డిబ్రూగఢ్

అసోం రాష్ట్రంలోని డిబ్రూగర్, జిల్లా ప్రధాన కార్యాలయం.
(డిబ్రూగర్ నుండి దారిమార్పు చెందింది)

డిబ్రూగర్, అసోం రాష్ట్రంలోని డిబ్రూగర్ జిల్లా ముఖ్య నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం.

డిబ్రూగర్
టి-ఫావో [1]
నగరం
డిబ్రూగర్ is located in Assam
డిబ్రూగర్
డిబ్రూగర్
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
డిబ్రూగర్ is located in India
డిబ్రూగర్
డిబ్రూగర్
డిబ్రూగర్ (India)
Coordinates: 27°29′N 95°00′E / 27.48°N 95°E / 27.48; 95
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
Government
 • Typeపురపాలక సంస్థ
 • Bodyడిబ్రూగర్ పురపాలక సంస్థ
 • ఏర్పాటు1873
 • వార్డుల సంఖ్య22
 • చైర్మన్సోమ చక్రవర్తి (బిజెపి)
విస్తీర్ణం
 • Total12.65 కి.మీ2 (4.88 చ. మై)
Elevation
108 మీ (354 అ.)
జనాభా
 (2011)
 • Total1,54,019
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
7860 XX
టెలిఫోన్ కోడ్+91 - (0) 373 - XX XX XXX
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్-06

పద వివరణ

మార్చు

డిబ్రూగర్ అనే పేరును దిబారుముఖ్ నుండి తీసుకున్నారు. "డిబ్రూ" అనే పేరు డిబారు నది పేరు నుండి వచ్చింది. దిమాసా భాషలో "డిబ్రూ" అనగా "పొక్కు", "గర్" అనగా "కోట" అని అర్ధం. "దిబ్రు", "దిబారు" రెండూ దిమాసా పదాలు.[2]

చరిత్ర

మార్చు

సా.శ 1523 వరకు ఈ డిబ్రూగర్ ప్రాంతం చుటియా రాజ్యంలో భాగంగా ఉండేది. దీనిని అహోమ్ బురంజీలో టి-ఫావో అని పిలిచేవారు.[3]

జనాభా గణాంకాలు

మార్చు
డిబ్రూగర్ లో మతాల ప్రకారం జనాభా (2001)[4]
మతం శాతం
హిందువులు
  
94.37%
ముస్లింలు
  
4.68%
బౌద్ధులు
  
0.36%
సిక్కులు
  
0.23%
ఇతరులు†
  
0.27%
మతాలు ప్రకారం
Includes జైనులు (<0.1%)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [5] డిబ్రూగర్ జనాభా 154,019ఆ ఉంది. ఈ జనాభాలో పురుషులు 54% మంది, మహిళలు 46% మంది ఉన్నారు. స్త్రీపురుష నిష్పత్తి 1000:961 గా ఉంది. డిబ్రూగర్ సగటు అక్షరాస్యత రేటు 89.5% కాగా, ఇది జాతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే ఎక్కువగా ఉంది. డిబ్రూగర్ జనాభాలో 9% మంది 0, 6 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. బాలబాలికల నిష్పత్తి 1000:940 గా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం డిబ్రూగర్ నగర ప్రాంతంలో 154,019 జనాభా ఉంది.[6]

రవాణా

మార్చు

విమానయానం

మార్చు

నగరానికి 15 కి.మీ.ల దూరంలో డిబ్రూగర్ విమానాశ్రయం ఉంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, విస్టారా, పవన్ హన్స్ లిమిటెడ్ మొదలైన సంస్థలు ఈ విమానాశ్రయం నుండి తమ విమానాలను నడిపిస్తున్నాయి.

భారత రైల్వే చరిత్రలో డిబ్రూగర్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ నుండి ఈశాన్య భారతదేశంకు మొదటి రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. 1882, మే 1న మొదటి రైలు స్ట్రీమెర్‌ఘాట్ నుండి డిబ్రూగర్ వరకు నడిచింది. 1882, మే 15న దీనిని దింజన్ వరకు విస్తరించారు. అదే సంవత్సరం డిసెంబరు 23న చాబువా వరకు గూడ్స్ రైలు ప్రవేశపెట్టబడింది. 1884, ఫిబ్రవరి 18న ఉదయం 7:20 గంటలకు అప్పటి అస్సాం చీఫ్ కమిషనర్ సర్ చార్లెస్ ఇలియట్ మొదటి యూరోపియన్ ప్యాసింజర్ రైలును రెహబరి రైలు స్టేషన్ (ఇప్పుడు డిబ్రూగర్ టౌన్ రైల్వే స్టేషన్) నుండి 400మంది యూరోపియన్, భారతీయ ప్రయాణీకులతో వెల్తున్న లెడోకు జెండా వూపి ప్రారంభించాడు. ఈ నగరంలోని రెండు రైల్వే స్టేషన్ల నుండి బెంగుళూరు, చెన్నై, కొచ్చి, త్రివేండ్రం, కోల్‌కతా, ఢిల్లీ, కన్యాకుమారి వంటి కొన్ని ముఖ్యమైన భారతీయ నగరాలకు రైళ్ళు నడుపబడుతున్పాయి.

జలమార్గాలు

మార్చు

డిబ్రూగర్ నగరం బ్రహ్మపుత్ర నది ద్వారా జలమార్గ రవాణా వ్యవస్థను కలిగి ఉంది. దీనిని జాతీయ జలమార్గం - 2 అని పిలుస్తారు. ఇది బంగ్లాదేశ్ సరిహద్దు నుండి సాదియా వరకు విస్తరించి ఉంది.

రాజకీయాలు

మార్చు

డిబ్రూగర్ నగరం డిబ్రూగర్ లోక్‌సభ నియోజకవర్గ వరధిలో ఉంది. రామేశ్వర్ తేలి (బిజెపి) ప్రస్తుత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ముఖ్యమంత్రి జోగేంద్ర నాథ్ హజారికా డిబ్రూగర్ నగరానికి చెందినవారు.[7]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. (Gogoi 2014:34),Note:As per Ahom Buranji
  2. "About Dibrugarh". dibru.ac.in. Retrieved 20 November 2020.
  3. Gogoi, Kamini (2014). Chow Habung (1st ed. April, 2014 ed.). Chiring Chapari Dibrugarh: S. Tamuly Machkhowa, Nakachari P.O. Chungi Lahing Jorhat district, Assam. p. 34.
  4. "Dibrugarh Census Report". Dibrugarh.gov.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 20 నవంబరు 2020.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 20 November 2020.
  6. "Census 2011 Data of Indian Population 2011 Census". Census2011.co.in. Retrieved 15 June 2013.
  7. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 4 మే 2006. Retrieved 20 నవంబరు 2020.

ఇతర లంకెలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.