జ్యోతుల చంటిబాబు
జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండరావు (చంటిబాబు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జగ్గంపేట నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జ్యోతుల చంటిబాబు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 23 మే 2019 - ప్రస్తుతం | |||
ముందు | జ్యోతుల నెహ్రూ | ||
---|---|---|---|
నియోజకవర్గం | జగ్గంపేట నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 08 అక్టోబర్ 1978 ఇర్రిపాక గ్రామం, జగ్గంపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | అన్నపూర్ణ, రామస్వామి | ||
జీవిత భాగస్వామి | నాగ సూర్యవేణి | ||
సంతానం | కుమార్తె, కుమారుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుజ్యోతుల చంటిబాబు 08 అక్టోబర్ 1978 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా , జగ్గంపేట మండలం, ఇర్రిపాక గ్రామం లో అన్నపూర్ణ, రామస్వామి దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి 1998లో ఎంఏ (పాలిటిక్స్) పూర్తి చేశాడు.[1]
రాజకీయ జీవితం
మార్చుజ్యోతుల చంటిబాబు 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో 17907 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2014లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో 15932 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. జ్యోతుల చంటిబాబు అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌గా పని చేశాడు.
జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీకి 19 మార్చి 2018న రాజీనామా చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.[2] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పై 23365 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్". Archived from the original on 2021-12-08. Retrieved 9 December 2021.
- ↑ Sakshi (19 March 2018). "వైఎస్‌ఆర్ సీపీలోకి జ్యోతుల చంటిబాబు". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.
- ↑ Sakshi (2019). "Jaggampeta Constituency Winner List in AP Elections 2019 | Jaggampeta Constituency MLA Election Results 2019". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.