జోవా మొరానీ
జోవా మొరానీ (జననం 1988 మార్చి 29) ఒక భారతీయ మోడల్, బాలీవుడ్కు చెందిన నటి.[1][2][3] ఆల్వేస్ కభీ కభీ (2011), భాగ్ జానీ (2015), తైష్ (2020), ట్యూస్ డేస్ & ఫ్రైడేస్ (2021) వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె నటించింది. అలాగే, ఆమె కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించింది.
ఆమె సినిమా నిర్మాత, సినీయుగ్ (Cineyug) సహయజమాని కరీం మొరానీ కుమార్తె. ఆమె చలనచిత్ర నిర్మాతలు అలీ మొరానీ, మహమ్మద్ మొరానీల మేనకోడలు కూడా. ఆమె అత్త, మహమ్మద్ భార్య లక్కీ మొరానీ ఫ్యాషన్ డిజైనర్, నటి.
కెరీర్
మార్చుఆమె 2007లో వచ్చిన ఓం శాంతి ఓం చిత్రానికి సహాయ దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించింది. హల్లా బోల్ (2008)కి కూడా సహాయ దర్శకత్వం వహించింది ఆమె.[4] అయితే, ఆమెకు దర్శకత్వం మీద అంత ఆసక్తి లేకపోయినా, నటిగా మారడానికి మార్గం సుగమం అవుతుందని భావించింది.[5] ఆమె 2011లో షారుఖ్ ఖాన్ నిర్మాణంలో ఆల్వేస్ కభీ కభీలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత, ఆమె చిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ చిత్రానికి సంతకం చేసింది.
2011లో, లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఆమె మోడలింగ్ అసైన్‌మెంట్‌ను చేపట్టింది. ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ 2012 ఎడిషన్‌లో కనిపించింది.[6]
కునాల్ ఖేము, మందన కరిమిలతో పాటు ఆమెను భాగ్ జానీ చిత్రం కోసం విక్రమ్ భట్ సంతకం చేయించాడు. భూషణ్ కుమార్, విక్రమ్ భట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2015లో విడుదలైంది.[7][8][9]
వ్యక్తిగత జీవితం
మార్చుజోవా మొరానీ సినీ నిర్మాత కరీం మొరానీ కుమార్తె. ఆయన సినీయుగ్ సహయజమాని. ఆమె సోదరి కూడా సినీయుగ్‌తో అనుబంధం కలిగి ఉంది. ఈమె నటి పద్మిని కొల్హాపురే కుమారుడు ప్రియాంక్ శర్మను వివాహం చేసుకుంది.[10]
మూలాలు
మార్చు- ↑ "Zoa Morani bags Benegal's next". The Times of India. 5 November 2011. Archived from the original on 3 January 2013. Retrieved 1 April 2012.
- ↑ "I am quite a drama queen!" – Zoa Morani". Freepress Journal.
- ↑ "Deepika Padukone a hard worker: Zoa Morani". Freepress Journal.
- ↑ "Zoa Morani to make first appearance at LFW show". Sify.com. 12 March 2011. Archived from the original on 25 December 2013. Retrieved 1 April 2012.
- ↑ Udasi, Harshikaa (21 May 2011). "New kids on the block". The Hindu. Chennai, India. Retrieved 2 April 2012.
- ↑ "Let your feet go wild!". Daily News and Analysis. 6 March 2012. Retrieved 1 April 2012.
- ↑ "Zoa ropes in Katrina's diction trainer for herself". The Times of India. Archived from the original on 20 October 2013.
- ↑ "Director Vikram Bhatt to launch Iranian model Mandana Karimi". The Times of India. Archived from the original on 19 July 2013.
- ↑ "Zoa Morani missed her family". The Times of India. Archived from the original on 18 November 2013.
- ↑ "Who is Karim Morani? - Firstpost". Firstpost.