1956, జనవరి 26న ముంబాయిలో జన్మించిన డయానా ఎడుల్జీ (Diana Fram Edulji) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె క్రికెట్ ఆడటానికి ముందు బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ జూనియర్ స్థాయిలలో ఆడింది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ లాలా అమర్‌నాథ్ నిర్వహించిన క్రికెట్ క్యాంపు వల్ల ఆమె క్రికెట్ లో నైపుణ్యం సాధించింది. ఎడుల్జీ ప్రారంభంలో రైల్వేస్ తరఫున ఆ తర్వాత భారత జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఈమె ఎడమచేతితో బౌలింగ్ చేసేది.

మూలాలుసవరించు