ఠాకూర్ రాజారాం సింగ్

ఠాకూర్ రాజారాం సింగ్ తెలంగాణ చరిత్ర పితామహుడు.[1]

రాజారాం సింగ్ 1928, సెప్టెంబర్ 15న ఠాకూర్ నారాయణసింగ్, కష్ణాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి లో జన్మించాడు.

విద్యాభ్యాసం

మార్చు

1947లో అలీఘడ్ యూనివర్సిటి నుంచి మెట్రిక్యులేషన్ చదివి, 1956లో గ్వాలియర్ యూనివర్సిటినుంచి ఇంటర్మీడియెట్ పూర్తిచేశాడు. 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎల్.ఎల్.బి. చదివాడు. 1975లో జైపూర్ యూనివర్సిటి నుండి ఎం.ఏ (ఆర్కియాలజీ) పట్టాను అందుకొని, అదే సంవత్సరంలో పూనా యూనివర్సిటిలో చరిత్ర పరిశోధక విద్యార్థిగా చేరాడు. హైద్రాబాద్ కి వచ్చి, చదువు కొనసాగిస్తూనే కామ్రేడ్స్ క్లబ్, ఆంధ్ర మహాసభల్లో పనిచేశాడు.

ఉద్యమ జీవితం

మార్చు

చిన్నప్పటి నుండి అన్యాయాల్ని ఎదిరించే తత్వమున్న రాజారాం సింగ్, 11 ఏళ్ల వయసులో తన మేనమామైన బలదేవ్ సింగ్‌తో 1939లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా, తమ్ముడు శ్యామసుందర్ సింగ్‌ తో కలిసి నిజాం వ్యతిరేక పోరాటంలో విద్యార్థి నాయకుడుగా పాల్గొన్నాడు.

సాహిత్య జీవితం

మార్చు

రాజారాం సింగ్ చదువుకునే రోజులనుండే ‘అమరభారతి’ అనే కలం పేరుతో కవిత్వం రాస్తుండేవాడు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో మంచిపట్టున్న రాజారాం సింగ్ కొంతకాలం జర్నలిస్టుగా కూడ పనిచేశాడు.

తెలంగాణ చరిత్ర పరిశోధన

మార్చు

రాజారాం సింగ్ తెలంగాణ మొత్తం తిరిగి స్వయంగా తెలుసుకున్న విషయాలతో తెలంగాణ చరిత్రను రాశాడు. ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ (పట్టణ) జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, మెదక్ జిల్లా జిల్లాల్లో చారిత్రకాన్వేషణలు చేసి, ‘బాసర నుంచి భద్రాచలం దాక’ వంటి ఎన్నో చారిత్రక పరిశోధనా పత్రాలను రాశాడు. వీరు 75 ఏళ్ళ వయస్సులో 2003 జూలై 27వ తేదీన పెద్దపల్లి లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వీరి డైరీలను పరిశీలిస్తే వీరు పరిశోధించిన అనేక విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. దక్కన్ ల్యాండ్. "తెలంగాణ చరిత్ర పితామహుడు – ఠాకూర్ రాజారాం సింగ్". deccanland.com. Retrieved 23 June 2017.[permanent dead link]