వై. దివాకరరావు

(డా. దివాకర్ నుండి దారిమార్పు చెందింది)

డా. వై. దివాకరరావు (1949 సెప్టెంబరు 26) చెవిముక్కుగొంతు వైద్యుడుగా దేశవిదేశాలలో విశేషసేవలందించి, ప్రస్తుతం కాకినాడలో ప్రాక్టీసు చేస్తున్నారు. రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాదానత ఇచ్చాడు. సంప్రదాయబద్దంగా సాగిపోతున్న నాటకాలకు ఓ విధమైన కొంగ్రొత్త ఒరవడిని కల్పిస్తూ, అంతవరకూ ఉన్న చట్రాలను చెల్లా చెదురు చేసేసాడు. కడుపుబ్బా నవ్వుకునే ‘పన్’లతో నిమ్ పేశాడు. చదువుకునే రోజుల్నుంచీ అక్షరాలతో ఆటలాడుతూ పదవిరుపుల తో ‘పన్’దాలు వేస్తూ, మానవశరీరంలో హాస్యగ్రంధులను సుతారంగా మీటిన డాక్టరుగా ఈయన అందరికీ సుపరిచితుడే!

దస్త్రం:Dr.DIWAKAR.jpg

బాల్యం, చదువు

మార్చు

పుటింది మద్రాసులో.. పెరిగింది నెల్లూరులో... చదివిందీ, ప్రస్తుతం ఉంటున్నదీ కాకినాడలో...! అమ్మ ......... నెల్లూరు టిబి హాస్పిటల్ సూపరింటెండెంట్గా, నాన్న .......... పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసేవారు. అతి చిన్నతనంలో తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా నెల్లూరు చేరుకున్న దివాకర్ ప్రాథమిక విద్య నుంచి, ఇంటర్మీడియట్ వరకూ అక్కడే పూర్తి చేసుకుని, బియస్సీ డిగ్రీ విజయవాడ లయోలాలో చదువుకున్నారు. చిన్నతనంలోనే నాన్న కాలం చేయడంతో తల్లి ప్రభావమే ఈయనపై ఎక్కువ. అందుకే అమ్మలాగే తానుకూడా డాక్టరు కావాలనుకుని, మెడికల్ ఎంట్రన్స్ రాసి, మంచి మార్కులతో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబిబియస్లో చేరారు. ప్రాథమిక పాఠశాలలో ఫాన్సీ డ్రస్ కాంపిటీషన్ కోసం తొలిసారిగా మొహానికి అద్దుకున్న రంగువాసన కాలంతో బాటూ ఆయనతోనే కొనసాగుతూ, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, డిగ్రీ, వైద్య కళాశాలల వార్షికోత్సవ సంబరాలలో వేదికనెక్కించింది. ఎప్పటికప్పుడు కొత్తగా ఇంకేం చేద్దామా? అని ఆలోచిస్తూ, వచ్చిన ప్రతి కొత్త ఆలోచననూ రంగస్థలంపై ఆవిష్కరిస్తూ ... అందరిచేతా శహ‘బాస్’ అనిపించి, రంగరాయ ‘రంగుల రాజ్యానికి’(కల్చరల్ యాక్టివిటీస్) కట్టి పడేసింది. మొహానికి రంగులేసుకోవాలన్న ఉత్సాహం ఎంబిబియస్ పూర్తయినా, కాలేజీని వదలనివ్వలేదు... ఆయన చేత బలవంతంగా డిఎల్వో చదివించింది.

వృత్తి ప్రవృత్తి

మార్చు

చక్కగా చదువుకుని అమ్మలాగే డాక్టరవ్వాలన్నది ఒక లక్ష్యం...! నాటకరంగంమ్మీద రాణిస్తూ ప్రేక్షకులను అలరించాలన్నది మరో లక్ష్యం...! ఏది వృత్తిగా తీసుకోవాలి? ఏది ప్రవృత్తిగా ఎంచుకోవాలి? సందిగ్ధావస్థలోనే చాలా కాలం గడచిపోయింది. విభిన్నమయిన ఈ రెండుదారులూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ జీవితంలో ఒక అడుగు ముందుకీ, రెండడుగులు వెనక్కీ చందంగా లాగేస్తుంటే... ఎటూ తేల్చుకోలేని స్థితిలో కాకినాడ సాలిపేటలోనే సంవత్సరాలు కదలిపోతుంటే... రా రమ్మంటూ ‘లిబియా’ పిలిచింది. నాటకాన్ని అటకమీద పెట్టి, స్టెత్ను చేతబట్టి కొద్ది సంవత్సరాలపాటు మందులు రోగాల మధ్య బిజీబిజీగా గడిపేస్తుండగా, లిబియాలోని కొందరు తెలుగువాళ్ళు, ఆ దేశంలోని కొందరు నాటక ప్రియులు కలవడంతో మళ్ళీ నాటకం మొదలయ్యింది. తెలుగు నాటకం మీద ప్రేమ మళ్ళీ కాకినాడకు లాక్కొచ్చింది. ఏంచెయ్యాలన్న ఆలోచనతో కొద్దికాలం తటపటాయించినా, పిల్లలు పెద్దవాళ్ళవుతుండటంతో నాటకాన్ని ప్రవృత్తిగా అట్టేపెట్టి, వైద్యాన్ని వృత్తిగా తీసుకుని సాలిపేటలోనే ప్రాక్టీసు ప్రారంభించారు.

వైద్యవృత్తి: కాకినాడ లో ప్రస్తుతం చెవి ముక్కు గొంతు వ్యాధుల నిపుణుడి గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

మార్చు

రచనావ్యాసాంగం

మార్చు

నాటకరంగం

మార్చు

స్నేహబంధం: తల్లి తండ్రులకు ఈయన ఏకైక సంతానం కావడంతో స్నేహితులతోనే కాలం గడిచిపోయేది.

మార్చు

కుటుంబం

మార్చు