టి.ఎన్.విశ్వనాథరెడ్డి
టి.ఎన్.విశ్వనాథరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుండి 1వ లోకసభకు, రాజంపేట లోకసభ నియోజకవర్గం నుండి 2వ లోకసభ ఎన్నికయ్యారు.[1]
టి.ఎన్.విశ్వనాథరెడ్డి | |||
పదవీ కాలము 1952-57; 1957-62 | |||
నియోజకవర్గము | చిత్తూరు; రాజంపేట | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మదనపల్లి, చిత్తూరు జిల్లా | 1 జులై 1919||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | పుష్పవేణమ్మ | ||
సంతానము | 3; 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
మతం | హిందూమతం | ||
వెబ్‌సైటు | [1] |
ఇతడు 1 జూలై 1919 తేదీన మదనపల్లిలో జన్మించాడు. వీరు మద్రాసులోని లయోలా కళాశాల లోను, మద్రాసు క్రిస్టియన్ కళాశాల లోను చదువుకున్నారు. 1944 సంవత్సరంలో పుష్పవేణమ్మను వివాహం చేసుకున్నారు. వీరికు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
ఇతడు చైనా, థాయిలాండ్, బర్మా దేశాలను సందర్శించారు.
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-22. Retrieved 2014-02-13.