మదనపల్లె
మదనపల్లె - (ఉర్దూ - مدنپلی ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్తణం, రెవిన్యూ డివిజన్.
మదనపల్లె - مدنپلی | |
— మండలం — | |
చిత్తూరు పటములో మదనపల్లె - مدنپلی మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మదనపల్లె - مدنپلی స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండల కేంద్రం | మదనపల్లె |
గ్రామాలు | 19 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,90,512 |
- పురుషులు | 96,968 |
- స్త్రీలు | 93,544 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 69.11% |
- పురుషులు | 78.97% |
- స్త్రీలు | 58.95% |
పిన్కోడ్ | {{{pincode}}} |
చరిత్రసవరించు
మదనపల్లె చరిత్ర క్రీ.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి (సిపాయి గలీ), కోట గడ్డ (ఖిలా), అగడ్త వీధి (కందక్ గలీ),, పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.
మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న, మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లెగా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు అరేబియాలోని మదీనా నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లెగా స్థిరపడిందని చెబుతారు.
907 – 955, మధ్యన యాదవనాయకులు, హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో గోల్కొండ నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713,లో కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది. ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు. సర్ థామస్ మన్రో కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. ఎఫ్.బి.మనోలె మొదటి సబ్-కలెక్టరు.
జనగణనసవరించు
మదనపల్లె (పట్టణ) | మొత్తం | పురుషులు | స్త్రీలు |
---|---|---|---|
జనాభా | 184,267 | 92,692 | 91,575 |
అక్షరాస్యులు | 128,467 | 69,340 | 59,127 |
పిల్లలు (0-6) | 18,062 | 9,312 | 8,750 |
సరాసరి అక్షరాస్యత (%) | 79.69 | 86.27 | 73.15 |
లింగ నిష్పత్తి | 999 | ||
పిల్లల లింగనిష్పత్తి | 940 |
దేశంలోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్ లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోనే పెద్దదైన రెవిన్యూ డివిజన్. ఇందులో 31 మండలాలు ఉన్నాయి.
మదనపల్లె గురించిసవరించు
మదనపల్లె అను మండలం ఆంధ్రప్రదేశ్ అను రాష్ర్టంలోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఇవన్నీ మదనపల్లె గురించి:
భౌగోళికం , వాతావరణంసవరించు
మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ఆంధ్ర ఊటీ అనే పేరు ఉంది. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. పెన్షనర్ల స్వర్గంగా కూడా ప్రసిధ్ధి.
మదనపల్లె భౌగోళికంగా ఈ అక్ష్యాంస రేఖాంశాల మధ్యన వున్నది - 13°33′N 78°30′E / 13.55°N 78.50°E.[1]
మదనపల్లె-వాతావరణం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 27.3 | 30.2 | 33.4 | 34.9 | 35 | 32.1 | 30.2 | 30.1 | 29.9 | 28.6 | 26.8 | 25.7 | — |
సగటు అల్ప °C (°F) | 15.5 | 16.8 | 19.4 | 22.2 | 23.6 | 22.8 | 21.8 | 21.8 | 21.2 | 20.2 | 17.8 | 15.6 | — |
అవక్షేపం mm (inches) | 4 | 2 | 3 | 28 | 61 | 51 | 81 | 73 | 111 | 143 | 54 | 32 | — |
[citation needed] |
ఆధారం : "http://en.climate-data.org/location/24110/”[permanent dead link]
భౌగోళిక తలము డెసిమల్ డిగ్రీలలో (WGS84)
అక్షాంశం : 13.550
రేఖాంశం : 78.500
భౌగోళిక తలము డిగ్రీ మైనస్ సెకండ్లలో (WGS84)
అక్షాంశం : 13 33' 00
రేఖాంశం : 78 30' 00
Madanapalle has pleasantly mild, to warm summers with average high temperatures of 30 to 35 degrees Celsius (86 F to 95 F). Temperatures do not exceed 40 degrees celsius (104 F)and winters are cold with temperatures between 7 to 15 degrees Celsius ( 44.6 F to 59 F). Usually summer lasts from March to June, with the advent of rainy season in June, followed by winter which lasts till the end of February.
ముఖ్యమైన ప్రదేశాలుసవరించు
- హార్సిలీ హిల్స్- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన(ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వేసవి విడిది కేంద్రము.
- బోయ కొండ- ప్రసిధ్ధి చెందిన గంగమ్మ క్షేత్రము.(ఇది చౌడేపల్లె మండలంలో ఉంది)
- బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది.
- సోంపాళెం
- రిషి వ్యాలీ - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది, భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతుంది.
- ఆరోగ్యవరం(శానిటోరియం)-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
- బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.అనీ బెసెంట్ పేరున స్థాపించబడింది.
- "ధ్యాన మందిరము" - ఆధ్యాత్మిక వాది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహేశ్ యోగిచే ప్రారంభించబడింది.
- ఠాగూర్ కాటేజీ
- నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
ప్రముఖులుసవరించు
- శంకరంబాడి సుందరాచారి
- జిడ్డు కృష్ణమూర్తి : అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త
- లీలా నాయుడు
- అబ్దుల్ అజీమ్ ఉర్దూ కవి చిత్తూరు జిల్లా ఉర్దూ భాషా రంగంలో పరిచయమయిన పేరు. 42 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉర్దూ ఉపాధ్యాయునిగా తనసేవలందించాడు. చిత్తూరు జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధికి, మదనపల్లెలో అంజుమన్ తరఖి ఉర్దూ సంస్థకు తోడ్పడ్డాడు. మదనపల్లెలో ముషాయిరా ల సంస్కృతిని ఇతడే ప్రారంభించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డు అయినాడు.
- ఎగ్గోని శ్యాంసుందర్ : రచయిత
- ఎద్దుల శంకరనారాయణ : కవి
- ఖమర్ అమీని ఉర్దూ కవి
- కలువకుంట్ల గురునాథ పిళ్ళై : మదనపల్లె ప్రాంతీయులకు సుపరిచితమైన పేరు. ముఖ్యంగా ఉపాధ్యాయ, రచయితలవర్గంలో. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్డు అయినాడు. ఇతని రచనలు వార్తా పత్రికలలో, వార మాస పత్రికలలో రావడం సాధారణం.
- కవిమలం నారాయణ మూర్తి - రచయిత
- టీ.యస్.ఏ. కృష్ణమూర్తి - రచయిత
- డా.కె.కృష్ణమూర్తి - వైద్యులు.ఏభై సంవత్సరాలకు పైగా లాభాపేక్ష లేకుండా వైద్యసేవలను అందించి, "భిషగ్వరరత్న" అనే బిరుదును కైవసం చేసుకున్నారు.
- ఊటుకూరు ఆంజనేయ శర్మ - రచయిత,కవి, పండితులు.
- ఆర్.యెస్.సుదర్శనం - సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు
- గాండీవి కృష్ణమూర్తి - రచయిత
- గాడేపల్లి శివరామయ్య - కవి
- చౌడప్ప - రచయిత
- డా. కె.ఎం.డీ.హెన్రీ - రసవిహారి బిరుదాంకితులు, రచయిత
- డా. జూళిపాళెం మంగమ్మ/ జోలెపాళ్యం మంగమ్మ - రచయిత్రి,రేడియోలో తెలుగు వార్తలు చదివిన తొలి మహిళ.
- డా. మల్లెల గురవయ్య - కవి
- పురాణం త్యాగమూర్తి శర్మ - రచయిత, ఎడిటర్, సీనియర్ పాత్రికేయులు
- ఓ.వి.ఎన్. గుప్త - సీనియర్ పాత్రికేయులు
- పుష్పాంజలి - రచయిత్రి
- మేడవరం వెంకటనారాయణ శర్మ - రచయిత
- రాజారావు - రచయిత
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య - విమర్శకులు
- వాసా కృష్ణమూర్తి - కవి
- ఆర్. వసుందరాదేవి - రచయిత్రి
- పన్నూరు శ్రీపతి - తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
- రమాప్రభ - నటి మదనపల్లెలో జన్మించారు.[2]
- యల్లపల్లె విద్యాసాగర్ - సీనీయర్ పాత్రికేయులు
- నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్ : "అఖండ్ భారతీయఅవాజ్" జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి
- సి.సుదర్శనరెడ్డి కర్నూలు జిల్లా కలక్టర్
రాజకీయాలుసవరించు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభ 2 దశకాలలో, మదనపల్లెలో కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం వుండేది. ప్రస్తుతం. పట్టణ ప్రాంతములో కాంగ్రెస్ పార్టీ పట్టు, గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ పట్టు కలిగివున్నాయి. కానీ మారిన రాజకీయాల దృష్ట్యా 2014 లో పలు మార్పులు సంభవించాయి.
- పార్లమెంటు నియోజకవర్గం : రాజంపేట, ప్రస్తుత ఎం.పి. : పి.మిథున్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)
- అసెంబ్లీ నియోజకవర్గం : (283) 'మదనపల్లె', ప్రస్తుత ఎం.ఎల్.ఎ. : తిప్పారెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)
- మునిసిపాలిటి : మదనపల్లె. ప్రస్తుత ఛైర్ పర్సన్: కొడవలి శివప్రసాద్ (టి.డి.పా.)
మదనపల్లె నాటక కళాపరిషత్సవరించు
35 ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారథి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. నెల్లూరుకు చెందిన నెప్జా నాటక కళాపరిషత్, ప్రొద్దుటూరుకు చెందిన రాయల నాటక కళాపరిషత్ అనంతపురముకు చెందిన పరిత కళాపరిషత్, చిత్తూరుకు చెందిన ఆర్ట్స్ లవర్ అసోసియేషన్ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, భక్త రామదాసు, వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు గూడూరు సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ)సవరించు
22 సంవత్సరాల క్రిందట అంజుమన్ తరఖి ఉర్దూ శాఖ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులాందస్తగీర్, సయ్యద్ అబ్దుల్ అజీం, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖాదర్ హుసేన్ లు కీలక పాత్ర పోషించారు. ఖమర్ అమీనీ, జవాహర్ హుసేన్, అడ్వకేట్ నజీర్ అహ్మద్, షరాఫత్ అలీ ఖాన్, అడ్వకేట్ సికందర్ అలీ ఖాన్, హాజీ ముహమ్మద్ ఖాన్, ఖాజీ ముహమ్మద్ షాకిరుల్లా, మహమ్మద్ అక్రాలు తమవంతూ కృషి చేశారు. ఉర్దూ భాషాభి వృధ్ధికి, సాహిత్యపోషణకు ఎన్నో పోటీలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ముషాయిరాలు (కవిసమ్మేళనాలు), సెమినార్లు నిర్వహించారు. మదనపల్లెలో ముషాయిరాల సాంప్రదాయం సయ్యద్ అబ్దుల్ అజీం, గులాం దస్తగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమయినాయి. నిసార్ అహ్మద్ సయ్యద్, ఖమీర్ అమీనీ ల ఆధ్వర్యంలో జీవంపోసుకున్నాయి.
మతపరమైన విషయాలుసవరించు
మదనపల్లె పట్టణం సార్వజనీయ పట్టణం. విద్యాధికులు గల పట్టణం. హిందువులూ, ముస్లింలూ, క్రైస్తవులు కలసి సుఖశాంతులతో జీవించే పట్టణం. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ కే ఆదర్శం. ఇచట శ్రీ వేంకటేశ్వర దేవాలయం, జామా మస్జిద్, ఛాంబర్లియన్ చర్చి ప్రసిద్ధమైనవి.
పత్రికలుసవరించు
- "ఈ సంఘం" తెలుగు పక్షపత్రిక 2007 సం. నండి ప్రచురించబడుతోంది. దీని వ్యవస్థాపకులు శ్రీ ఓ.వి.ఎన్. గుప్త గారు. సంపాదకులు పి. త్యాగమూర్తి శర్మ గారు.
- "పెద్దమనుషులు" తెలుగు పక్షపత్రిక ప్రచురింపబడేది. దీని స్థాపకులు కీ.శే. ఈర్.యెస్. సుదర్శనం.
పట్టణంలో విద్యాలయాలుసవరించు
మదనపల్లెలో విద్య రాను రాను వికసిస్తోంది, చదువరులు విద్యార్థులు పెరుగుతున్నారు.
- 1936వ సంవత్సరంలో స్థాపింపబడిన బోర్డు ఉన్నత పాఠశాల, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లాలోనే అతి పెద్ద ఉన్నత పాఠశాల. గిరిరావు థియోసాఫికల్ ఉన్నత పాఠశాల, హోప్ ఉన్నత పాఠశాల, హోప్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాల, సి.ఎస్.ఐ.బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, రామారావు పాఠశాల ముఖ్యమైనవి. ఇవియేగాక ఓ పాతిక ప్రైవేటు ఉన్నత పాఠశాలలు గలవు.
- బి.టి.కాలేజ్, ప్రభుత్వ బాలికల కాలేజ్ లు ముఖ్యమైనవి. ఇవి గాక నాలుగు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, పది హెను జూనియర్ కాలేజీలు గలవు.
- సాంకేతిక విద్యా సంస్థలూ, బి.ఎడ్., ఇంజనీరింగ్, నర్శింగ్, పాలిటెక్నిక్ సంస్థలూ గలవు.
- నవోదయ పాఠశాల గలదు.
ఆరోగ్య సదుపాయాలుసవరించు
మదనపల్లెలో హాస్పిటల్స్ ఎక్కువ. ఆరోగ్యవరం, ఎమ్.ఎల్.ఎల్. లేదా మేరీ లాట్ లైలెస్ హాస్పిటల్ (ఇది పాతతరంలో గోషా ఆసుపత్రి లేదా గోషా హస్పతాల్ గా ప్రసిద్ధి), ప్రభుత్వ ఆసుపత్రి పేరు గలవి. గడచిన కాలంలో వైద్య సేవలకు ఘనమైన పేరుగల మదనపల్లె, నేడు అడుగడుగునా నర్సింగ్ హోంలు వెలసిననూ, ఆ పేరును కాలక్రమేణా కోల్పోతున్నది. వ్యాపారరంగంగా మారుతున్న వైద్యరంగాన్ని, సేవారంగంగా తిరిగీ తన స్థానాన్ని కలుగ జేయవలెను. అనేక విభాగాలలో స్పెషలిస్టులు లేని కారణంగా రోగులను తిరుపతి గాని బెంగళూరు గాని వైద్యసేవలకొరకు తరలడం సాధారణంగా కానవస్తుంది.
పరిశ్రమలుసవరించు
- మదనపల్లె స్పిన్నింగ్ మిల్ (సి.టి.యం.)
- పట్టు పరిశ్రమలు (నీరుగట్టువారిపల్లి)
- గార్మెంట్ పరిశ్రమ
- ఫుడ్ ఇండస్ట్రీస్
- గ్రానైటు పరిశ్రమ
- చిన్న చిన్న కుటీర పరిశ్రమలు
పంటలుసవరించు
ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, మామిడి,, కూరగాయలు పండిస్తారు. నీరుగట్టువారిపల్లెలో వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు ఉంది.
వ్యాపారంసవరించు
మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, టమోటా, మామిడి, సీతాఫలం, చింతకాయ కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ మదనపల్లె సమీపంలోని అంగళ్లులో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.
రవాణా సౌకర్యాలుసవరించు
- మదనపల్లెలో ఆం.ప్ర.రా.రో.ర.సం. వారి రెండు బస్సు డిపోలు గలవు.
- ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో 'మదనపల్లె రైల్వే స్టేషను ' ఉంది.
- ట్రాన్స్ పోర్టు కొరకు లారీలెక్కువ. ఈ లారీలు ప్రధానంగా టమోటా, మామిడి, సీతాఫలం, వరి, బియ్యం, వేరుశెనగ రవాణా కొరకు ఉపయోగకరంగా ఉన్నాయి.
భౌగోళికంసవరించు
ప్రజల సాధక బాధకాలుసవరించు
ఎక్కువ ప్రజలు మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. రోజువారి చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీలు ఎక్కువ. వడ్డీ వ్యాపారులు, వడ్డీ దళారులు ఎక్కువ. వీటి వలన సాధారణ ప్రజానీకం ఆర్థికంగా కోలుకోలేక పోతోంది. చిరుద్యోగులు, ఉద్యోగస్తులు వడ్డీ వ్యాపారాలు చేసే వ్యవస్థ మదనపల్లెలో కాన వస్తుంది. "ఫైనాన్స్" అనే ఘనమైన పేరుతో ఈ అమానవీయ వ్యాపారం అన్ని వర్గాల్లో సాగుతున్నది. ఈ వడ్డీ వ్యాపారస్తులపై ప్రభుత్వ నిఘా అసలేలేదు. నిఘా పెట్టవలసిన అధికారులే ఈ ఫైనాన్స్ రంగంలో మునిగివున్నారనే అపవాదు ఉంది.
మత్తు పానీయ షాపులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. చిన్నా చితకా వ్యసనపరులూ సర్వ సాధారణంగానే కానవస్తారు.
సినిమాలుసవరించు
మదనపల్లెలో సినిమా హాళ్ళు అధికంగా వుండేవి.ఆంధ్ర రాష్ట్రంలోనే శుభ్రత కలినిగినవిగా పేరొందినవి. నేడు వాటి పరిస్థితి అంతంత మాత్రమే. ఎన్నో సినిమా హాళ్ళు మూతపడ్డాయి.
మండల గణాంకాలుసవరించు
- మండల కేంద్రము మదనపల్లె ..... గ్రామాలు 19
- జనాభా (2001) - మొత్తం 1,90,512 - పురుషులు 96,968 - స్త్రీలు 93,544
- అక్షరాస్యత (2001) - మొత్తం 69.11% - పురుషులు 78.97% - స్త్రీలు 58.95%
కొన్ని విశేషాలుసవరించు
- మదనపల్లెలోని టీబీ ఆసుపత్రిలో 'చందమామ' రూపకర్తలలో ఒకరైన చక్రపాణి కొంతకాలం చికిత్స చేయించుకున్నారు.
- "ఆ నలుగురు" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో చదువుకున్నాడు.
- ఎన్నికల ప్రచారం కోసం ఇందిరా గాంధీ మదనపల్లె వచ్చిప్పుడే కాంగ్రెస్(ఐ)కు ఎన్నికల కమిషన్ హస్తం గుర్తు కేటాయించింది.
- 1919వ సంవత్సరంలో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెకు వచ్చారు.
- విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి బి.టి. కళాశాల, మదనపల్లెలో అనువదించారు.
- భారత జాతీయగీతం ... ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.
- ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విద్యాభ్యాసం చేశారు.
- మదనపల్లె, ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి.
- బాహుదా నది పట్టణము మధ్యలో ప్రవహించును. సాధారణంగా మామూలు కాలువలా ఉండే బాహుదా 1996 సంలో వరదల కారణంగా ప్రవాహము హెచ్చి ప్రాణ నష్టం జరిగిం
- నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
మూలాలుసవరించు
- ↑ [1]
- ↑ తెలుగుసినిమా.కాం వెబ్సైటులో శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ Archived 2012-01-11 at the Wayback Machine, సేకరించిన తేదీ: జులై 20, 2007