డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు మేరుగు నాగార్జున

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు ఉషశ్రీ చరణ్‌

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
ముందు కార్యాలయం ఏర్పాటు చేశారు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు గుర్రాల వెంకట శేషు
నియోజకవర్గం కొండపి

వ్యక్తిగత వివరాలు

జననం (1971-12-04) 1971 డిసెంబరు 4 (వయసు 53)
తూర్పు నాయుడుపాలెం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు డోలా కోటయ్య
వృత్తి రాజకీయ నాయకుడు, డాక్టర్

జననం, విద్యాభాస్యం

మార్చు

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి 4 డిసెంబర్ 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, తూర్పు నాయుడుపాలెంలో జన్మించాడు. ఆయన విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర రావు పై 5440 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్యపై 1,024 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కొండపి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024 జూన్ 12 నుండి సాంఘిక సంక్షేమ & సాధికారత, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం, సచివాలయం & గ్రామ వాలంటీర్లు శాఖ మంత్రి భాద్యతలు చేపట్టాడు.[6]

మూలాలు

మార్చు
  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (28 April 2015). "ఫలించిన కల". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  4. TV9 Telugu (23 May 2019). "ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019:". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. EENADU (13 June 2024). "సామాన్యుడిగా పేరు.. చిరస్మరణీయ పోరు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  6. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.