ECA |
లాంచ్ సైట్ | గయనా అంతరిక్ష కేంద్రం/కౌరౌ ELA-3 |
కాంట్రాక్టర్ | Arianespace |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | భూ కేంద్రీయ |
రెజిమ్ | భూస్థిర కక్ష్య |
రేఖాంశం | 93.5° East |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | 24 Ku-band |
బ్యాండ్ వెడల్పు | 36 megahertz |
ఉపగ్రహ ఉపకరణాలు(Payload)
మార్చుజీశాట్-15 ఉపగ్రహం Kuబ్యాండులో పనిచేయు 24 ట్రాన్స్‌పాండరులను కలిగిఉన్నది.జీశాట్-8, జీశాట్-10 ఉపగ్రహాల తరువాత గగన్ ఉపకరణాలను (GAGAN payload) కలిగిఉన్న మూడవ ఉపగ్రహం[3] సమాచార ప్రసారానికి సంబంధించి ఇది పదవ ఉపగ్రహం.వీటితో పాటు అదనంగా 2 Ku-బ్యాండ్ బీకాన్లు ఉన్నాయి.[4]
ఉపగ్రహ నిర్మాణ వ్యయం
మార్చుప్రయోగానికి ముందుగా ఈ ఉపగ్రహాన్ని 860 కోట్ల రూపాయలకు బీమా చేసారు.[5]
ఉపగ్రహ ప్రయోగ వివరాలు
మార్చుదక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలోని కౌర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుండి నవంబరు 11,2015 న బుధవారం, ఉదయం 3:04 (భారత కాలమానం) గంటలకు ప్రయోగ కేంద్రంనుండి బయలుదేరి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టబడింది. యూరోపియన్ ఏరియన్ సంస్థకు చెందిన ఏరియన్ 5 VA-227 అను ఉపగ్రహ వాహకనౌక ద్వరా అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టబడింది. 11గంటల 33 నిమిషాల కౌంట్‌డౌన్ తరువాత ఉపగ్రహ ప్రయోగం జరిగింది. ఉపగ్రహ వాహన ప్రయోగంజరిగిన 43 నిమిషాల 24 సెకన్ల తరువాత జీశాట్-15 ఉపగ్రహం దీర్ఘవృత్తాకార భూఅనువర్తిత బదిలో కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.జీశాట్-15 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్తినపుడు జీశాట్-15 ప్రదక్షణ పెరిజీ (భూమికి దగ్గరి దూరం) 250 కి.మీ. అపోజీ (భూమినుండి ఎక్కువ దూరం)35,819 కి.మీ.జీశాట్-15 ఉపగ్రహన్ని కక్ష్యలో భూమధ్యరేఖకు 3.9 డిగ్రీల ఎటవాలులో కక్ష్యలో పరిభ్రమించేలా ప్రవేశపెట్టారు.[6]
జీశాట్-15 ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వెంటనే కర్నాటకరాష్ట్రంలోని హాసన్ లోని ఇస్రోకుచెందిన మాస్టర్ కంట్రొల్ ఫెసిలిటి సంస్థ ఉపగ్రహన్ని తన ఆధీనంలోకి తీసుకున్నది. ఉపగ్రహం చక్కగా ఉన్నదని తెలిపినది.
బయటి విడియోలు
మార్చుఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ "GSAT-16 launch to ease ISRO's capacity crunch a bit". Retrieved 26 December 2014.
- ↑ "GSAT-15". isro.gov.in. Archived from the original on 2016-09-04. Retrieved 2015-11-09.
- ↑ "Future Programme". Indian Space Research Organisation. Archived from the original on 2010-11-25. Retrieved October 11, 2013.
- ↑ "GSAT-15". Archived from the original on 7 జనవరి 2014. Retrieved 7 January 2014.
- ↑ "Cabinet approves GSAT-15, GSAT-16 communication satellites". ANI News. ANI. June 28, 2013. Archived from the original on 2014-12-09. Retrieved October 11, 2013.
- ↑ "India's communications satellite GSAT-15 launched successfully". timesofindia.indiatimes.com/. Archived from the original on 2015-11-11. Retrieved 2015-11-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)