టి. పద్మారావు గౌడ్

తిగుళ్ళ పద్మారావు గౌడ్[1] (జ.ఏప్రిల్ 7, 1954) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2][3] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు.[4][5] 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6] 2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం కు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు గౌడ్, 2014 నుండి 2018 వరకుతెలంగాణ రాష్ట్ర తొలి ఎక్సైజ్, క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[7][8][9][10]

టి. పద్మారావు గౌడ్
టి. పద్మారావు గౌడ్


తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్
పదవీ కాలం
ఫిబ్రవరి 24, 2019 – ప్రస్తుతం
నియోజకవర్గం సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 7, 1954
సికింద్రాబాద్
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
సంతానం కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, ఐశ్వర్య గౌడ్, మౌనిక గౌడ్
నివాసం సికింద్రాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం, విద్య సవరించు

పద్మారావు గౌడ్ 1954, ఏప్రిల్ 7న ఈశ్వరయ్య - రాములమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్ లో జన్మించాడు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.

వివాహం - పిల్లలు సవరించు

పద్మారావు గౌడ్ కి స్వరూప రాణితో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు (కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్), ఇద్దరు కుమార్తెలు (ఐశ్వర్య గౌడ్, మౌనిక గౌడ్) ఉన్నారు.

రాజకీయ జీవితం సవరించు

పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కార్పొరేటర్‌గా గెలిచాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి లో 2001లో చేరి 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.[11] 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. పద్మారావు గౌడ్ 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో, 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్‌ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[12] 2014 జూన్ 2 న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పద్మారావు గెలుపొందాడు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[13][14]

హోదాలు సవరించు

  1. 1986 - 1991: కార్పోరేటర్, మునిసిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్,
  2. 2002 - 2004: కార్పోరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్,
  3. 02.06.2014 - 16.12.2014: మంత్రి ఎక్సైజ్ & ప్రొహిబిషన్, తెలంగాణ ప్రభుత్వం.
  4. 16.12.2014 - 11.12.2018: మంత్రి ఎక్సైజ్ & ప్రొహిబిషన్, క్రీడలు & యువజన సేవలు, తెలంగాణ ప్రభుత్వం.
  5. 25.02.2019 - ప్రస్తుతం: డిప్యూటీ స్పీకర్, తెలంగాణ శాసనసభ

ఇతర వివరాలు సవరించు

ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, హాంకాంగ్, మకావు, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు సవరించు

  1. first Excise and Prohibition, Sports & Youth Affairs Minister in Telangana State.
  2. "Election Commission Of India". eciresults.nic.in. ECI. Archived from the original on 2014-07-15. Retrieved 2017-01-14.
  3. "Secunderabad Assembly Election 2014". Archived from the original on 2017-09-14. Retrieved 2017-01-14.
  4. "Election Commission Of India". eciresults.nic.in. ECI. Archived from the original on 2014-07-15. Retrieved 2017-01-14.
  5. "Secunderabad Assembly Election 2014". Archived from the original on 2017-09-14. Retrieved 2017-01-14.
  6. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Archived from the original on 2 June 2014. Retrieved 2 June 2014.
  7. "Council of Ministers". telangana.gov.in. Retrieved 14 July 2014.
  8. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Archived from the original on 2 June 2014. Retrieved 2 June 2014.
  9. "Council of Ministers". telangana.gov.in. Archived from the original on 14 July 2014. Retrieved 14 July 2014.
  10. "Padma Rao to be new deputy speaker of Telangana - Times of India". The Times of India. Retrieved 2019-02-25.
  11. "Suryapet Assembly Election 2014". Archived from the original on 2017-08-02. Retrieved 2017-01-14.
  12. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  13. 10tv (25 February 2019). "తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీవిత విశేషాలు". www.10tv.in. Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.
  14. The New Indian Express (25 February 2019). "T Padma Rao elected Deputy Speaker of Telangana Assembly". The New Indian Express. Archived from the original on 18 May 2021. Retrieved 18 May 2021.