జె. శివషణ్ముగం పిళ్లై

భారతీయ రాజకీయవేత్త

జగన్నాథన్ శివషణ్ముగం ( 1901 ఫిబ్రవరి 24 - 1975 ఫిబ్రవరి 17) భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు. ఇతను 1938లో మద్రాసులో మొదటి షెడ్యూల్డు కులాల మేయర్‌ అయ్యాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మద్రాసు శాసనసభకు మొదటి స్పీకర్‌గా కూడా పనిచేశాడు.[1]

జె. శివషణ్ముగం
జననం
జగన్నాథన్ శివషణ్ముగం

24 ఫిబ్రవరి 1901
మద్రాసు, తమిళనాడు
మరణం1975 ఫిబ్రవరి 17(1975-02-17) (వయసు 73)
విద్యాసంస్థలయోలా కళాశాల,చెన్నై
వృత్తిరాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిచంద్ర

ప్రారంభ జీవితం మార్చు

శివషణ్ముగం మద్రాసు నగరంలో 1901 ఫిబ్రవరి 24న జగన్నాథన్ కి జన్మించాడు. అతను మద్రాసులో పాఠశాల విద్యను అభ్యసించి, లయోలా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ప్రైవేట్‌లో మాస్టర్స్ పూర్తి చేసాడు.[1][2]

మొదటి అసెంబ్లీ స్పీకర్ మార్చు

రాష్ట్ర అసెంబ్లీలకు మొదటి ఎన్నికలు 1951లో జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, భారతీయ పౌరులందరినీ చేర్చడానికి ఫ్రాంచైజీ విస్తరించబడింది. శివషణ్ముగం అసెంబ్లీకి ఎన్నికయ్యాడు, మొదటి స్పీకర్‌గా విజయవంతంగా నామినేట్ అయ్యారు. శివషణ్ముగం 1951 నుండి 1955 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశాడు.[3]

రాజ్యసభ సభ్యుడు మార్చు

1955 నుండి 1961 వరకు, శివషణ్ముగం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పనిచేశాడు. 1962లో, అతను భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు నామినేట్ అయ్యాడు, 1962 నుండి 1968 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు.[1][4]

కుటుంబం మార్చు

శివషణ్ముగం 1937లో చంద్రను వివాహం చేసుకున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[1]

మరణం మార్చు

శివషణ్ముగం 1975 ఫిబ్రవరి 17న తన 73వ ఏట మరణించాడు.[1]

మూలాల మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Rāmacandra Kshīrasāgara (1994). Dalit movement in India and its leaders, 1857-1956. M.D. Publications Pvt. Ltd. pp. 294–295. ISBN 8185880433, ISBN 978-81-85880-43-3.
  2. "Tamil Nadu Legislative Assembly: Details of terms of successive Legislative Assemblies constituted under the Constitution of India". Government of India. Archived from the original on 9 April 2009. Retrieved 3 April 2009.
  3. "Tamil Nadu Legislative Assembly: Details of terms of successive Legislative Assemblies constituted under the Constitution of India". Government of Tamil Nadu. Archived from the original on 6 October 2014.
  4. Biographical Sketch - Rajya Sabha. Government of India. Archived from the original on 29 మార్చి 2008.