డెన్నిస్ లిల్లీ

1949, జూలై 18న జన్మించిన డెన్నిస్ లిల్లీ (Dennis Keith Lillee) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతని కాలంలో ప్రముఖ ఫాస్ట్ బౌలర్‌గా పేరుసంపాదించాడు.[1] 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధిమ్చిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.[2] 2004 నుండి 2015 వరకు లిల్లీ, వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషను ప్రెసిడెంటుగా పనిచేసాడు.[3][4]

డెన్నిస్ లిల్లీ

టెస్ట్ క్రికెట్

మార్చు

20 సంవత్సరాల ప్రాయంలోనే 1969-70లో లిల్లీ పశ్చిమ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్ చివరిలో ఆస్ట్రేలియన్ రెండో జట్టు తరఫున న్యూజీలాండ్ పర్యటించి 16.44 పరుగుల సగటుతో 18 వికెట్లు తీశాడు.[5] తదుపరి సీజన్‌లో లిల్లీ అడిలైడ్ టెస్టుతో టెస్ట్ క్రికెట్‌లో రంగప్రవేశం చేశాడు. తొలి సాధన లోనే 83 పరుగులకు 5 వికెట్లు సాధించాడు. 1971-72లో పెర్త్ లో గారీ సోబర్స్, క్లైవ్ లాయిడ్, రోహన్ కన్హాయ్, సునీల్ గవాస్కర్ లాంటి హేమాహేమీలు ఉన్న ప్రపంచ ఎలెవన్ (World XI) పై ఆడుతూ 29 పరుగులకే 8 వికెట్లు పడగొట్టినాడు. 1972లో ఇంగ్లాడు పర్యటనలో కూడా ఇదే ప్రతిభను కొనసాగించి తనకు తానే గొప్ప బౌలర్‌గా విశ్వసం ప్రకటించుకున్నాడు.[6] ఆ సీరీస్ 2-2 తో డ్రాగా ముగిసిననూ 17.67 సగటుతో 31 వికెట్లు సాధించి తన సత్తా చూపించాడు. ఈ ప్రతిభ మూలంగా 1973లో విజ్డెన్ అవార్డులు పొందిన 5 క్రికెటర్లలో ఇతని పేరు కూడా ఎన్నుకోబడింది.[7]

మొత్తంపై లిల్లీ 70 టెస్టులు ఆడి 23.92 సగటుతో 355 వికెట్లు పడగొట్టినాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 23 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 7 సార్లు సాధించాడు. టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 83 పరుగులకు 7 వికెట్లు. బ్యాటింగ్‌లో 905 పరుగులు కూడా చేశాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 73 నాటౌట్.

వన్డే క్రికెట్

మార్చు

లిల్లీ 63 వన్డేలు ఆడి 20.82 సగటుతో 103 వికెట్లు సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 34 పరుగులకు 5 వికెట్లు. వన్డే బ్యాటింగ్‌లో అతడి అతుఅధిక స్కోరు 42 నాటౌట్.

మూలాలు

మార్చు
  1. BBC Sport: Ashes legends - Dennis Lillee. Retrieved 18 September 2007.
  2. MCG.org: Dennis Lillee. Archived 2007-08-31 at the Wayback Machine Retrieved 18 September 2007.
  3. Lillee honoured by WACA presidency (30 September 2004)
  4. Townsend, John (3 September 2015). "What made Dennis Lillee walk from the WACA". Archived from the original on 4 February 2016. Retrieved 29 January 2016.
  5. Cricinfo: Australia in New Zealand 1969–70 tour statistics.
  6. Cricinfo.com: Massie's mystery, Lillee's menace. Retrieved 18 September 2007.
  7. Wisden, 1973 edition: Cricketer of the Year Dennis Lillee