1750 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1747 1748 1749 - 1750 - 1751 1752 1753
దశాబ్దాలు: 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • జనవరి 24: ఇస్తాంబుల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. [1]
  • ఫిబ్రవరి 15: దక్షిణ అమెరికాలో స్పెయిన్, పోర్చుగల్ భూభాగాల మధ్య సరిహద్దు రేఖ ఉరుగ్వే నది అని రెండు దేశాలూ అంగీకరించిన తరువాత, స్పానిష్ గవర్నరు, జెస్యూట్లను నది వెంట ఉన్న ఏడు ఇండియన్ వలసలను ఖాళీ చేయమని ఆదేశించాడు (శాన్ ఏంజెల్, శాన్ నికోలస్, శాన్ లూయిస్, శాన్ లోరెంజో, శాన్ మిగ్యూల్, శాన్ జువాన్, శాన్ బోర్జా). [2]
  • జూన్ 24: అదనపు ఇనుప పని వ్యాపారాలను పూర్తి చేయకుండా నిషేధించడం ద్వారా అమెరికాలో తయారైన వస్తువులపై పరిమితి విధించే ఉద్దేశంతో రూపొందించిన ఐరన్ చట్టాన్ని బ్రిటిషు పార్లమెంటు ఆమోదించింది. అదే సమయంలో, బ్రిటిష్ తయారీదారులకు అవసరమైన ముడి ఇనుమును అమెరికా నుండి దిగుమతి చేసుకోవడంపై పన్ను ఎత్తివేసారు. [3] 1775 నాటికి, ఉత్తర అమెరికా కాలనీలు ఇనుము ఉత్పత్తిలో ఇంగ్లాండ్, వేల్స్లను అధిగమించి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇనుము ఉత్పత్తిదారుగా నిలిచాయి.
  • జూలై 9: యాత్రికుడు జోనాస్ హాన్వే సెయింట్ పీటర్స్బర్గ్ నుండి జర్మనీ, నెదర్లాండ్స్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. అదే సంవత్సరం హాన్వే, ఫ్రెంచ్ ఫ్యాషనైన గొడుగును ఉపయోగించిన మొదటి ఆంగ్లేయుడయ్యాడు.
  • నవంబర్ 11టిబెట్ రీజెంట్ హత్య తర్వాత లాసాలో అల్లర్లు చెలరేగాయి.
  • నవంబర్ 18వెస్ట్ మినిస్టర్ వంతెన లండన్లో అధికారికంగా ప్రారంభించబడింది. [4]
  • డిసెంబర్ 29: జమైకాలోని ఇద్దరు వైద్యులు, డాక్టర్ జాన్ విలియమ్స్, డాక్టర్ పార్కర్ బెన్నెట్ లు పిత్తాశయ జ్వరానికి చేసే చికిత్స గురించి ముందు రోజు జరిగిన వాదనకు కొనసాగింపుగా "కత్తులు తుపాకులతో" ద్వంద్వయుద్ధం చేసారు. పోరాటంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు [5]
  • ప్రపంచ జనాభా : 79,10,00,000

జననాలు

మార్చు
 
టిప్పు సుల్తాన్

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Fires", in The New International Encyclopedia (Volume 8) (Dodd, Mead and Company, 1915 p604
  2. R. B. Cunninghame Graham, A Vanished Arcadia, being Some Account of the Jesuits in Paraguay (Haskell House Publishers, 1901, 1968) pp237-238
  3. Kevin Hillstrom and Laurie Collier Hillstrom, The Industrial Revolution in America (ABC-CLIO, 2005) pp4-5
  4. Weinreb, Ben; Hibbert, Christopher (1995). The London Encyclopaedia. Macmillan. p. 976. ISBN 0-333-57688-8.
  5. Fielding H. Garrison, An Introduction to the History of Medicine: With Medical Chronology, Suggestions for Study and Bibliographic Data (W.B. Saunders Company, 1913) p394
"https://te.wikipedia.org/w/index.php?title=1750&oldid=3858228" నుండి వెలికితీశారు