టి.సంతోష్ కుమార్
టి.సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకుడు. అతను 2013 నుండి 2019 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు.
టి.సంతోష్ కుమార్ | |||
పదవీ కాలం 2013 - 2019 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1955 కరీంనగర్,తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | హైదరాబాద్ కరీంనగర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుటి.సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసాడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసాడు. టి.సంతోష్ కుమార్ 2013లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. టి.సంతోష్ కుమార్ 2018 డిసెంబరు 21న కాంగ్రెస్ పార్టీని వీడి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (21 December 2018). "హస్తానికి గులాబీ దెబ్బ". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
- ↑ The Hindu (20 December 2018). "Congress MLCs meets KCR". The Hindu (in Indian English). Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
- ↑ Sakshi (22 December 2018). "కౌన్సిల్ గులాబీమయం.. కాంగ్రెస్ ఖాళీ!". Sakshi. Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.