'డి. సుజాతాదేవి' ఒక తెలుగు రచయిత్రి. ఈవిడ రచించిన ఆటలో అరటిపండు చిన్న పిల్లల కథాసంకలనానినకి 2013 భారత సాహిత్య అకాడమీ పురస్కారము వరించింది.

డోకల సుజాతాదేవి
D.Sujatha devi,writer.jpg
డి. సుజాతాదేవి
జననండి. సుజాతాదేవి
ఇతర పేర్లుడి. సుజాతాదేవి
ప్రసిద్ధితెలుగు రచయిత్రి
భార్య / భర్తడోకల నారాయణరావు

నేపథ్యముసవరించు

ఈమె పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చింతపల్లి గ్రామంలో 1949, ఏప్రిల్ 26న సీతామహాలక్ష్మి, నాగభూషణం దంపతులకు జన్మించింది[1]. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశారు. ‘ఆహ్వానం’ తెలుగు సాహిత్య పత్రిక, ఆంధ్రమహిళా సభ పబ్లికేషన్స్ విభాగం, సీపీ బ్రౌన్ అకాడమీల్లో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె భర్త డాక్టర్ నారాయణరావు ఆడిటర్. ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పద్మజ చిత్రకారిణి. రెండో అమ్మాయి అంజలి సైకాలజిస్ట్. మూడో కూతురు శైలజ వ్యాపార రంగంలో ఉన్నారు.

సంస్కృతీ, సంప్రదాయాలు, నైతిక విలువలు, మంచి, చెడులు... పిల్లలు తమ ప్రవర్తనను ఎలా ఉంచుకోవాలి? క్రమశిక్షణతో తమను తాము ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకొంటూ ఎలా ముందుకు సాగాలి?... ఇవే సుజాత కథావస్తువులు. 1980 నుంచి పిల్లల కథలు రాశారు. అడవిలో జంతువుల మధ్య సంభాషణలతో కథ నడిపిస్తూ... అంతర్లీనంగా అనేక సామాజిక విలువలను బోధిస్తూ రాసిన ‘ఆటలో అరటిపండు’ పుస్తకంలోని కథలు చిన్నారులను ఎంతో ఆకట్టుకున్నాయి.

రచనలుసవరించు

25కు పైగా ప్రకటితమైన ఆమె రచనల్లో 18 పిల్లలవే. 2013 సంవత్సరానికి గానూ తెలుగులో మొత్తం 576 మంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కోసం పోటీపడ్డారు. వారందరిలో సుజాతకే పురస్కారం దక్కడం విశేషం. నిజానికి 1970 నుంచే ఆమె కథలు వివిధ పత్రికలు, రేడియోలో వచ్చేవి. గేయాల రూపంలో కథలు చెప్పడం ఆమెకున్న మరో ప్రత్యేకత. ఆమె వెలువరించిన పుస్తకాలలో కొన్ని:

 1. వేకువరేకలు (చిన్న కథలు)
 2. గెలుపు (చిన్న కథలు)
 3. చేపలు (చిన్న కథలు)
 4. కిన్నెర (పిల్లల పాటలు)
 5. అందరమూ ఒకటే (పిల్లల పాటలు)
 6. మల్లి పాటలు (జానపదబాణీ పాటలు)
 7. అడవిలో కొలను (అనువాద నవల)
 8. సుజలాం సుఫలాం (పర్యావరణ నవల)
 9. చిట్టడవిలో చిన్న ప్రాణులు
 10. కాకి-కోకిల
 11. డాక్టర్ కొక్కొరొకో
 12. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
 13. ఆటలో అరటిపండు
 14. ముఖేముఖే సరస్వతీ

పురస్కారములుసవరించు

 • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
 • రెండుసార్లు ఎన్‌సీఈఆర్‌టీ
 • మాడభూషి మెమోరియల్
 • నన్నపనేని బాల సాహిత్య పురస్కారం
 • కోడూరి లీలావతి స్మారక బహుమతి వంటివెన్నో అవార్డులు సుజాత అందుకున్నారు.

మూలాలుసవరించు

 1. పైడిమర్రి రామకృష్ణ (19 May 2018). "బాలసాహితీబంధువులు - 52, బాలసాహిత్యంలో మొట్టమొదటి కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత". ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original on 22 మే 2018. Retrieved 19 May 2018. Check date values in: |archive-date= (help)

యితర లింకులుసవరించు