మందన కరిమి
మందన కరిమి (జననం మనీజే కరిమి; 1988 మే 19) భారతదేశంలోని ఒక ఇరానియన్ నటి, మోడల్.[3][4] ప్రపంచవ్యాప్తంగా అనేక విజయవంతమైన మోడలింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన తర్వాత,[5] ఆమె బాలీవుడ్ చిత్రం భాగ్ జానీలో ప్రధాన పాత్రలో నటించింది.[6] 2015లో, ఆమె ప్రముఖ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 9లో పాల్గొని 2వ రన్నరప్‌గా నిలిచింది.[3]
మందన కరిమి | |
---|---|
జననం | మనీజే కరిమి (Manizeh Karimi) 1988 మే 19[1] టెహ్రాన్, ఇరాన్ |
జాతీయత | ఇరానియన్ |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
ఎత్తు | 178 cమీ. (5 అ. 10 అం.) |
జీవిత భాగస్వామి | గౌరవ్ గుప్తా
(m. 2017; div. 2021) |
బాల్యం
మార్చుమందన కరిమి 1988 మే 19న ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి భారతీయ సంతతికి చెందిన ఇరానియన్ కాగా తల్లి పర్షియన్.[7] ఆమె టెహ్రాన్‌లో పెరిగింది.[3]
కెరీర్
మార్చుమందన కరిమి ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది, తరువాత మోడలింగ్‌పై తనకున్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.[8] 2010లో, వివిధ అంతర్జాతీయ మోడలింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన తర్వాత, మోడలింగ్ కాంట్రాక్ట్‌పై మూడు నెలల పాటు ముంబైకి వచ్చింది.[9]
షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, షాహిద్ కపూర్, అర్జున్ కపూర్‌లతో కలసి ఆమె టీవీ ప్రకటనలు చేసింది.[10][11]
ఫిబ్రవరి 2015లో, ఆమె రాయ్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. ఆ తరువాత సంవత్సరం సెప్టెంబర్‌లో ఆమె నటించిన చిత్రం భాగ్ జానీ విడుదలైంది. ఆమె అక్టోబర్ 2015లో మెయిన్ ఔర్ చార్లెస్‌లో కూడా నటించింది, ఇందులో ఆమె చార్లెస్ శోభరాజ్ అసిస్టెంట్ పాత్రను పోషించింది. ఆ తదుపరి సెక్స్ కామెడీ చిత్రం క్యా కూల్ హై హమ్ 3 2016 జనవరి 22న విడుదలైంది.[12][13]
రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 9 హిందీలో ఆమె కంటెస్టెంట్‌గా ఉంది. ఆమె రన్నరప్‌గా నిలిచిన ఈ కార్యక్రమం అక్టోబరు 2015లో కలర్స్ టీవీలో ప్రసారమైంది.[14][15][16]
2018లో, ఆమె స్టార్ ప్లస్ ప్రసారం చేసిన ఇష్క్‌బాజ్‌లో నాన్సీగా చేరింది.[17]
అక్టోబర్ 2018లో, క్యా కూల్ హై హమ్ 3 డైరెక్టర్ ఉమేష్ ఘడ్గేపై ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.[18][19]
లాక్-అప్ అనే ఇండియన్ టీవీ రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొన్నది.[20]
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె పర్షియన్, ఇంగ్లీష్, హిందీ భాషలు అనర్గలంగా మాట్లాడగలదు.[21]
జూలై 2016లో, ఆమె తన ప్రియుడు, ముంబైకి చెందిన భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో నిశ్చితార్థం చేసుకుంది. తరువాతి సంవత్సరం మార్చి ప్రారంభంలో ఈ జంట కోర్టులో వివాహం చేసుకుంది. ఆ తర్వాత మార్చి 2017లో హిందూ ఆచారం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది.[22][23][24]
జూలై 2017లో, ఆమె తన భర్త, అతని కుటుంబ సభ్యులపై గృహ హింస కేసును దాఖలు చేసింది.[25] వారు 2021లో విడాకులు తీసుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ "Bigg Boss 9 Contestant No 10: Mandana Karimi, Iranian model who entered Bollywood with 'Roy'". India TV. 12 December 2015. Archived from the original on 28 March 2019. Retrieved 13 February 2019.
- ↑ "Mandana Karimi Bigg Boss 9 Contestant: The 'Roy' babe is too hot to handle". Archived from the original on 13 June 2020. Retrieved 13 June 2020.
- ↑ 3.0 3.1 3.2 "'Bigg Boss 9': Iranian model Mandana Karimi married to work in India?". Emirates 24/7. 19 October 2015. Archived from the original on 13 November 2015. Retrieved 7 November 2015.
Born to an Iranian mother and Indian father Mandana Karimi was brought up in Tehran in Iran.
- ↑ Coutinho, Natasha (9 July 2015). "Meet Ekta's 'discovery'". Deccan Chronicle. Archived from the original on 22 December 2015. Retrieved 7 November 2015.
- ↑ Coutinho, Natasha (9 July 2015). "Meet Ekta's 'discovery'". Deccan Chronicle. Archived from the original on 22 December 2015. Retrieved 7 November 2015.
I was born in Tehran in a conservative Muslim family...
- ↑ "Bhaag Johnny trailer: Is Kunal Khemu the Leonardo DiCaprio of the Hindi version of Inception?". Archived from the original on 13 June 2020. Retrieved 13 June 2020.
- ↑ Bhaag Johnny Actress Mandana Karimi Full EXCLUSIVE Interview. Bollywood Hungama. Archived from the original on 17 December 2019. Retrieved 9 November 2015 – via YouTube.
- ↑ "Digangana, Keith Sequeira, Mandana Karimi, Prince: Some interesting facts about Bigg Boss 9 contestants". ABP Live. 12 October 2015. Archived from the original on 11 September 2018. Retrieved 9 November 2015.
- ↑ Coutinho, Natasha (9 July 2015). "Meet Ekta's 'discovery'". Deccan Chronicle. Archived from the original on 22 December 2015. Retrieved 7 November 2015.
I was born in Tehran in a conservative Muslim family...
- ↑ Bhaag Johnny Actress Mandana Karimi Full EXCLUSIVE Interview. Bollywood Hungama. Archived from the original on 17 December 2019. Retrieved 9 November 2015 – via YouTube.
- ↑ 7 Facts We Bet You Didn't Know About Mandana Karimi Archived 20 ఫిబ్రవరి 2019 at the Wayback Machine. Mtvindia.com (15 October 2015). Retrieved 23 January 2017.
- ↑ Bhaag Johnny Actress Mandana Karimi Full EXCLUSIVE Interview. Bollywood Hungama. Archived from the original on 17 December 2019. Retrieved 9 November 2015 – via YouTube.
- ↑ "'Kyaa Kool Hain Hum 3' released in January 22,2016". The Indian Express [P] Ltd. Press Trust of India. 11 December 2015. Archived from the original on 14 January 2016. Retrieved 18 January 2016.
- ↑ "Mandana Karimi in Bigg Boss 9 Double Trouble". The Times of India. 13 October 2015. Archived from the original on 26 January 2016. Retrieved 24 August 2016.
- ↑ "Bigg Boss 9 Contestant No 10: Mandana Karimi, Iranian model who entered Bollywood with 'Roy'". Archived from the original on 16 October 2015. Retrieved 10 October 2015.
- ↑ "Bigg Boss 9: Mandana Karimi has 4 things to say about winner Prince Narula, Kishwar Merchant and her journey". Archived from the original on 28 March 2019. Retrieved 1 February 2016.
- ↑ "MANDANA KARIMI'S FICTION DEBUT ON TV WITH ISHQBAAAZ". Mumbai Mirror. 28 August 2018. Archived from the original on 28 August 2018. Retrieved 28 August 2018.
- ↑ "Mandana Karimi accuses Kyaa Kool Hain Hum 3 director of harassment". India Today (in ఇంగ్లీష్). Retrieved 20 September 2022.
- ↑ "#MeToo: Mandana Karimi opens up about ordeal with 'Kya Kool Hain Hum 3' director; disappointed with Ekta Kapoor's silence". The Economic Times. Retrieved 20 September 2022.
- ↑ "Lock Upp: Bigg Boss runner-up Mandana Karimi, Pakistani blogger Azma Fallah enter the show". Hindustan Times (in ఇంగ్లీష్). 22 March 2022. Retrieved 19 August 2022.
- ↑ Bhaag Johnny Actress Mandana Karimi Full EXCLUSIVE Interview. Bollywood Hungama. Archived from the original on 17 December 2019. Retrieved 9 November 2015 – via YouTube.
- ↑ "Ex-Bigg Boss contestant Mandana Karimi marries boyfriend in hush-hush ceremony. See pics". The Indian Express (in ఇంగ్లీష్). 6 March 2017. Archived from the original on 11 September 2018. Retrieved 30 September 2020.
- ↑ Ex-Bigg Boss contestant Mandana Karimi gets engaged to boyfriend Gaurav - Times of India Archived 12 ఆగస్టు 2016 at the Wayback Machine.
- ↑ "Bigg Boss fame Mandana Karimi:India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 12 June 2021.
- ↑ "Mandana Karimi Files Domestic Violence Case Against Husband Of 6 Months: Reports". NDTV.com. Archived from the original on 26 October 2019. Retrieved 30 September 2020.