టి.బి.విఠల్ రావు, తెలంగాణకు చెందిన తొలితరం కార్మిక నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. పి.డి.ఎఫ్. పార్టీ తరపున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు (1952-1962) పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.

టి.బి.విఠల్ రావు
టి.బి.విఠల్ రావు


పదవీ కాలం
1952 – 1962
ముందు none
తరువాత తేళ్ల లక్ష్మీకాంతమ్మ
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగ'స్టు 16, 1915
సికింద్రాబాదు, తెలంగాణ
తల్లిదండ్రులు టి.డి. బాలకృష్ణన్
జీవిత భాగస్వామి సుగంధనీ దేవి
సంతానం 3 కుమారులు, 2 కుమార్తెలు
మతం హిందూ మతం

జననం, విద్య

మార్చు

విఠల్ రావు 1915, ఆగస్టు 16న తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదులోని ఒక కన్నడిగ కుటుంబంలో జన్మించాడు. విఠల్ రావు తండ్రిపేరు టి.డి. బాలకృష్ణన్. విఠల్ రావు విద్యాభ్యాసం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల, బెనారస్లోని కేంద్ర హిందూ కళాశాలల్లో సాగింది.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

విఠల్ రావుకు 1943, జూన్ 13న సుగంధనీ దేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

కార్మిక ఉద్యమం

మార్చు

నిజాం నవాబుతో పాటు స్థానిక భూస్వాముల పెత్తనం కింద ఉన్న సింగరేణి సంస్థలో 1939 నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో సింగరేణిలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు సింగరేణి కార్మిక హక్కుల కోసం ఉద్యమించిన నేత విఠల్‌రావు. సింగరేణి తొలినాళ్లలో వెట్టిచాకిరీ వంటి నిర్భంధాలకు వ్యతిరేకంగా పోరాడాడు. పనిగంటల తగ్గింపు, పనికి తగిన వేతనం, కార్మికులకు వసతులు వంటి వాటికోసం ఆయన ఉద్యమించాడు. రహస్య జీవితాన్ని గడుపుతూనే ఆయన కార్మిక హక్కుల కోసం ఉద్యమించాడు. నిజామ్‌ రైల్వే యూనియన్‌ నాయకుడిగా ఉన్న విఠల్‌ రావు, 1951లో ఏ.ఎన్.టీ.యూ.సి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1953లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రతినిధిగా పెకింగ్‌లో జరిగిన ఆల్ చైనా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ యొక్క ఏడవ కాంగ్రెస్‌కు హాజరయ్యాడు. 1954లో జరిగిన సింగరేణి కాలరీస్ కార్మిక సంఘం మహాసభల్లో విఠల్‌ రావు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1954లో మాస్కోలో జరిగిన ఆల్ యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ సోవియట్ ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధిగా హాజరయ్యాడు. 1956లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రతినిధిగా బొగ్గు గనులపై పారిశ్రామిక కమిటీకి హాజరయ్యాడు. 1947 ఆగస్టు 17 నుండి 1948 సెప్టెంబరు 23 వరకు, 1949 డిసెంబరు 31 నుండి 1951 ఏప్రిల్ 11 వరకు నిర్బంధించబడ్డాడు.[2]

రాజకీయరంగం

మార్చు

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభకు (1952-1957), [3] 2వ లోక్‌సభకు (1957-1962) [4] ఎన్నికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "Second Lok Sabha - Members Bioprofile". Retrieved 2021-11-30.
  2. "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.
  3. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-10. Retrieved 2021-11-30.
  4. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-09. Retrieved 2021-11-30.