జువ్వాడి చొక్కారావు
జువ్వాడి చొక్కారావు (జననం 1923 జూలై 23 - 1999 మే 28) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎంపి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం[1] నుండి ఎంపిగా మూడుసార్లు, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందాడు.[2] 1971 - 1972 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖకు, 1973 - 1977 మధ్యకాలంలో రవాణా, వ్యవసాయ, చక్కెర పరిశ్రమ, దేవాదాయ, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేశాడు. విద్యార్థి నాయకుడిగా, ఆర్య సమాజ్ సారథిగా, హైదరాబాద్ రాష్ట్ర విమోచన పోరాటంలో, సహకార ఉద్యమంలోను కీలకపాత్ర వహించాడు. పార్లమెంట్‌లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సూచించాడు.
జువ్వాడి చొక్కారావు | |||
| |||
పార్లమెట్ సభ్యుడు (భారతదేశం)
కరీంనగర్ | |||
పదవీ కాలం 1984 – 1996 | |||
నియోజకవర్గం | కరీంనగర్ | ||
---|---|---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు (కరీంనగర్)
| |||
పదవీ కాలం 1952-1957; 1967-1977 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 23 జూలై 1923 కరీంనగర్, తెలంగాణ, భారతదేశం | ||
మరణం | 1999 మే 28 హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | (వయసు 75)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎంపి |
జీవితం
మార్చుచొక్కారావు 1923, జూలై 23న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం)లోని కరీంనగర్ జిల్లాలోని ఇరుకుళ్ళ గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు నర్సింగ్ రావు.[3]
వ్యక్తిగత జీవితం
మార్చుచొక్కారావుకు మురలమ్మతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
రాజకీయ జీవితం
మార్చుకాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చొక్కారావు జిల్లాస్థాయిలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి రాష్ట్రస్థాయి నేతగా ఎదిగాడు. 1957లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పీడీఎఫ్ అభ్యర్థి వి.ఆర్. రావుపై 3,081 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 1962లో జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ అభ్యర్థి అల్లిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో 1,618 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 1967లో జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి ఎం. రాంగోపాల్ రెడ్డిపై 3296 ఓట్ల మెజారీటీతో, 1972లో జరిగిన ఎన్నికల్లో ఎస్.టి.ఎస్. అభ్యర్థి దేవరాజు అంజనేయులుపై 15,489 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. తరువాత జనాతా పార్టీలో చేరాడు. 1978లో జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి నల్లమాచు కొండయ్య చేతిలో 21,984 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
చొక్కారావు 1984లో జరిగిన ఎనిమిదో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, అప్పటికే ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి (టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు)ని 78వేల మెజారిటీతో ఓడించి రికార్డు సృష్టించాడు. ఆ తరువాత వరుసగా 1989లో జరిగిన 9వ లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చల్మెడ ఆనందరావుపై,[4] 1991 ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) అభ్యర్థి ఎన్.వి. కృష్ణయ్యపై గెలిచి హాట్రిక్ సాధించాడు.[5] 1996లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎల్. రమణ చేతిలో ఓడిపోయాడు.[6]
చొక్కారావు గారు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు తెలంగాణకి జరుగుతున్న అన్యాయాల గురించి చాలా పోరాడాడు. ఎ. పి. ఆర్. సి. చైర్మన్లందరిలోకెల్లా గొప్ప పేరు సాధించాడు.
హోదాలు
మార్చు- 1953 - 1959: జిల్లా పరిషత్ చైర్మన్[7]
- 1959 - 1962, 1964 - 1967: కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు
- 1962 - 1964ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబరు
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు
- 1967 - 1971: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రీజినల్ కమిటీ చైర్మన్
- 1956 - 1996: ఏఐసీసీ సభ్యుడు
మరణం
మార్చుచొక్కారావు 1999, మే 28 రోజున డిల్లిలో మరణించారు .స్వగ్రామము ఇరుకుల్ల, కరినగర్ జిల్లలో చివరి కార్యక్రమం జరిగింది
గౌరవం
మార్చుఇతని గౌరవార్ధం జె. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇతని పేరు పెట్టారు.[8]
మూలాలు
మార్చు- ↑ "TRS clean sweep in Karimnagar a challenge for Congress, BJP". The New Indian Express. 2019-04-03. Archived from the original on 2019-04-06. Retrieved 2021-10-08.
- ↑ "Members Bioprofile -". Retrieved 8 January 2018.
- ↑ లోక్‌సభ, సభ్యులు. "Members Bioprofile (J. Chokka Rao)". www.loksabhaph.nic.in. Archived from the original on 8 October 2021. Retrieved 8 October 2021.
- ↑ "IndiaVotes PC: Karimnagar 1989". IndiaVotes. Retrieved 2021-10-08.[permanent dead link]
- ↑ "Karimnagar Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Archived from the original on 2020-07-04. Retrieved 2021-10-08.
- ↑ సాక్షి, పాలిటిక్స్ (2 April 2019). "అసామాన్యుడు". Sakshi. నరేశ్ ఆముదాల. Archived from the original on 8 October 2021. Retrieved 8 October 2021.
- ↑ Kumar, Puli Sharat (2019-03-12). "Women get leverage with amendments to PR Act". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2021-03-01. Retrieved 2021-10-08.
- ↑ https://telanganatoday.com/tight-security-at-irrigation-projects-in-bhupalpally