జీశాట్-14 ఉపగ్రహం


జీశాట్-14ఒక భారతీయ సమాచార ఉపగ్రహం.2004 సంవత్సరంలో అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టిన జీశాట్-3 ఉపగ్రహం స్థానంలో, సమాచార సేవలు అందించుటకై ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.ఈ ఉపగ్రహన్నిఇండియన్ స్పేస్ రీసెర్చ్ అర్గనైజేసన్ (ఇస్రో) వారు తయారుచేసి ప్రయోగించారు.ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములో 2014 జనవరి 5 న ప్రవేశపెట్టారు.ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ థావన్ అంతరిక్షప్రయోగ కేంద్రంనుండి నింగిలోకి విజయవంతంగా పంపి, భూస్థిర (Geostationary) కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రతిష్ఠించారు.ఈ ఉపగ్రహాన్ని ఇస్రోవారు రూపకల్పన చేసి తయారుచేసిన, జీఎస్‌ఎల్‌వి శ్రేణికి (Geosynchronous Satellite Launch Vehicle) చెందిన ఉపగ్రహ వాహకనౌక GSLV-D5 (GSLV-Mk.II) ద్వారా అంతరిక్షము లోకి పంపారు. ఈ ఉపగ్రహ వాహకంలో స్వదేశీయంగా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజన్ను మూడవ స్టేజి/దశలో ఉపయోగించారు.

జీశాట్-14
మిషన్ రకంCommunication
ఆపరేటర్India ISRO
COSPAR ID2014-001A Edit this at Wikidata
SATCAT no.39498
మిషన్ వ్యవధి12 years
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-2K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి1,982 కిలోగ్రాములు (4,370 పౌ.)
డ్రై ద్రవ్యారాశి851 కిలోగ్రాములు (1,876 పౌ.)
శక్తి2,600 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ5 January 2014, 10:48 (2014-01-05UTC10:48Z) UTC[1]
రాకెట్GSLV Mk.II D5
లాంచ్ సైట్Satish Dhawan SLP
కాంట్రాక్టర్ISRO
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° East
Perigee altitude35,776 కిలోమీటర్లు (22,230 మై.)[2]
Apogee altitude35,809 కిలోమీటర్లు (22,251 మై.)[2]
వాలు0.11 degrees[2]
వ్యవధి1436.12 minutes[2]
ఎపోచ్22 January 2015, 20:39:21 UTC[2]
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్6 Ku-band
6 ext. C-band
2 Ka-band
కవరేజ్ ప్రాంతంIndia
 

ఉపగ్రహం వివరాలు

మార్చు

జీశాట్-14ఉపగ్రహాన్ని, ఇస్రోవారు జీశాట్ ఉపగ్రహశ్రేణిలో భాగంగా నిర్మించిన ఉపగ్రహం.ఇంధనం నింపక ముందు ఈ ఉపగ్రహం బరువు 851 కిలోగ్రాములు, ఇంధనం నింపిన తరువాత 1,982 కిలోగ్రాములు .ఉపగ్రహం యొక్క పరిమాణం 2.0 X 2.0 X 3.6 మీటర్లు.ఈ ఉపగ్రహం పనిచెయ్యు కాలం 12 సంవత్సరాలుగా నిర్ణయించారు

ఈ ఉపగ్రహంలో ఆరు Ku-band ట్రాన్స్‌పాండరులు, ఆరు ఎక్సుటెండేడ్C-band ట్రాన్స్‌పాండరులు అమర్చబడి, భారతదేశం మొత్తానికి సమాచారాన్ని చేరవేయు సామర్ధ్యం కలిగి ఉంది.ఈ ఉపగ్రహం గతంలో ప్రయోగించిన జీశాట్-3 కన్న మెరుగైన సేవలను అందించేలా రూపకల్పన చేసారు.ఉపగ్రహంలో అదనంగా రెండు Ka-band బెకాన్‌లను ఏర్పాటు చేసారు, ఈ రెండుబెకానులు, Ku-band ఉపగ్రహ సమాచార వ్యవస్థపై వాతావరణ ప్రభావాన్ని అధ్యయనం చేస్తాయి.

ఉపగ్రహ నిర్వహణకు అవసరమైన విద్యుతు సౌరపలకలవలన ఉత్పత్తి చెయ్యబడుతుంది.ఈ సౌరపలకల విద్యుతు ఉత్పత్తి సామర్ధ్యం 2,600 వాట్స్.సమాచారాన్ని పంపుటకు, స్వీకరించుట ఒకటి 2 మీటర్లు, మరొకటి 2.2 మీటర్లు ఉన్నసింగిల్ షెల్ రూపమున్నఎంటేన్నాలు ఉన్నాయి.

అదనంగా ఉపగ్రహంలో అమర్చి పరీక్షించిన నూతన సాంకేతిక పరికారాలు, పరిశోధనలు /ప్రయోగాలు

  • ఫైబర్ ఆప్టిక్ గైరో
  • ఆక్టివ్ పిక్సెల్ సన్ సెన్సర్
  • Ka band బెకాన్ ప్రపగేసన్ అధ్యయనం
  • థెర్మల్ కంట్రోల్ కోటింగ్ ప్రయోగాలు

ఉపగ్రహ ప్రయోగం

మార్చు

ఈ ఉపగ్రహాన్ని మొదట 2013 ఆగస్టు 19 భారతీయ కాలమానము ప్రకారం సాయంత్రం 4:50 (11:20 UTC) ప్రయోగించుటకు ప్రయత్నం చేయగా, ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక్ రెండవ దశలోని ఇంధన ట్యాంకునుండి ఇంధనం కారటం గమనించారు. రాకెట్ రెండవ స్టేజి/దశలోని ఇంధన టాంకును మార్చినతరువాతనే ఉపగ్రహాన్ని ప్రయోగించడం సురక్షితమని నిర్ణయించి ఉపగ్రహ ప్రయోగాన్ని వాయిదా వేసారు. అదే క్రమంలోవాహక నౌకకు మొదటి దశలో బిగించు నాలుగు స్ట్రాపాన్ మోటారులను కూడామార్చారు.ఉపగ్రహన్ని అంధ్రప్రదేశ్ రాష్టంలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని సతీష్ థావన్ స్పేస్ సెంటరు లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించారు.29 గంటల ప్రయోగ కౌంట్ డౌన్ 4జనవరి 20 14న మొదలినది. GSAT-14 ఉపగ్రహ న్ని మోసుకొనివాహక నౌక GSLV Mk.II/D5, 5 జనవరి 20 14, భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం16:18 గంటలకు నింగిలోని తన లక్ష్య వైపు విజయ వంతంగా దూసుకు వెళ్ళింది.ఈ ప్రయోగం భారతదేశం యొక్క 41 వ ఉపగ్రహ ప్రయోగం కాగా, ఉపగ్రహ వాహక నౌక GSLVశ్రేణికి సంబధించి ఇది 8 వ ప్రయోగం., రాకెట్ GSLV Mk.II/ D5 కు సంబంధించిన రెండవ ప్రయోగం.గతంలో 2014లో ఈ రకపు ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షములో GSAT-4 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టుటకై చేసిన ప్రయోగం విఫలమైనది. అంతకు ముందు2006 లో INSAT-4C నితో మొదలై వరుసగా నాలుగు విఫలం చెందిన GSLV ప్రయోగాల తరువాత ఈ 5 వప్రయోగం సఫలమై, ఇస్రోవారి ఘనత ఇనుమడింపచేయబడింది.క్రయోజనిక్ విధానంలో ఇంధనం మండించుCE-7.5 ఇంజను కలిగి, సఫలమైన మొదటి రాకెట్ ఇది.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Subramanian, T. S. (22 December 2013). "GSLV-D5 to lift off on 5 January". The Hindu. India. Retrieved 24 December 2013.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "GSAT-14 Satellite details 2014-001A NORAD 39498". N2YO. 22 January 2015. Retrieved 25 January 2015.