ట్రిస్టాన్ స్టబ్స్

ట్రిస్టన్ స్టబ్స్ (జననం 2000 ఆగస్టు 14) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను 2022 జూన్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ రంగప్రవేశం చేసాడు[1]

ట్రిస్టాన్ స్టబ్స్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2000-08-14) 2000 ఆగస్టు 14 (వయసు 24)
కేప్ టౌన్, దక్షిణాఫ్రికా
మారుపేరుBig ET
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్మెన్, వికెట్కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 148)2023 మార్చి 18 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 95)2022 జూన్ 9 - ఇండియా తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–presentఈస్టర్న్ ప్రావిన్స్
2022ముంబై ఇండియన్స్
2022–presentManchester Originals
2022Jaffna Kings
2023-presentSunrisers Eastern Cape
కెరీర్ గణాంకాలు
పోటీ T20I ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 11 8 11 39
చేసిన పరుగులు 149 465 275 814
బ్యాటింగు సగటు 24.83 46.50 27.50 28.06
100లు/50లు 0/1 2/1 0/1 0/4
అత్యుత్తమ స్కోరు 72 132 82 80*
వేసిన బంతులు 6 120 12 147
వికెట్లు 0 1 0 5
బౌలింగు సగటు 68.00 44.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/13 2/6
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 12/– 9/– 18/–
మూలం: Cricinfo, 3 నవంబర్ 2022

దేశీయ, ఫ్రాంచైజీ కెరీర్

మార్చు

స్టబ్స్ 2019–20 CSA 3-రోజుల ప్రొవిన్షియల్ కప్‌లో తూర్పు ప్రావిన్స్ తరపున 2020 జనవరి 16న ఫస్ట్-క్లాస్ ఆత మొదలుపెట్టాడు.[2] అతను 2019–20 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో తూర్పు ప్రావిన్స్ కోసం 2020 ఫిబ్రవరి 16న తన లిస్ట్ A రంగప్రవేశం చేశాడు. [3] 2020–21 CSA T20 ఛాలెంజ్‌లో వారియర్స్ కోసం 2021 ఫిబ్రవరి 21న తన తొలి ట్వంటీ20 ఆడాడు. [4] 2021 ఏప్రిల్లో అతను, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు తూర్పు ప్రావిన్స్ జట్టులో ఎంపికయ్యాడు. [5]

స్టబ్స్‌కు డచ్ పాస్‌పోర్ట్‌ కూడా ఉంది. 2021లో డచ్ టాప్‌క్లాస్సేలో క్లబ్ క్రికెట్ ఆడేందుకు ఎక్సెల్సియర్ '20తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. [6]

2022 మేలో, ముంబై ఇండియన్స్ 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం తమ జట్టులో స్టబ్స్‌ను చేర్చుకుంది. గాయం కారణంగా అవుట్ అయిన టైమల్ మిల్స్ స్థానంలో అతను చేరాడు.[7] అదే నెలలో, స్టబ్స్ భారతదేశంతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు, [8] అది అతని తొలి అంతర్జాతీయ పిలుపు. [9] తన తొట్టతొలి T20I ని 2022 జూన్ 9న, దక్షిణాఫ్రికా తరపున భారత జట్టుతో ఆడాడు. [10]


2022 జూలైలో, అతను లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్ కు సంతకం చేసాడు. [11]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2023 మార్చిలో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో స్టబ్స్‌ని తీసుకున్నారు. [12] అతను 2023 మార్చి 18న సిరీస్‌లోని రెండవ వన్‌డేలో తన తొలి వన్‌డే ఆడాడు.[13]

మూలాలు

మార్చు
  1. "Tristan Stubbs". ESPN Cricinfo. Retrieved 18 January 2020.
  2. "Cross Pool, CSA 3-Day Provincial Cup at Oudtshoorn, Jan 16-18 2020". ESPN Cricinfo. Retrieved 18 January 2020.
  3. "Pool A, CSA Provincial One-Day Challenge at Pietermaritzburg, Feb 16 2020". ESPN Cricinfo. Retrieved 16 February 2020.
  4. "6th Match, Durban, Feb 21 2021, CSA T20 Challenge". ESPN Cricinfo. Retrieved 20 February 2021.
  5. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  6. "Tristan Stubbs to join Excelsior Schiedam". Emerging Cricket. 19 March 2021. Retrieved 6 July 2023.
  7. "IPL 2022: Tristan Stubbs replaces injured Tymal Mills in Mumbai Indians' squad". ESPN Cricinfo. Retrieved 5 May 2022.
  8. "Nortje back in South Africa squad for India T20Is; Stubbs earns maiden call-up". ESPN Cricinfo. Retrieved 17 May 2022.
  9. "Stubbs receives maiden Proteas call-up for T20I series vs India". Cricket South Africa. Archived from the original on 17 మే 2022. Retrieved 17 May 2022.
  10. "1st T20I (N), Delhi, June 09, 2022, South Africa tour of India". ESPN Cricinfo. Retrieved 9 June 2022.
  11. "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 6 July 2022.
  12. "Markram announced as new T20I captain; South Africa name squads for West Indies limited-overs leg". International Cricket Council. Retrieved 6 March 2023.
  13. "2nd ODI (D/N), East London, March 18, 2023, West Indies tour of South Africa". ESPN Cricinfo. Retrieved 18 March 2023.