డెల్లా గాడ్‌ఫ్రే
డెల్లా గాడ్‌ఫ్రే తెలుగుదేశం పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఈమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ నియమిత స్థానానికి నియమితురాలై, రెండు పర్యాయాలు శాసనసభ సభ్యురాలిగా పనిచేసింది.
డెల్లా గాడ్‌ఫ్రే | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
In office 1994–2004 | |
నియోజకవర్గం | ఆంగ్లో ఇండియన్ నియమితస్థానం |
వ్యక్తిగత వివరాలు | |
మరణం | 23 ఏప్రిల్ 2019 |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
జీవితచరిత్ర
మార్చుడెల్లా గాడ్ఫ్రే హైదరాబాదులో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి ఆలెన్ గాడ్‌ఫ్రే ఆలెన్ గాడ్ఫ్రే, నిజాం ప్రభుత్వం యొక్క నాణేల ముద్రణాశాలలో ఇంజనీరుగా పనిచేశాడు. ఈమె తల్లి మార్జొరీ గాడ్‌ఫ్రే, విద్యావేత్త, 5వ లోక్‌సభలో మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంగ్లో ఇండియన్ నియమిత ప్రతినిధిగా పనిచేసింది. డెల్లా గాడ్‌ఫ్రే విద్యాభ్యాసం రోజరీ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో, కోఠీ మహిళా కళాశాలలో కొనసాగింది. డెల్లా రాయల్ డచ్ ఎయిర్‌లైన్సులో మేనేజరుగా పనిచేసింది. డెల్లా గాడ్‌ఫ్రే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ నియమిత స్థానానికి నియమితురాలై, 2004 వరకు శాసనసభ సభ్యురాలిగా పనిచేసింది. ఈమె 2019 ఏప్రిల్ 23న హైదరాబాదులో మరణించింది.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ "Hyderabad: Former nominated MLA Della Godfrey passes away". Telangana Today. 23 April 2019. Retrieved 31 October 2019.
- ↑ "Della Godfrey dies after cardiac arrest". Deccan Chronicle. 24 April 2019. Retrieved 31 October 2019.
- ↑ "Former MLA Della Godfrey passes away". The Times of India. 24 April 2019. Retrieved 31 October 2019.