డగ్ ఫ్రీమాన్

న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు

డగ్లస్ లిన్‌ఫోర్డ్ ఫ్రీమాన్ (1914, సెప్టెంబరు 8 - 1994, మే 31) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. 1933లో రెండు టెస్టులు ఆడాడు.

డగ్లస్ లిన్‌ఫోర్డ్ ఫ్రీమాన్
దస్త్రం:Doug Freeman.jpg
డగ్లస్ లిన్‌ఫోర్డ్ ఫ్రీమాన్ (1933)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డగ్లస్ లిన్‌ఫోర్డ్ ఫ్రీమాన్
పుట్టిన తేదీ(1914-09-08)1914 సెప్టెంబరు 8
రాండ్విక్, సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియా
మరణించిన తేదీ1994 మే 31(1994-05-31) (వయసు 79)
సిడ్నీ, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 23)1933 24 March - England తో
చివరి టెస్టు1933 31 March - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 2 5
చేసిన పరుగులు 2 28
బ్యాటింగు సగటు 1.00 4.66
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 1 8
వేసిన బంతులు 240 678
వికెట్లు 1 14
బౌలింగు సగటు 169.00 35.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/91 5/102
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/–
మూలం: Cricinfo, 1 April 2017

డగ్లస్ లిన్‌ఫోర్డ్ ఫ్రీమాన్ 1914, సెప్టెంబరు 8న ఆస్ట్రేలియాలో సిడ్నీ శివారులోని రాండ్‌విక్‌లో జన్మించాడు.

డగ్లస్ లిన్‌ఫోర్డ్ ఫ్రీమాన్ 1994, మే 31న సిడ్నీలో మరణించాడు.

క్రికెట్ కెరీర్

మార్చు

ఫ్రీమాన్ 1931 నుండి 1933 వరకు నెల్సన్ కళాశాల చదివాడు.[1] 1931-32లో నెల్సన్ క్లబ్ పోటీలో కళాశాల జట్టు తరపున ఒక మ్యాచ్‌లో 18 వికెట్లు ( 64 పరుగులకు 8 వికెట్లు, 132 పరుగులకు 10 వికెట్లు) తీశాడు.[2]

లెగ్-స్పిన్నర్ గా 1933 జనవరిలో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. టెస్ట్ అరంగేట్రంకు కేవలం రెండు నెలల ముందు, ఆక్లాండ్‌పై వెల్లింగ్టన్ తరపున 85 పరుగులకు 4 వికెట్లు, 102 పరుగులకు 5 వికెట్లు తీశాడు.[3] రెండవ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో, ఎంసిసికి వ్యతిరేకంగా వెల్లింగ్టన్ తరపున 71 పరుగులకు 3 వికెట్లు (ఎడ్డీ పేంటర్, వాలీ హమ్మండ్, లెస్ అమెస్) తీసుకున్నాడు.[4] 1933 జనవరి, ఫిబ్రవరిలో నెల్సన్ కోసం తన మొదటి రెండు హాక్ కప్ మ్యాచ్‌లు ఆడాడు.[5]

ఫ్రీమాన్ పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఎంపికయ్యాడు. 1933 మార్చిలో 18 ఏళ్ళ 197 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.[6] డేనియల్ వెట్టోరి 1997లో అరంగేట్రం చేసేవరకు న్యూజీలాండ్‌కు చెందిన అతి పిన్న వయస్కుడైన టెస్ట్ క్రికెటర్. ఈ సిరీస్‌లోని రెండు టెస్టుల్లో ఫ్రీమాన్ ఒక వికెట్ మాత్రమే (హెర్బర్ట్ సట్‌క్లిఫ్) తీసుకున్నాడు. 1933-34 సీజన్‌లో వెల్లింగ్టన్ తరపున ఒక మ్యాచ్ ఆడాడు, ఒక వికెట్ తీశాడు. 19 సంవత్సరాల వయస్సులో అతని ఫస్ట్-క్లాస్ కెరీర్ ముగిసింది.

మూలాలు

మార్చు
  1. Nelson College Old Boys' Register, 1856–2006, 6th edition
  2. Error on call to Template:cite paper: Parameter title must be specified
  3. Auckland v Wellington, 1932-33
  4. Wellington v MCC, 1932-33
  5. Hawke Cup, 1932-33
  6. Player profile on ESPN Cricinfo

బాహ్య లింకులు

మార్చు