1960, డిసెంబర్ 29న జన్మించిన డేవిడ్ బూన్ (David Boon) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980, 1990 దశకంలో ఆస్ట్రేలియా తరఫున 107 టెస్టులలో, 181 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో టాస్మేనియా తరఫున ఆడుతూ 1978-79లో జిల్లెట్ కప్‌లో టాస్మేనియా ఆశ్చర్యకరమైన విజయానికి దోహదపడ్డాడు.[1]

డేవిడ్ బూన్
David Boon, booksigning.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు డేవిడ్ క్లారెన్స్ బూన్
జననం (1960-12-29) 1960 డిసెంబరు 29 (వయస్సు 60)
లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి Right arm off break
పాత్ర బ్యాట్స్ మన్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు ఆస్ట్రేలియా
టెస్టు అరంగ్రేటం(cap 325) 23 నవంబరు 1984 v వెస్టిండీస్
చివరి టెస్టు 29 జనవరి 1996 v శ్రీలంక
వన్డే లలో ప్రవేశం(cap 80) 12 ఫిబ్రవరి 1984 v వెస్టిండీస్
చివరి వన్డే 15 మార్చి 1995 v వెస్టిండీస్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1978–1999 టాస్మానియా టైగర్స్
1997–1999 Durham
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ అంతర్జాతీయ వన్డేలు దేశీవాళీ క్రికెట్ LA
మ్యాచ్‌లు 107 181 350 313
సాధించిన పరుగులు 7,422 5,964 23,413 10,236
బ్యాటింగ్ సగటు 43.65 37.04 44.00 37.49
100s/50s 21/32 5/37 68/114 9/68
ఉత్తమ స్కోరు 200 122 227 172
బాల్స్ వేసినవి 36 82 1,153 280
వికెట్లు 0 0 14 4
బౌలింగ్ సగటు 49.71 66.50
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0
మ్యాచ్ లో 10 వికెట్లు n/a 0 n/a
ఉత్తమ బౌలింగ్ 2/18 2/44
క్యాచులు/స్టంపింగులు 99/– 45/– 283/– 82/–
Source: క్రిక్ ఇన్ఫో, 9 డిసెంబరు 2009

టెస్ట్ క్రికెట్ గణాంకాలుసవరించు

డేవిడ్ బూన్ 107 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 43.65 సగటుతో 7422 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు, 32 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు సరిగ్గా 200 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలుసవరించు

బూన్ 181 వన్డేలు ఆడి 37.04 సగటుతో 5946 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 122 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్సవరించు

డేవిడ్ బూన్ ఆస్ట్రేలియా విజయం సాధించిన 1987 ప్రపంచ కప్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు. భారత ఉపఖండంలో జరిగిన ఆ టోర్నమెంటులో 55.87 సగటుతో 447 పరుగులు సాధించాడు. లాహోర్లో జరిగిన సెమీఫైనల్‌లో పాకిస్తాన్ పై 65 పరుగులు సాధించాడు. కోల్‌కతలో జరిగిన ఫైనల్‌లో 75 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[2] 1987 ప్రపంచకప్‌ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డేవిడ్‌ బూన్‌. ఆస్ట్రేలియా విజయంలో డేవిడ్ బూన్దే కీలకపాత్ర. పాకిస్థాన్‌తో సెమీస్‌లో 65 పరుగులు చేసిన బూన్‌ ఫైనల్లో 75 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీలో అతను 8 మ్యాచ్‌ల్లో 447 పరుగులు చేశాడు

మూలాలుసవరించు

  1. Cricinfo: David Boon player profile.
  2. Wisden, 1988 edition: World Cup final Australia v England, match report.