జె. సి. దివాకర్ రెడ్డి

అనంతపురం నుండి 16వ లోక్ సభ సభ్యులు. తెలుగు దేశం పార్టీ.
(జే సీ దివాకర్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)


జె. సి. దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినా రాజకీయనాయకుడు. పూర్తి పేరు జూటూరూ చిన దివాకర్ రెడ్డి.తండ్రి జూటూరూ చిన నాగి రెడ్డి స్వాతంత్ర్యసమరయోధులు. ఈయన 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలులో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు.[1][2]

జె. సి. దివాకర్ రెడ్డి
జె. సి. దివాకర్ రెడ్డి


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 May 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1945-02-24) 1945 ఫిబ్రవరి 24 (వయసు 79)
నివాసం తాడిపత్రి, ఆంధ్రప్రదేశ్
మతం హిందూ

రాజకీయ జీవితం

మార్చు

ఇప్పటివరకు ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు, ఐదు సార్లు తాడిపత్రి నుంచి ఎన్నికయ్యారు. 2004 - 2006 లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసారు.

తెలుగుదేశం పార్టీలో

మార్చు

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జె.సి.దివాకర్‌ రెడ్డి, ఆయన సోదరుడు జె.సి.ప్రభాకర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. దివాకర్‌ రెడ్డి కుమారుడు పవన్‌ రెడ్డి కూడా వారిని అనుసరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు [3]

వివాదస్పదం

మార్చు

రాజకీయాల్లో సీనియర్ నేత జె.సి దివాకర్ రెడ్డి అంటే తెలియని వారు వుండరు... రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ లో వున్న ఆయన, విభజన తర్వాత టీడిపీ లోకి వచ్చారు. జె.సి ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన స్టైల్ డిఫరెంట్ గా వుంటుంది... సహజంగా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు... తమ అభిప్రాయలు డైరెక్ట్ గా ఎక్ష్ప్రెస్స్ చెయ్యరు... కాని జె.సి.దివాకర్ రెడ్డి మాత్రం తన అభిప్రాయలు నిర్మొహమాటంగా చెప్తారు... దేనికి భయపడరు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటమే ఆయన స్టైల్. ఆయనకు మనస్సుకు ఏమి అనిపించినా వెంటనే బయటకు మీడియా ముందైన అనేస్తారు. దాంతో అనేక సార్లు. చిన్నచిన్న సమస్యలు వచ్చినవి.

ప్యాక్షన్ నాయకుడు

మార్చు

అనంతపురం జిల్లాలో ప్యాక్షన్ రాజకీయాల్లో నాయకుడు అని ఎవరైన అన్నా నో నో నా చేతికి ఏప్పుడు రక్తం అంటలేదు [4] అంటారు. అతనిపైన కేసులు ఉన్నాయి.

మూలాలు

మార్చు

https://www.youtube.com/watch?v=G4U4cigX_f0

బయటి లింకులు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-28. Retrieved 2015-09-20.
  2. "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 17 May 2014.
  3. [1][permanent dead link]
  4. [2]