సత్రశాల
పల్నాడులో వీరభాగవత క్షేత్రమని విఖ్యాతి పొందిన సత్రశాల గుంటూరుజిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతోంది. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం మాచెర్లకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రెంటచింతల మండలం, జెట్టిపాలెం సమీపంలోని కృష్ణానది ఒడ్డన కలదు.[1]
శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి దేవాలయం SRI BRAMARAMBA MALLIKHARJUNASWAMI TEMPLE | |
---|---|
భౌగోళికాంశాలు : | 16°38′N 79°29′E / 16.63°N 79.49°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ మల్లిఖార్జునస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | పల్నాడు జిల్లా |
ప్రదేశం: | సత్రశాల |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | మల్లిఖార్జునుడు(శివుడు) |
చరిత్ర
మార్చుసత్రశాలలో మల్లేశ్వరలింగాన్ని విశ్వామిత్రుడు ప్రతిష్ఠించాడు. సా.శ.1244లో కాకతీయ సామంతుడు మహామండలేశ్వర కాయస్థ అంబదేవుడు సత్రశాలలోని స్వయంభూ శ్రీమహాదేవుని ఆలయానికి మార్గళి ఉత్సవం జరపడానికి ఏర్పాట్లు చేశాడు[2]. ఆ ప్రాంతంలో వసూలైన సుంకాలను దేవాలయ దైవ, ధూప, నైవేధ్యాలకు ఉపయోగించాలి[3]. మహర్షులు అనేక దీర్ఘ సత్రయాగాదులు చేస్తూ ఈశ్వరాధాన చేసిన మహాస్థలమగుటచేత ఈ క్షేత్రరాజమును సత్రశాల అనే పేరు వచ్చిందని ప్రతీతి. పాల్కురికి సోమనాథులకు సమాకాలికుడైన గోదావరి మండలం పట్టస గ్రామానికి చెందిన యథావాక్కుల అన్నమయ్య ఈ పుణ్యభూమికి వచ్చి మల్లేశ్వరస్వామివారిని సేవించుచు శా.శ 1164 లో సర్వేశ్వర శతకము రచించి యిచ్చటనే సిద్ధి పొందినట్లు ప్రతీతి.[4] విశ్వామిత్రుడు బ్రహ్మరిషి అనబడే మహొన్నత పదవి కోసం సత్రయాగం చేయుట చేత ఈ ప్రదేశంకు సత్రశాల అనియు, శ్రీ మహా విష్ణువు బలిచక్రవర్తి గర్వము అణుచుటకు వామనరూపము దాల్చిన ఈ వనమును సిద్ధవనం అనియు, శ్రీరాముడు అస్త్రశస్త్రంబులచే ఛత్రాకారము నిర్మించుటచే శస్త్రశాల అనియు నామధేయము ఏర్పడిందని ప్రతీతి.
ఆలయ విశేషాలు
మార్చుసత్రశాల క్షేత్రమున అనేక ప్రాచీన శివాలయాలు ఉన్నాయి[5]. ఈ క్షేత్రమున భ్రమరాంబ, మల్లిఖార్జునుడు, శివకేశ భేదరహితముగా శ్రీ కుమారస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణ, శ్రీ విశ్వేశ్వరుడు, శ్రీ కాలభైరవుడు, శ్రీ చీకటి మల్లయ్యస్వామి, శ్రీ బ్రహ్మదేవుడు, శ్రీ ఆంజనేయస్వామి, అమరలింగేశ్వరుడు, సంతానమల్లిఖార్జునుడు, శ్రీచెన్నకేశవస్వామి, శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి వ్యాస పూర్షమ, మహా శివారాత్రి పర్వదినాలలో ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానదిలో తోట్టి, లాంచీల ద్వారా కృష్ణానది దాటి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. కృష్ణా పుష్కరాలు సమయం భక్తులు పోటేత్తుతారు. ఈ క్షేత్రంలో శ్రీశైలం వలే అన్ని కులముల వారిక సత్రాలు ఉన్నాయి. ఈ సత్రాలులో వసతి, బోజన సదుపాయాలు ఉంటాయి.
కాకులు వాలని క్షేత్రం
మార్చుబ్రహ్మర్షి అవుటకు విశ్వామిత్రుడు ఇచ్చట యాగం చేముచుండను. దైదా కుమారుడైన కాకాసురడును రాక్షసుడు తోటి రాక్షసులను వెంటబెట్టుకొని విశ్వామిత్రడు నిష్ఠను బగ్నము చేయదలచి కావ్..కావ్ అని వాయురోధన చేయుచుండెను. ఆ రోధనలుకు ఆగ్రహించిన విశ్వామిత్రడు అవి నిజమైన కాకులని భావించి ఈ నీచ కాకులు ఈ ప్రాంగణములో ఎక్కడా వాలినా జీవము పోవుగాక అని శపించెను అని స్థలపురాణం. దీంతో ఈ ప్రాంతంలో నేటికి కాకులు వాలవు.
శివరాత్రి సంబరాలు
మార్చుశివరాత్రి సమయంలో ఇక్కడికి భక్తులు రాక అధికంగా ఉంటుంది. సత్రశాల సమీపంలోని అన్ని గ్రామాల ప్రజలు శివరాత్రి రోజున ప్రభలు కట్టుకొని ఇక్కడికి వచ్చి, శివరాత్రి రోజున జాగరణ చేస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.
సత్రాలు
మార్చుసత్రశాల క్షేత్రమున శ్రీశైలంలో అన్ని కులమలవారికి ఏవిందగానయితే సత్రములు గలవో ఇచ్చట కూడా అన్ని కులములవారికి సత్రములు గలవు. ఆర్యవైశ్య, రెడ్డి సమాఖ్య, కాకతీయ కమ్మ సంఘం, కాపు సంఘం, వీర క్షత్రీయ, రజక, తొగట వీర క్షత్రియ లేదా తొగట, గౌడ, మేరు, విశ్వబ్రాహ్మణ, నాయిబ్రాహ్మణ, వడ్డెర సంఘాలకు సత్రములు ఉన్నాయి.
రోడ్డు మార్గం
మార్చుగుంటూరుకు 125కిమీ మాచెర్లకు 20కిమీ దూరంలో గోలి, మల్లవరం, జెట్టిపాలెం గ్రామాలకు సమీపంలో ఈ సత్రశాల క్షేత్రం ఉంది. గుంటూరు, మాచర్ల నుంచి బస్సు ద్వారా పాలువాయి జంక్షన్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటోద్యారా 6 కీమీ దూరంలో ఉన్న సత్రశాలకు చేరుకోవచ్చును
చిత్రమాలిక
మార్చు-
సత్రశాల దేవాలయం
-
మల్లికార్జునస్వామి
-
భ్రమరాంబ అమ్మవారు
-
అన్నపూర్ణదేవి విగ్రహం
-
శాసనం
-
నంది విగ్రహం
-
సత్రశాల శివుడి విగ్రామం
-
శాసనం
-
సత్రశాల పుణ్యక్షేత్రం వద్ద నున్న కృష్ణా నది
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-20. Retrieved 2014-11-17.
- ↑ http://books.google.co.in/books?id=SUNuAAAAMAAJ&q=satrasala&redir_esc=y
- ↑ http://books.google.co.in/books?id=ZQDjAAAAMAAJ&q=satrasala&dq=satrasala&redir_esc=y
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-10. Retrieved 2014-11-17.
- ↑ http://books.google.co.in/books?id=6OJSAAAAcAAJ&pg=PA155&dq=satrasala&redir_esc=y#v=onepage&q=satrasala&f=false