జెట్టిపాలెం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా రెంటచింతల మండలానికి చెందిన గ్రామం

జెట్టిపాలెం, పల్నాడు జిల్లా, రెంటచింతల మండలానికి చెందిన గ్రామం.

జెట్టిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
జెట్టిపాలెం is located in Andhra Pradesh
జెట్టిపాలెం
జెట్టిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°35′59″N 79°30′00″E / 16.599741°N 79.499915°E / 16.599741; 79.499915
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం రెంటచింతల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ జఠావతు మంగ్లా నాయక్
పిన్ కోడ్ 522421
ఎస్.టి.డి కోడ్ 08642

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల

మార్చు

బెల్లంకొండ గ్రామానికి చెందిన మామిడి బేబీరాణి, ఇంటర్, డి.ఎడ్., చదివి నాలుగు సంవత్సరాలుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయు రాలిగా పనిచేస్తున్నారు. ఈమె పలకా, బలపాలతోగాక, బొమ్మలతో విద్యాబోధన చేయుచూ, పాఠ్యాంశాలపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించు చున్నారు. చెరువు మట్టితో కూరగాయలు, వివిధ రకాల పండ్లు, జంతువులు, పెన్సిల్ పొట్టుతో పుష్పాలు, చీపురుపుల్లలతో పశువుల పాక, ప్రభ, ఐస్ పుల్లలతో ఇళ్ళు, రాళ్ళతో సీతాకోకచిలుకలు వగైరాలను తయారు చేయించారు. ఆధ్యాత్మిక చింతన పెంచేవిధంగా మట్టితో వినాయక ప్రతిమలను తయారుచేసారు. ఉపాధ్యాయురాలు చేస్తున్న పనిని గమనించిన విద్యార్థులు, బొమ్మల తయారీపై ఆసక్తి పెంచుకుంటున్నారు.తరగతి గదులపై బొమ్మలు, బెలూన్లు, అంకెలు, ఇంగ్లీషు పదాలు, గుణింతాలు, విద్యపై ఆసక్తిపెంచే నినాదాలు, రంగులతో వ్రాయుచూ విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచేటందుకు కృషిచేస్తున్నారు. వీరికి కావలసిన నిధులను, ప్రధానోపాధ్యాయురాలు ట్.ఎల్.ఎం. నిధులనుండి సమకూర్చడం విశేషం. [3]

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో జఠావతు మంగ్లా నాయక్, సర్పంచిగా, 160 ఓట్ల మెజారిటీతో, ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
 
సత్రశాల దేవాలయం

శ్రీ బంగారు మైసమ్మ ఆలయం

మార్చు

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015, మే నెల-10వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకొనుటకై, పలు గ్రామాలనుండి భక్తులు, ఉదయాన్నే పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్తు తోరణాలు ఏర్పాటుచేసారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. [5]

పల్నాడులో వీరభాగవతక్షేత్రమని విఖ్యాతి పొందిన సత్రశాల గుంటూరుజిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతుంది. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం జెట్టిపాలెంకు అతి సమీపంలో ఉంది.

మినీ (రివర్సబుల్) జలవిద్యుత్తు కేంద్రం

మార్చు

నాగార్జునసాగరు ప్రాజక్టుకు దిగువన, 24 కి.మీ. దూరంలో ఉన్న జెట్టిపాలెం గ్రామ సమీపంలో, ఒక టెయిల్ పాండ్ డ్యాం మరియూ ఒక మినీ జలవిద్యుత్తు కేంద్రం, నిర్మాణంలో ఉన్నాయి. 20 క్రస్ట్ గేట్లతో నిర్మిస్తున్న ఈ డ్యాంలో, 7 టి.ఎం.సి. ల నీటి నిల్వకు అవకాశం కల్పించుచున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రంలో, ఒక్కొక్కటీ 25 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ద్వారా, 50 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయుదురు. 2006లో, 464 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభమయిన ఈ ప్రాజెక్టు, ఇప్పుడు నిర్మాణం పూర్తి అయి, విద్యుదుత్పాదనకు సిద్ధంగా ఉంది. మొత్తం రు. 950 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినది. జూలై-2016 లో ప్రారంభించెదరు.

నాగార్జునసాగరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్మించిన రెండు రివర్సబుల్ టర్బైన్ల ద్వారా, ఇక్కద టెయిల్ పాండులో నిలువచేసిన నీటితో విద్యుదుత్పత్తి చేసెదరు. విద్యుత్తు గిరాకీ లేని సమయంలో, ఈ నీటిని, సాగరు జలాశయంలోనికి తిరిగి వెనుకకు పంపించెదరు. గిరాకీ ఉన్న సమయంలోనే ఇక్కడ విద్యుదుత్పత్తి చేసెదరు.

సౌర విద్యుత్తు కేంద్రం

మార్చు

జెట్టిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో, నాగార్జునసాగర్ టైల్ పాండుని ఆనుకునే, 181 ఎకరాల విస్తీర్ణంలో, సాగుకు అవకాశంలేని రాళ్ళతో నిండిన భూమిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (APGENCO) ఆధ్వర్యంలో 30 మెగావాట్ల సామర్ధ్యంతో ఒక సౌర విద్యుత్తు కేంద్రాన్ని దశలవారీగ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసికొన్నది.

పరాశక్తి సిమెంట్ కర్మాగారం

మార్చు

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

మార్చు

గుండా సైదయ్య, స్వాతంత్రసమరయోధులు

మార్చు

మహాత్మా గాంధీ రెంటచింతలలో పర్యటించి నపుడు, వీరు ఆయన ఉపన్యాసానికి ఆకర్షితుడై, పల్నాట జరిగిన పలు స్వాతంత్ర్య పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు. సత్రశాల పుణ్యక్షేత్రంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన అన్నదానసత్రానికి 20 సంవత్సరాలు అధ్యక్షులుగా సేవలందించారు. పల్నాట అన్నిదేవాలయాలలో నిర్వహించు ఉత్సవాలలో పాల్గొని సీతారామ భజన బృందం అధ్యక్షులుగా భక్తిని చాటే భజనలు, కీర్తనలు ఆలపించేవారు. వీరు 95 సంవత్సరాల వయస్సులో, 2017, ఫిబ్రవరి-27న అనారోగ్యంతో శివైక్యం చెందినారు.

మూలాలు

మార్చు