తేళ్ల లక్ష్మీకాంతమ్మ

తేళ్ల లక్ష్మీకాంతమ్మ (జూలై 16, 1924 - డిసెంబర్ 13, 2007) ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు.తెలుగు పాప్ సింగర్ స్మిత ఈమె మనవరాలే.[1] లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న జన్మించింది. ఈమె స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు.

తేళ్ల లక్ష్మీకాంతమ్మ

పదవీ కాలము
1962 - 1977
ముందు టి. బి. విఠల్ రావు
తరువాత జలగం కొండలరావు
నియోజకవర్గము ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం (1924-07-16) 1924 జూలై 16 (వయస్సు: 96  సంవత్సరాలు)
ఆలంపూర్, తెలంగాణ, భారత దేశము
మరణం డిసెంబర్ 13, 2007
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి టి. వి. సుబ్బారావు
సంతానము 1 కూతురు
మతం హిందూమతం

లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1967లో పార్లమెంటు బృందంలో సదస్యురాలిగా ఆస్ట్రేలియాను పర్యటించింది. 1978లో జనతా పార్టీ తరఫున హైదరాబాదు నగరంలోని హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి గెలుపొందింది.[2]

పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా[3] ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి,[4] పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది.[5] ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.

లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితురాలు.[1] నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ది ఇన్‌సైడర్‌లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.[6] ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.

లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో విజయవాడలోని తన కూతురు ఇంట్లో డిసెంబర్ 13, 2007న మరణించింది.[7]

మూలాలుసవరించు